nt ramarao
-
ముంచడమే మీ నైజం
సాక్షి, హైదరాబాద్: నమ్మిన వారిని ముంచడమే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నైజమని, ఆయనలో విశ్వసనీయత, విలువలు ఏ కోశానా లేవని వైఎస్సార్ సీపీ రాజకీయ సలహా మండలి సభ్యుడు అంబటి రాంబాబు విమర్శించారు. చంద్ర బాబు రాజకీయ ప్రస్థానం ప్రారంభమై నాలుగు దశాబ్దాలు పూరైన సందర్భంగా పత్రికలు, ఛానెళ్లు, ఆయన వల్ల అయాచితంగా లబ్దిపొందిన వారంతా పుంఖాను పుంఖాలుగా కథనాలు ప్రచురిస్తున్నారని చెప్పారు. ‘పదవి కోసం ఎవరినైనా ముంచు..’ అనేదే చంద్రబాబు ప్రజలకిచ్చే సందేశమని వ్యాఖ్యానించారు. అంబటి రాంబాబు మంగళ వారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నమ్మించు, వంచించు, దోచేయ్ అన్నది చంద్రబాబుకు బాగా తెలిసిన పదాలని, రాజకీయ జీవితాన్ని ఇచ్చిన ఎన్టీఆర్ మరణానికి చంద్రబాబే కారణమన్నారు. ఊసరవెల్లికీ తర్ఫీదునివ్వగల సమర్థుడు చంద్రబాబును ఆయన కుటుంబ సభ్యులే నమ్మరని అంబటి పేర్కొన్నారు. హైదరాబాద్‌ను తానే కట్టినట్లు, రింగ్‌రోడ్డు, ఎయిర్‌పోర్టునూ నిర్మించినట్లు, చివరకు ఐటీ, సెల్‌ఫోన్ తెచ్చింది తానేనని సత్య నాదెళ్ల, పీవీ సింధును కూడా తానే తయారు చేశానని చంద్రబాబు నమ్మశక్యం కాని మాటలు చెబుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు మానసిక పరిస్థితిపై గతంలో ఓ వ్యక్తి పుస్తకాలు రాశారని అందులో అన్నీ వ్యతిరేక అంశాలే ఉన్నాయన్నారు. ఇపుడు మాత్రం టీవీల్లో బ్రహ్మాండంగా చెబుతూ చంద్రబాబు భజన చేస్తున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఊసరవెల్లికి కూడా రంగులు మార్చడంలో తర్ఫీదు నివ్వగల ఘనుడన్నారు. ఎన్టీఆర్ తెరపై నటిస్తే.. చంద్రబాబు జీవితంలో నటిస్తూ తెలుగు ప్రజలను వంచిస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు ఈ నాలుగేళ్లలో ఎన్ని మాటలు మార్చారో తెలిసిందేనన్నారు. రాజకీయ అవకాశవా దానికి చంద్రబాబు పరాకాష్ట అని గతంలో 5 ఏళ్లు బీజేపీతో, ఇప్పుడు 4 ఏళ్లు బీజేపీతో బాబు çసంసారం చేస్తున్నారని విమర్శించారు. 40 ఏళ్లలో ప్రజలకు ఏం చేశారు? చీమలు పెట్టిన పుట్టలోకి పాములు చేరినట్లు.. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి చేరి ఎన్టీఆర్‌ను సైతం మెడ పట్టుకొని బయటకు పంపించిన చరిత్ర చంద్రబాబుదని అంబటి ధ్వజమెత్తారు. నిజాయితీ గురించి ఆయన చెప్పటం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబుపై ఉన్న కేసులపై విచారణ జరిగితే ఈ రాష్ట్రంలో ఆయనకు నూకలు చెల్లుతాయన్నారు. చంద్రబాబు నదుల్ని, నిధుల్ని కూడా తాకట్టు పెడతారన్నారు. 40 ఏళ్లలో చంద్రబాబు ప్రజలకు ఏం ఒరగబెట్టారో ఒక్కటైనా చెప్పగలరా? అని ప్రశ్నించారు. వెన్నుపోటు తప్ప ఆయన చేసింది ఏమీ లేదన్నారు. చెడు సంప్రదాయాలను అనుసరిస్తున్న చంద్రబాబును తెలుగు ప్రజలంతా బహిష్కరించాలని పిలుపు నిచ్చారు. -
