fenural
-
కరోనా మృతుల అంత్యక్రియలు చూస్తారా
అమలాపురం టౌన్ : ఇప్పటి వరకూ కరోనాతో ఎవరైనా మరణిస్తే ఆ మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు రూ.వేలల్లో డిమాండ్ చేసిన పరిణామాలు చూశాం. అమలాపురం ప్రాంతంలో కొంతమంది మరో అడుగు ముందుకేసి కరోనాతో మృతి చెందిన కుటుంబ సభ్యులతో ఫోన్ల ద్వారా సరికొత్త బేరసారాలకు దిగుతున్న వ్యవహారం తాజాగా వెలుగుచూసింది. కరోనాతో ఆస్పత్రుల్లో చనిపోతున్న వారి మృతదేహాలను కుటుంబీకులు, బంధువులు వచ్చి తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహించే పరిస్థితులు లేవు. ఈ భయాన్ని, బలహీనతలను ఆసరా చేసుకొని అమలాపురంలో కొందరు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఒక్కో మృతదేహానికి రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకూ డిమాండ్ చేస్తున్న సంఘటనలు ‘సాక్షి’ దృష్టికి వచ్చాయి. ఆసుపత్రి వద్దే నిఘా... అమలాపురం కోవిడ్ ఆస్పత్రుల్లో ఎవరైనా మృతి చెందితే చాలు...ఆ సమాచారం కోసం అంత్యక్రియలు చేసేవారు ఆ ఆస్పత్రుల వద్ద కాచుకుని కూర్చుంటున్నారు. సీరియస్గా ఉండే కోవిడ్ బాధితుల కుటుంబీకుల ఫోన్ నంబర్లు ముందుగానే సేకరించి మరీ ఫోన్లు చేసి బేరసారాలు కుదుర్చుకుంటున్నారు. అంత్యక్రియలు మీరు దగ్గరుండి చూసే అవకాశం లేదు కాబట్టి మృతుని అంత్యక్రియలను వీడియో తీసి ఆ తృప్తిని మీకు అందిస్తాం ... అందుకు రూ.10 వేలు ఖర్చవుతుంద’ని బేరసారాలకు దిగుతున్నారు. మృతదేహానికి సంప్రదాయ బద్ధంగా చేయాల్సిన ప్రక్రియంతా శాస్త్రోక్తంగా శ్మశానంలో పూర్తి చేస్తాం...ఇందుకు రూ.5 వేలు ఖర్చవుతుందంటూ లిస్టు రాసి ఇచ్చేస్తున్నారు. వామ్మో... వదిలించుకోవడం ఎలా... అమలాపురం పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల పట్టణంలోని ఓ కోవిడ్ ఆస్పత్రిలో మృతి చెందారు. మరణించిన పది నిమిషాలకు ఈ తరహా ఫోన్లు మొదలయ్యాయి. మరణించిన వ్యక్తికి ముగ్గురు కుమారులు. ఓ కుమారుడు ఉన్నారు. ఉద్యోగ రీత్యా హైదరాబాద్లో ఉంటారు. తండ్రి మరణించాక కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన అమలాపురం రాలేకపోయారు. ఎక్కడో హైదరాబాద్లో ఉన్న ఆయనకు కూడా పదేపదే ఫోన్లు చేసి ‘వీడియో తీస్తా’మంటూ విసిగించడంతో ఆ బాధితుడు మీడియాకు సమాచారం అందించాడు. ఇక్కడ ఉన్న ఇద్దరు కుమారులకు కూడా సెంటిమెంట్ మాటలతో వీడియో...శాస్త్రోక్త పక్రియలంటూ ఫోన్లు చేసి ప్యాకేజీలంటూ వెంటపడ్డారు. ఇలాంటి అనుభవాలు గత రెండు వారాలుగా అమలాపురంలో మొదలయ్యాయని పలు బాధిత కుటుంబాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. అంత్యక్రియలకు రూ.వేలు గుంజుతున్న వైనంపై ఇటీవల మున్సిపల్ కమిషనర్ రాజు దృష్టి సారించారు. దీన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా ఈ ఫోన్ల బేరసారాలపై కూడా ఆయన దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
గొల్లపూడి మారుతీరావు చెన్నైలో అంత్యక్రియలు
-
ఆదివారం గొల్లపూడి అంత్యక్రియలు
