హైదరాబాద్: అక్కినేని నాగేశ్వరరావు నాలుగో తరగతితోనే చదువుకు ఫుల్స్టాప్ పెట్టేశారు. ఆయన యంగ్ హీరోగా రాణిస్తున్న రోజుల్లో చాలామంది ఇంగ్లీష్లో మాట్లాడుకునేవారు. దాంతో అక్కినేనికి ఇంగ్లీష్ అర్ధమయ్యేది కాదు. ఓ ఆహ్వానం మేరకు ఆయన శ్రీలంక వెళ్లినప్పుడు అందరూ ఇంగ్లీష్లో మాట్లాడితే.. అక్కినేని మాత్రం తమిళంతో మేనేజ్ చేశారు.
ఆ తర్వాత పట్టుదలతో ఆయన ఆంగ్లం నేర్చుకున్నారు. ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగలిగే స్థాయికి చేరుకున్నారు. ది హిందూ దినపత్రికను క్రమం తప్పకుండా చదువుతూ ఇంగ్లీష్లో ప్రావీణ్యం సంపాదించారు. ప్రేక్షకులే దేవుళ్ళు అంటూ కొలిచే ఆయన నటనలో తానెప్పుడూ నిత్యవిద్యార్థినే అని వినయంగా చెబుతుండేవారు.