'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై వర్మ లేటెస్ట్ పోస్ట్
రాంగోపాల్ వర్మ తాజాగా తెరకెక్కించబోతున్న సినిమా 'లక్ష్మీస్ ఎన్టీఆర్'.. దివంగత నేత ఎన్టీ రామారావు జీవితకథ ఆధారంగా ఈ సినిమాను తీయనున్నట్టు వర్మ ప్రకటించిన నాటినుంచి.. ఈ ప్రాజెక్టు చుట్టూ అనేక వివాదాలు ముసురుకుంటున్నాయి. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు ఈ సినిమా విషయంలో వర్మపై విరుచుకుపడ్డారు. వారి విమర్శలకు, ఆరోపణలకు వర్మ ఫేస్బుక్ వేదికగా దీటుగానే సమాధానం ఇస్తున్నారు. ఎన్టీఆర్ జీవితంలోని ప్రజలకు పెద్దగా తెలియని చీకటికోణాలను ఈ సినిమాలో ఆవిష్కరిస్తానంటూ వర్మ చెప్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో ఇప్పటికే అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో తాజాగా వర్మ పెట్టిన ఓ పోస్టు అందరి దృష్టి ఆకట్టుకుంటోంది. ఎన్టీఆర్ తనకు షేక్‌హ్యాండ్ ఇస్తున్న ఫొటోను వర్మ తాజాగా ఫేస్బుక్లో పోస్టు చేశారు. ఈ ఫొటోలో వెనుక ఎన్టీఆర్-శివపార్వతి దండలు మార్చుకుంటుండగా.. వారి వెనుక చంద్రబాబు నిల్చున్న ఫొటో ఉది. ఈ ఫొటోకు వర్మ ఆసక్తికరమైన కామెంట్ పెట్టారు. ఎన్టీఆర్‌పై సినిమా తీస్తున్నందుకు ఆయన తనను అభినందిస్తున్నారంటూ పేర్కొన్నారు. మొత్తానికి ఈ పోస్టుకు 11వేలకుపైగా రియాక్షన్లు రావడం గమనార్హం. -
చీకటి మాటున దాగిన వేకువ
సమకాలీనం తామెక్కి వచ్చిన మెట్లను ఒకటొకటిగా కూల్చే బాపతు పాలకపక్షాలు నిరసన దారులన్ని టినీ మూసేస్తాయి. ప్రత్యామ్నాయ రాజకీయాలంటే.. మీకిక మాట్లాడుకునే వేదికలే దొరకవు పొమ్మంటాయి. నిరసన తెలిపితే, తప్పదు నిర్బంధమంటాయి. ధర్నాచౌక్‌లు కనుమరుగవుతాయి. పాలకపక్షాలు ఏదీ, ఎక్కడ ప్రత్యామ్నాయం? అని విర్రవీగినప్పుడే చడీచప్పుడు లేకుండా బలమైన ప్రత్యామ్నాయం ఆవిర్భవించిన సందర్భాలు కోకొల్లలు. అన్ని దారులు మూసుకుపోయినట్టున్నా, ఏదో దారి తెరచుకోవడమే ప్రజాస్వామ్య లక్షణం! ‘ఒక దుర్బల ఊరపిచ్చుకను గరుత్మంతునితో పోరాడించు, ఓ నిరుపేద కార్మికుని శరీరంలో కనలే రక్తానికి నిరసన నిప్పురవ్వ జోడించు.... విప్లవం దానంతట అదే వస్తుంది’ అంటాడు మహాకవి ఇక్బాల్. ‘‘సారే జహాసే అచ్చా హిందూ సితా హమార హమారా...’’ అని ప్రపం చానికి ఎలుగెత్తి చాటిన ఆయన, దేశం ఇప్పుడున్న పరిస్థితిని చూస్తే తీవ్రంగా కలత చెందివుండేవాడే! ప్రజాస్వామ్య వ్యవస్థల మనుగడకు అవసరమైన వాతావరణం దేశంలో, రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా పలుచనవుతోంది. పలు వ్యవస్థల్ని పాలకులు పనిగట్టుకొని పలుచన చేస్తున్నారు. ఏకస్వామ్య పాలనా వ్యవస్థల్ని నిరాఘాటంగా నడపాలనే దూరదృష్టితో ప్రజాస్వామ్య వాతావరణాన్నే కకావికలు చేస్తున్నారు. ఆలోచించే మెదళ్లని, నిలదీసే స్వరాల్ని, ప్రశ్నించే గొంతుకల్ని కర్కశంగా నలిపేస్తున్నారు. విప్లవాలు, పోరా టాల సంగతలా ఉంచితే, ఈ సర్కార్ల నీడలో ఆరోగ్యవంతమైన చర్చ, అవసరానికి పనికొచ్చే ఓ ఆలోచన కూడా చేయలేని సమాజం మెలమెల్లగ బలోపేతమౌతోంది ఇప్పుడు. వేర్వేరు కారణాలతో పౌరసమాజం స్వరం మెత్తబడుతున్న క్రమంలోనే ఓ బలహీనమైన సమాజం రూపుదిద్దుకునే పరిస్థితుల్ని ఎగదోస్తున్నాయి మన ప్రభుత్వాలు. ఒకటి రెండు చోట్ల మినహా, పాలకపక్షాల దాష్టీకాలకు విపక్ష రాజకీయ పార్టీలు నిలబడలేకపోతున్నాయి. ప్రచార ఆర్భాటాలే తప్ప ఆర్థిక విధానాల్లో మార్పుల్లేని ప్రత్యామ్నాయాలు కూడా ప్రజా విశ్వాసం పొందలేకపోతున్నాయి. అందుకే అనిశ్చితి. అన్ని చోట్లా పూర్తిస్థాయి వ్యతిరేకత అని చెప్పలేకపోయినా, లోలోపల ఓ అసం తృప్తి, ఆవేదన, అలసట మాత్రం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అప్రజా స్వామికంగా పావులు కదుపుతూనే, ‘మమ్మల్ని కాదంటే, ప్రత్యామ్నాయం ఏముందో చూపండి?’ అనేంతగా పాలకపక్షాల ధీమా ఎల్లలు దాటుతోంది! ప్రత్యర్థుల్ని చిత్తు చేసే ఎత్తులు–పైఎత్తుల రాజకీయ జిత్తుల్లో... ప్రభుత్వాలు, పాలనా వ్యవస్థలు, వాటి అంగాంగాల నుంచి వెలువడే సమాచారాన్ని సగటు ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఏది నిజమో తేల్చుకోలేని సందిగ్ధ పరిస్థితులు పౌరుల్ని అయోమయానికి గురి చేస్తున్నాయి. పాలకులు ఏక పక్షంగా తమ అనుకూల సమాచారాన్ని వారిపై రుద్దుతున్నారు. తమకు గిట్టని, ఇరుకున పెట్టే సమాచారాన్ని అధికార బలంతో అడ్డుకుంటున్నారు. ప్రత్యక్షంగా–పరోక్షంగా ఒత్తిళ్లు, అణచివేతలు పెంచి సగటు జీవి స్వతం త్రంగా ఆలోచించలేని, స్వేచ్ఛగా భావాలు వ్యక్తం చేయలేని దుర్భర వాతా వరణం కల్పిస్తున్నారు. ఇదిలాగే బలపడి, రేపు ‘ఒకే దేశం ఒకే ఎన్నికలు’ అన్నది కార్యరూపం దాలిస్తే.... సమాఖ్య వ్యవస్థ అయినప్పటికీ రాష్ట్రాల్లో పరిస్థితులెలా ఉంటాయోనని ప్రజాస్వామ్యవాదులు ఆందోళన చెందుతు న్నారు. అవి ఎడారిలో ఒయాసిస్సులు! ఈ గాంధీ జయంతి రోజున నగరంలో ఓ మేధోచర్చ (మంథన్ సంవాద్) జరిగింది. వివిధ రకాల ఆలోచనా ధారలకు ప్రాతినిధ్యం వహించే ఏడుగురు ముఖ్యులు ప్రసంగాలు చేశారు. 