కాంగ్రెస్ ఆరోపణ
సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల డిజైన్ మార్చి అంచనా వ్యయాలను అమాంతం పెంచడం ద్వారా రాష్ట్రప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీ.జీవన్‌రెడ్డి, డీకే ఆరుణ ఆరోపించారు. ప్రాజెక్టు డిజైన్ మార్పు తో నిర్మాణ అంచనా వ్యయం ఎన్నో రెట్లు పెంచి టెండర్లు లేకుండా పాత గుత్తేదారులకే పనులు అప్పగిస్తున్నారని దుయ్యబట్టారు.
సోమవారం అసెంబ్లీ ఆవరణలో వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందని విమర్శించిన మంత్రి హరీశ్‌రావు ఇప్పుడు తిరిగి పాత గుత్త్తేదారులకే పనులు అప్పగించడంలో ఉద్దేశమేంటని ప్రశ్నించారు. ప్రాణహిత డిజైన్ మార్పు సహేతుకం కాదని, దీనివల్ల విద్యుత్ అవసరాలు, ఖర్చు గణనీయంగా పెరుగుతాయని ప్రాజెక్టు డిజైన్ మార్పుపై ఐదుగురు ఇంజనీర్లతో కూడిన కమిటీ హెచ్చరికలను విస్మరించడంపై కారణాలు తెలపాలన్నారు.
ప్రాణహిత డిజైన్ మార్పులో అక్రమాలు
Published Tue, Mar 22 2016 12:40 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM
Advertisement
Advertisement