హైదరాబాద్ : ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్లు సమాచార శాఖ మంత్రి డీకె అరుణ తెలిపారు. బుధవారం ఆమె అక్కినేని పార్థీవ దేహాన్ని సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డీకె అరుణ మాట్లాడుతూ ఓ మహానటుడిని కోల్పోయామని అన్నారు.
కాగా అభిమానుల సందర్శనార్థం అక్కినేని భౌతికకాయాన్ని నేడు, రేపు అన్నపూర్ణ స్టూడియోలోనే ఉంచనున్నారు. గురువారం ఎర్రగడ్డ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయి. కాగా మరోవైపు అక్కినేని మృతికి సంతాపంగా సినిమా కార్యక్రమాలు నిలిపివేస్తున్నట్లు సీనియర్ నటుడు మురళీ మోహన్ తెలిపారు.