సాక్షి, చెన్నై : ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావు అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం చెన్నైలో జరుగుతాయని ఆయన రెండో కుమారుడు రామకృష్ణ తెలిపారు. కాగా గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని లైఫ్లైన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. అయితే కుటుంబ సభ్యులు, బంధువులు విదేశాల నుంచి వచ్చే వరకూ గొల్లపూడి భౌతికకాయాన్ని ఆస్పత్రిలోనే ఉంచనున్నారు. శనివారం మధ్యాహ్నం ఆస్పత్రి నుంచి భౌతికకాయాన్ని గొల్లపూడి నివాసానికి తరలించి ఆదివారం మధ్యాహ్నం వరకూ అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు. మారుతీరావుకు ముగ్గురు మగ సంతానం సుబ్బారావు, రామకృష్ణ, శ్రీనివాస్. అయితే గొల్లపూడి చిన్నకుమారుడు శ్రీనివాస్ 1992లో ప్రేమ పుస్తకం అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తూ షూటింగ్ సమయంలో ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. కుమారుడి జ్ఞాపకంగా గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ అవార్డు నెలకొల్పి, ఉత్తమ నూతన సినిమా దర్శకునికి రూ. 1.5 లక్షలు నగదు బహుమతి అందిస్తున్నారు. కాగా గొల్లపూడి మారుతీరావు రచయితగా, నటుడుగా, సంపాదకుడుగా, వ్యాఖ్యాతగా, విలేఖరిగా తెలుగు సాహిత్యాభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. తెలుగు సినిమా రంగంలో మాటల రచయితగాను నటుడిగానూ సుపరిచితుడు. సినిమాల్లోకి రాకముందు నాటకాలు, కథలు, నవలలు రాశారు. రేడియో ప్రయోక్తగానూ, అసిస్టెంట్ స్టేషను డైరెక్టరుగా, ఆంధ్రప్రభ (దినపత్రిక) ఉప సంపాదకుడిగా పనిచేశారు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రంతో గొల్లపూడి చిత్రరంగ ప్రవేశం చేశారు. చదవండి: సీనియర్ నటుడు గొల్లపూడి కన్నుమూత కుమారుని మరణం కుంగదీసింది -
ప్రభుత్వ లాంఛనాలతో ఏఎన్ఆర్ అంత్యక్రియలు
హైదరాబాద్ : ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్లు సమాచార శాఖ మంత్రి డీకె అరుణ తెలిపారు. బుధవారం ఆమె అక్కినేని పార్థీవ దేహాన్ని సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డీకె అరుణ మాట్లాడుతూ ఓ మహానటుడిని కోల్పోయామని అన్నారు. కాగా అభిమానుల సందర్శనార్థం అక్కినేని భౌతికకాయాన్ని నేడు, రేపు అన్నపూర్ణ స్టూడియోలోనే ఉంచనున్నారు. గురువారం ఎర్రగడ్డ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయి. కాగా మరోవైపు అక్కినేని మృతికి సంతాపంగా సినిమా కార్యక్రమాలు నిలిపివేస్తున్నట్లు సీనియర్ నటుడు మురళీ మోహన్ తెలిపారు. -
ఎర్రగడ్డ శ్మశానవాటికలో రేపు ఏఎన్నార్ అంత్యక్రియలు
హైదరాబాద్ : అక్కినేని నాగేశ్వరరావు అంత్యక్రియాలు గురువారం ఎర్రగడ్డ స్మశానవాటికలో జరగనున్నాయి. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులుఎ తెలిపారు. అక్కినేని నాగేశ్వరరావు గత రాత్రి అస్వస్థతకు గురి కావటంతో వెంటనే ఆయన్ని కేర్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఏఎన్నార్ మృతి చెందారు. ఈరోజు సాయంత్రం వరకూ అభిమానుల సందర్శనార్థం అక్కినేని పార్థీవ దేహాన్ని అన్నపూర్ణ స్టూడియోలో ఉంచుతారు. కాగా అక్కినేని నివాసంలో ఉంచిన ఆయన భౌతికకాయాన్ని దర్శించుకునేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.