2,500 మంది కూర్చునే వ్యవస్థ కలిగిన ‘శిల్పకళావేదిక’, నిర్వాహకులు ఒక్క వాహనమైనా ఏర్పాటు చేయకుండానే స్వచ్ఛందంగా వచ్చిన సభికులతో నిండిపోయింది. అన్ని వయసుల, వర్గాల, ప్రాంతాల వారూ హాజరయ్యారు. లభించిన పరిమిత సమయంలో కూడా మంచి ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ (న్యాయ), కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా (రాజకీయం), జేఎన్‌యూ ప్రొఫెసర్ సుచేతా మహాజన్ (చరిత్ర), పాటల రచయిత, దర్శకుడు వరుణ్ గ్రోవర్ (కళలు), తక్షశిల సంస్థకు చెందిన నితిన్ పాయ్ (విద్య), ఎన్సీపీఆర్ఐ నిఖిల్‌డే (సామాజిక), సీనియర్ జర్నలిస్టు రవీశ్‌కుమార్(జర్నలిజం)లు చేసిన చక్కటి ప్రసంగాలకు అద్భుతమైన స్పందన లభించింది. అంతకు మునుపు నగరంలో ‘హైదరాబాద్ కలెక్టివ్’ ‘కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్’ ‘కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్’ ‘ఫోరమ్ ఫర్ బెటర్ హైదరాబాద్’ తదితర సంస్థలు కూడా పేరున్న వక్తల్ని, మేధావుల్ని రప్పించి పలు చర్చా కార్యక్రమాల్ని ఏర్పాటు చేశాయి. సగటు పౌరుల్లో ఆరోగ్యవంతమైన చర్చను, అర్థవంతమైన ఆలోచనల్ని రేకెత్తించే ఇటువంటి వేదికల అవసరం ఇంకెంతో ఉంది. వాస్తవాలకు రాజకీయ రంగులు పులమకుండా, సమాజం పట్ల తమ బాధ్యతగా భావించి ఉన్నది ఉన్నట్టు చెప్పే, అదీ ప్రభావవంతంగా మాట్లాడే వారితో చర్చా కార్యక్రమాలు ఒక్క తెలుగునాటనే కాకుండా దేశవ్యాప్తంగా జరగాల్సి ఉంది. హైదరాబాద్ స్థాయి దాటి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, తిరుపతి .... ఇలా చిన్న నగరాలు, పట్టణాలకూ ఈ సంస్కృతి విస్తరించాలి. తెలుగులో ప్రసంగాలు చేసే విశ్వసనీయత కలిగిన మేధావుల్ని చొరవ తీసుకొని ఒక వేదిక మీదకు తేగలగాలి. ప్రజల ఆలోచనా పరిధిని విస్తరింపజేసి, తద్వారా సరైన నిర్ణ యాల వైపు వారిని నడిపే ఈ చైతన్యం మరింత కింది స్థాయికి విస్తరించాల్సిన అవసరాన్ని విశాల జనహితం కోరేవారు కాంక్షిస్తున్నారు. రాజకీయేతర ప్రత్యామ్నాయాలే దన్ను! ప్రజాస్వామ్యం అంటే, అయిదేళ్లకోసారి జరిగే ఎన్నికల నడుమ పాలకుల య«థేచ్ఛ, విచ్చలవిడితనం కాదు. ఒకసారి ఎన్నికలు జరిగిపోతే, మళ్లీ ఎన్నికలు జరిగే అయిదేళ్ల వరకు పౌరులు ఏమీ చేయజాలని అశక్తతా కాదు! మరేంటి? ప్రజల స్వీయ నిర్ణయాధికారం. ప్రజాభిప్రాయానికి విలువ ఉండాలి. ప్రజలకు బలమైన అభిప్రాయాలుండాలి. అవి ఏర్పరచుకోవడానికి అవసరమైన వాస్తవిక సమాచారం అందాలి. పాలకులు కొన్ని మోసపు టెత్తుగడలతో పన్నే ఉచ్చుల్లో సామాన్యులకు అర్థం కాని మార్మికతను విప్పి చెప్పేలా మేధావివర్గం పూనిక వహించాలి. అందుకొక ఆరోగ్యవంతమైన చర్చ, ఉపయుక్త ఆలోచనా పరంపర సాగాలి. వివిధ వేదికల నుంచి అవి వ్యక్తం కావాలి. స్వేచ్ఛాయుత వాతావరణంలో దానికి తగినంత చోటిచ్చే భూమిక లభించాలి. రాజకీయ వ్యవస్థ, పాలకులు సదరు వాతావరణాన్ని కొనసాగనివ్వాలి. ‘మంథన్’ అందులో భాగమే! ఇవి మరిన్ని ఏర్పడి వాస్తవ సమాచారాన్ని జనబాహుళ్యంలోకి జొప్పిస్తే ప్రజల విచక్షణ పెరిగి, నిర్ణయా ధికారం వినియోగంలోకి వస్తుంది. పౌరులు జాగృతమై ప్రభుత్వాల నియం తృత్వ ధోరణుల్ని నిలువరించగలుగుతారు. కేంద్రంలో, రాష్ట్రాల్లో ప్రభు త్వాలు ప్రజావ్యతిరేక నిర్ణయాలను అమలుపరుస్తూ మొండి వైఖరి వహిం చినా కూడా, ప్రజల ఒత్తిడికి తలొగ్గి వెనక్కి తగ్గిన పరిస్థితులకు ఇలాంటి పౌరసమాజపు ఒత్తిళ్లే కారణం. తాజా ఉదాహరణ పెట్రోల్–డీజిల్ ధరల వ్యవహారమే! అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధర బ్యారెల్ 120 డాలర్లున్న పుడు ఇక్కడ లీటరు పెట్రోలు గరిష్టంగా 80 రూపాయలుంటే, ఇప్పుడు బ్యారెల్ క్రూడ్ ధర 50 డాలర్లకు పడిపోయినా... లీటరు పెట్రోలు ధర సగటున 75 రూపాయలుంటోంది! ఎంత మంది సర్కారు ఆర్థికవేత్తలు ఎన్ని లెక్కలు చెప్పినా అది పొసగటం లేదు. స్వయంగా కేంద్ర ఇంధనశాఖ మంత్రి ‘ఏం చేయలేం, ధర తగ్గించడం అసాధ్యం’ అన్న తర్వాత కూడా ప్రజాభి ప్రాయాన్ని మన్నించి కేంద్రం దిగిరావాల్సి వచ్చింది. రాత్రికి రాత్రి తాను ధరలు తగ్గించడమే కాకుండా, రాష్ట్రాలను కూడా పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించుకొమ్మని ప్రతిపాదించాల్సి వచ్చింది. పౌరసమాజం మరింత చేత నతో, వ్యవస్థీకృతంగా ఉంటే ఎన్నెన్నో సాధించుకోవచ్చని ఈ పరిణామం చెబుతోంది. ఆశ చావొద్దు, భ్రమ బతుకొద్దు! సమకాలీన వ్యవస్థలో రాజకీయాలు చాలా ఖరీదయిపోయాయి. ప్రజా స్వామ్యం గురించి ఎంత గొప్పలు చెప్పుకున్నా సామాన్యులు రాజకీయాల్లో మనలేని రోజులొచ్చాయి. ముఖ్యంగా స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల్లో నిలువడం, చిన్న చిన్న రాజకీయ పార్టీలు నడపడం కనాకష్టమైపోయింది. డబ్బు ప్రమేయం ఎన్నికల్లో బాగా పెరిగింది. సిద్ధాంత రాజకీయాలు కాస్త వెనక్కి వెళ్లి, స్వార్థ రాజకీయాలు పెరిగాక అధికారమే పరమావధిగా అడు గులు వేస్తున్నారు. ఎక్కడికక్కడ కులాలు, మతాలు, ప్రాంతాలపరమైన భావావేశాల్ని రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకొనే పద్ధ్దతులు బలపడ్డాయి. ఎన్నికల ఫలితాలు వచ్చాక పలువురు ప్రజాప్రతినిధులు తమను ప్రజలు గెలిపించిన విపక్ష పార్టీల్లో ఉండలేకపోతున్నారు. పాలకపక్షం కనుసైగ చేస్తే చాలు అందులో చేరిపోతున్నారు. అధికారంతో అంటకాగుతున్నారు. ఉభ యులూ కలిసి ప్రజాతీర్పును వంచిస్తున్నారు. ఐదేళ్ల వరకు ప్రజల్ని పరిహాసం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి విపక్ష పార్టీ జవసత్వాలు లేకుండా నామ మాత్రమైపోతే ఇక తమకు తిరుగే ఉండదన్నది పాలకపక్షాల ధీమా! అను చితమైన ఈ ధీమా ఒట్టి భ్రమ కావాలి. అంతటి శక్తి ఆలోచన బాట పట్టిన జన బలానికుంటుందని మన ప్రజాస్వామ్యం పలుమార్లు నిరూపించింది. ఏదీ! ఎక్కడ ప్రత్యామ్నాయం? అని పాలకపక్షాలు అహంతో ప్రశ్నించిన ప్పుడు కూడా చడీచప్పుడు లేకుండానే బలమైన ప్రత్యామ్నాయం అప్పటి కప్పుడు ఆవిర్భవించిన సందర్భాలు కోకొల్లలు. ఎమర్జెన్సీ కాలంలో తనకు ఎదురే లేదనుకున్న నాటి ప్రధాని ఇందిరా గాంధీ, జయప్రకాశ్ నారాయణ్ రూపంలో ఓ ప్రత్యామ్నాయం అంత తొందర్లో పుట్టుకొస్తుందని ఊహించలేక పోయారు. 1982–83లో తెలుగు నాట సినీ నటుడు ఎన్టీరామారావు ఓ ప్రభంజనంలా దూసుకు రావడం కూడా, అప్పటికే కాంగ్రెస్ చేష్టలతో విసిగి వేసారిన ప్రజలు నిర్ణయించిన ప్రత్యామ్నాయ శక్తి మాత్రమే! ఒక రూపంలో అంతమైనా, మరేదో రూపంలో ప్రత్యామ్నాయం ఆవిర్భవించడమే ప్రజాస్వామ్యపు అందం! అందుకే, ప్రజ లెప్పుడూ నిరాశకు గురికాకుండా జాగరూకత వహిస్తూ ఆశావహ దృక్ప థంతో ఉండాలి. ఎంత పొడవైనదైనా చీకటి సొరంగం తర్వాత వెలుగు ఖాయం! ఈ లోపున, జరుగుతున్న పరిణామాలన్నింటినీ జాగ్రత్తగా గమ నిస్తూ... తగు విధంగా చర్చించి, ఆలోచించి పౌరులు తమవైన నిర్ణయాలు తీసుకోవాలి. ఉమ్మడి చొరవే ఉద్యమ స్ఫూర్తి! బలమైన రాజకీయ వ్యవస్థలకు ఒకప్పుడు భూమికనిచ్చిన విశ్వవిద్యాలయాలు ఇప్పుడు నిర్వీర్యమై ఉన్నాయి. ఉద్దేశపూర్వకంగానే వాటినలా చేశారు, చేస్తూనే ఉంటారు. మనిషి విచిత్ర స్వభావాన్ని ఎత్తిచూపుతూ చలం అన్నట్టు, మనిషి ఎవర్నయినా క్షమిస్తాడు తనకు సహాయపడ్డవాణ్ణి తప్ప! తామెక్కి వచ్చిన నిచ్చెన మెట్లను ఒకటొకటిగా నరికే స్వభావమున్న పాలక పక్షాలు ఇతరులు నిరసన తెలిపే దారులన్నీ మూసేస్తాయి. ప్రత్యామ్నాయ రాజకీయవేదికలంటారా? మీకిక మాట్లాడుకునే వేదికలే దొరకవు పొమ్మం టాయి. నిరసన తెలిపితే, తప్పదు నిర్బంధమంటాయి. ధర్నాచౌక్‌లు కూడా కనుమరుగవుతాయి. అన్ని దారులు మూసుకుపోయినట్టు కనిపించినా, ఎక్కడో ఓ దిక్కున దారి తెరచుకోవడమే ప్రజాస్వామ్య లక్షణమని చరిత్ర, ప్రకృతి చెబుతోంది! కవులు, రచయితలు, మేధావులు, ఇతర ప్రజాస్వామ్య వాదులు ఏకమవ్వాలి. పౌరుల్ని అప్రమత్తంగా ఉంచి ప్రజాస్వామ్యాన్ని పరి రక్షించాలి. ఆరోగ్యకరమైన చర్చను, అవసరాలు తీర్చే ఆలోచనల పరిధిని మరింత విస్తరించాలి. రేపు బాగుండాలంటే, నేడంటూ ఉండాలి! దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
బడిపంతులు
నాటి సినిమా బుద్ధిలేని సంతానానికి పాఠాలు చెప్పే బడిపంతులు ధర్మరాజు కంట కన్నీరు రాలిన చోట క్షామం పుడుతుందట. కాదు– తల్లిదండ్రుల కంట కన్నీరు ఒలికిన చోట కాటకం పుడుతుంది. కరువు కబళిస్తుంది. అశాంతి చెరలేగి జాతినే ముంచెత్తుతుంది. ఇది తెలుసుకునేది ఎంతమంది. ‘బాబూ... నీ కాళ్లు పట్టుకుంటాను... ఒక్క ముద్ద తినరా’ చిన్నప్పడు అన్నం తినడానికి మారాం చేసే పిల్లలతో తల్లి. ‘బాబూ... నీ కాళ్లు పట్టుకుంటాను... ఒక్క ముద్ద పెట్టరా’ పెద్దయ్యాక పోషణకు ఆరళ్లు పెట్టే పిల్లలతో తల్లి.పిల్లలకు తల్లిదండ్రులకంటే కామెడీ అయిపోయింది.కన్నారు... ఎవరి కోసం కన్నారు... పెంచారు... ఎవరి కోసం పెంచారు... ఉన్న ఆస్తో పాస్‌తో పంచారు... ఎవరి కోసం పంచుతారు... ఇప్పుడు మాకు రెక్కలొచ్చాయి... భర్తలు/భార్యలు వచ్చారు... పిల్లలు పుట్టారు... మా గొడవ మేం చూసుకోవడానికే టైమ్ లేదు... ఇంక తల్లిదండ్రులను ఏం చూసుకునేది? ఇలా అనే సంతానానికి ఎన్ని బెత్తం దెబ్బలు కొట్టాలి? ఎన్ని బడితె పూజలు చేయాలి? తల్లిదండ్రుల జీవితం పిల్లల జననంతోనే అంతమైపోతుంది. ఆపైన వాళ్లకంటూ ఒక జీవితం ఉండదు. పిల్లల జీవితమే వాళ్ల జీవితం. పిల్లల కోసమే కష్టపడతారు. పిల్లల కోసమే సంపాదిస్తారు. పిల్లల కడుపు నిండితే తమ కడుపు నిండిందని భావించి తృప్తిగా బతుకుతారు. కొందరు పిల్లలకు అది అలుసవుతుంది. చిన్నప్పటి నుంచి చనువిచ్చి ఉంటారు కనుక కొందరు పిల్లలకు చిన్నచూపు ఏర్పడుతుంది. ఎన్నోసార్లు నిస్సహాయంగా ఆధారపడుతారు కదా అందుకని కొందరు పిల్లలకు అహంకారం వస్తుంది. అందువల్ల తల్లిదండ్రులను అలక్ష్యం చేస్తారు. నిర్లక్ష్యం వహిస్తారు. కాలికి చేతికి అడ్డం అని భావించి ఏ వృద్ధాశ్రమంలోనో వదిలిపెడతారు. మరికొందరు దయతలిచి దారిఖర్చులు కలిసొస్తాయని ఏకంగా వల్లకాటిలోనే వదిలిపెడతారు.ధర్మరాజు కంట కన్నీరు రాలిన చోట క్షామం పుడుతుందట.కాదు–తల్లిదండ్రుల కంట కన్నీరు ఒలికిన చోట కాటకం పుడుతుంది. కరువు కబళిస్తుంది. అశాంతి చెరలేగి జాతినే ముంచెత్తుతుంది. ఇది తెలుసుకునేది ఎంతమంది.అమ్మా... అన్నం తిన్నావా అని రోజుకు ఒకసారైనా ప్రేమగా పలకరించే సంతానం ఎంతమంది. ‘బడిపంతులు’ సినిమాలో తండ్రి ఎన్.టి.రామారావు బడిపంతులు. తల్లి అంజలీదేవి గృహిణి. వీళ్లకు ఇద్దరు కొడుకులు– కృష్ణంరాజు, రామకృష్ణ. ఒక కూతురు. ఆ రోజుల్లో బతకలేక బడిపంతులు అన్నారు. ఆ బతకలేని రోజుల్లోనే ఆ పెద్దమనిషి ఎన్.టి.రామారావు ఎన్నో కష్టాలు పడి పిల్లలని చదివించాడు. వాళ్ల కాలేజీ ఖర్చుల కోసం అప్పులు చేశాడు. కూతురి పెళ్లి కోసం కట్నం ఇవ్వలేక ప్రోనోటు రాసిచ్చాడు. ఇవన్నీ తన కోసం చేసుకున్న ఖర్చులు కాదు. పిల్లల కోసమే చేశాడు. వాళ్లు తిరిగి చెల్లిస్తారనే నమ్మకంతో చేశాడు. కాని ఆ పిల్లలు వయసు రాగానే చెరొక అమ్మాయిని వలిచారు. పెళ్లిళ్లు చేసుకుని తల్లిదండ్రులను, తోడబుట్టినదాన్ని వదిలేసి వెళ్లిపోయారు. చేసిన అప్పుకు గాను ఇల్లు వేలానికి వస్తుంది. అది ఉత్త ఇల్లు కాదు. స్కూలు పిల్లలు ఎంతో అపురూపంగా ఆ బడిపంతులకు కట్టిచ్చిన పొదరిల్లు. అలాంటి ఇల్లు అమ్ముడుపోవడమంటే ఎన్.టి.రామారావుకు ప్రాణం పోవడమే. ఇద్దరు కొడుకులూ పట్టించుకోరు.పైగా తల్లిదండ్రులను వాటాలు వేసుకొని తల్లిని ఒకరు, తండ్రిని ఒకరు తమ వెంట తీసుకుపోతారు. ఇరవై ముప్పై ఏళ్లు ఒక్కరోజు కూడా వదలకుండా కలిసిమెలిసి జీవించిన దంపతులు వాళ్లు. వాళ్లను వేరే చేయడం ఏం భావ్యం. ఒకరు లేకుండా మరొకరు బతకగలరా వాళ్లు? అయినా పిల్లల నిర్ణయానికి విలువిచ్చి దూరం వెళతారు. వెళ్లినా అక్కడ అవమానాలు, చీదరింపులు. కాని పిల్లలందరూ ఇలాగే ఉంటే ఈ సృష్టి ఎప్పుడో అంతరించి ఉండును. ఈ బడిపంతులుకు ఒక మానసపుత్రుడు ఉన్నాడు. స్టూడెంట్. చిన్నప్పటి నుంచి చేరదీసి నాలుగు మంచి మాటలు చెప్తే బాగా చదువుకుని పైకొచ్చి పెద్ద పోలీసాఫీసర్ అయి ఉంటాడు. ఈ పాత్రను చేసింది జగ్గయ్య. అతడు తన గురువుకు వచ్చిన దురవస్థను గమనిస్తాడు. కదిలిపోతాడు. ఏ ఇల్లైతే వేలానికి వెళ్లిందో ఆ ఇంటిని కొని తాను ఎంతో అభిమానించిన గురువును, గురువుగారి భార్యను అందులో పెట్టి వాళ్లను ఆదరిస్తాడు. ఇది చూసి బుద్ధి తెచ్చుకున్న పిల్లలు వచ్చి కాళ్ల మీద పడతారు. అందరూ ఒకటవుతారు. కాని ఇలా ఒకటవటానికి వృద్ధ ప్రాణాలను ఇంత క్షోభ పెట్టడం అవసరమా?తల్లిదండ్రులు వయసు మీరాక శారీరకంగా మానసికంగా బలహీనపడి ఉంటారు. ఆ వయసులో వారికి కావలసింది పిల్లల తమ పట్ల చూపే అపేక్ష, అనురాగం. మనవళ్లు చేసే సందడి. వాళ్లకు కావలసిన తిండి ఎంత? నాలుగు ముద్దలు.ఆ పెద్దరికాన్ని గౌరవిస్తూ దగ్గర ఉంచుకుని కుటుంబ నియమాన్ని పాటించడం పిల్లల బాధ్యత. ఆ బాధ్యతను గుర్తు చేసే సినిమా, భుజాలు తడుముకునేలా చేసే సినిమా ‘బడిపంతులు’. 1972లో విడుదలైన ‘బడిపంతులు’ సినిమాలో చేస్తే అక్కినేని చేయాలి. ఇది ఆయనకు నప్పే సబ్జెక్ట్. కాని ఎన్టీఆర్ ