
'అన్నలిద్దరూ స్వర్గంలో కలుసుకున్నారు'
హైదరాబాద్ : కళామతల్లికి ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావులు.... ముద్దుబిడ్డలని నటుడు బాబు మోహన్ అన్నారు. వారిద్దర్నీ చూసి కళామతల్లి గర్వించిందన్నారు. వారిద్దరూ ఇప్పుడు స్వర్గంలో కలుసుకున్నారని బాబూ మోహన్ వ్యాఖ్యానించారు. అక్కినేని తనను...పేరు పెట్టి పిలిచింది మహా అయితే రెండు... మూడుసార్లు అని ఎప్పుడూ 'అండగాడా...వచ్చావా' అని పిలిచేవారన్నారు.
ఆయనతో అలా పిలిపించుకునే భాగ్యం కలిగిందని బాబూ మోహన్ అన్నారు. తండ్రి లాంటి తండ్రిని కోల్పోయానని ఆయన పేర్కొన్నారు. ఆ కుటుంబానికి ఈ విషాదాన్ని ఎదుర్కొనే మనోధైర్యం ప్రసాదించాలని దేవుడిని కోరుకుంటున్నట్లు బాబు మోహన్ అన్నారు. అక్కినేని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.