హైదరాబాద్ : అక్కినేని నాగేశ్వరరావు అంత్యక్రియాలు గురువారం ఎర్రగడ్డ స్మశానవాటికలో జరగనున్నాయి. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులుఎ తెలిపారు. అక్కినేని నాగేశ్వరరావు గత రాత్రి అస్వస్థతకు గురి కావటంతో వెంటనే ఆయన్ని కేర్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఏఎన్నార్ మృతి చెందారు. ఈరోజు సాయంత్రం వరకూ అభిమానుల సందర్శనార్థం అక్కినేని పార్థీవ దేహాన్ని అన్నపూర్ణ స్టూడియోలో ఉంచుతారు. కాగా అక్కినేని నివాసంలో ఉంచిన ఆయన భౌతికకాయాన్ని దర్శించుకునేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.