erragadda burial ground
-
కల్లోలం: ఎర్రగడ్డలో ఒక్కరోజే 32 శవాల అంత్యక్రియలు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా పాటు రాష్ట్రంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో పరిస్థితులు రోజురోజుకు దారుణంగా మారుతున్నాయి. ఎర్రగడ్డ ఈఎస్ఐ హిందూ శ్మశానవాటికలో రోజు పెద్ద సంఖ్యలో కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు జరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజే 32 మృతదేహాలకు అంత్యక్రియలు జరిపినట్లు జీహెచ్ఎంసీ అధికారులు ప్రకటించారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి 9.30 గంటల వరకు అందిన సమాచారం మేరకు మొత్తం 32 కరోనా బారినపడిన మృతిచెందిన వారికి అంత్యక్రియలు చేశారు. హైదరాబాద్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స పొందుతూ మరణించినవారే ఉన్నారు. ఎర్రగడ్డలోని ఈఎస్ఐ శ్మశానవాటికలో వాటికి దహన సంస్కారాలు చేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. అయితే ఇది ఒక్క ఎర్రగడ్డ శ్మశానం లెక్కలు మాత్రమే. అధికారికంగా ప్రకటించిన లెక్కలే ఇంత ఉంటే అనధికారికంగా ఎన్ని ఉంటాయోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలో ఎంత సంఖ్యలో కరోనా మృతులు సంభవిస్తున్నాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చదవండి: లాక్డౌన్ పెట్టాలా లేదా అన్నది సీఎం నిర్ణయం చదవండి: రాబోయే 3, 4 వారాలు చాలా కీలకం.. మరింత జాగ్రత్త -
ఎర్రగడ్డ శ్మశానవాటికలో రేపు ఏఎన్నార్ అంత్యక్రియలు
హైదరాబాద్ : అక్కినేని నాగేశ్వరరావు అంత్యక్రియాలు గురువారం ఎర్రగడ్డ స్మశానవాటికలో జరగనున్నాయి. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులుఎ తెలిపారు. అక్కినేని నాగేశ్వరరావు గత రాత్రి అస్వస్థతకు గురి కావటంతో వెంటనే ఆయన్ని కేర్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఏఎన్నార్ మృతి చెందారు. ఈరోజు సాయంత్రం వరకూ అభిమానుల సందర్శనార్థం అక్కినేని పార్థీవ దేహాన్ని అన్నపూర్ణ స్టూడియోలో ఉంచుతారు. కాగా అక్కినేని నివాసంలో ఉంచిన ఆయన భౌతికకాయాన్ని దర్శించుకునేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. -
అభిమాన నటుడికి కన్నీటి వీడ్కోలు
-
ఉదయ్ కిరణ్ భౌతికకాయానికి సినీ ప్రముఖులు నివాళులు
-
ఉదయ్ కిరణ్ అంత్యక్రియలు పూర్తి.
-
ఉదయ్ కిరణ్ అంత్యక్రియలు పూర్తి
-
ఉదయ్ కిరణ్ అంత్యక్రియలు పూర్తి
హైదరాబాద్ : అయినవారు, అభిమానుల అశ్రు నయనాల మధ్య సినీనటుడు ఉదయ్ కిరణ్ అంత్యక్రియలు ఎర్రగడ్డ స్మశాన వాటికలో జరిగాయి. ఉదయ్ కిరణ్ తండ్రి మూర్తి చితికి నిప్పు అంటించారు. అంత్యక్రియల కార్యక్రమంలో అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తమ అభిమాన నటుడికి కడసారిగా కన్నీటితో వీడ్కోలు పలికారు. అంతకు ముందు ఫిల్మ్‌చాంబర్ నుంచి ఉదయ్ కిరణ్ పార్దీవశరీరాన్ని ఓపెన్ టాప్ వాహనంలో ర్యాలీగా స్మశాన వాటికకు తీసుకొచ్చారు. హీరో శ్రీకాంత్ ఆ వ్యాన్‌తో పాటే స్మశాన వాటికకు చేరుకున్నారు. ఉదయ్ కిరణ్ కుటుంబ సభ్యలతో పాటు యువ హీరోలు కొంత మంది దహన సంస్కారాల్లో పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో అభిమానులు కూడా తరలిరావడంతో ఎర్రగడ్డ స్మశాన వాటిక కిక్కిరిసిపోయింది. గత కొంత కాలంగా సినిమా అవకాశాలు లేక సతమతం అవుతున్న ఉదయ్ కిరణ్....ఆదివారం రాత్రి శ్రీనగర్ కాలనీనలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అతను ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులు, తన కెరీర్ ఆశాజనకంగా లేక పోవడమే కారణమని తెలుస్తోంది.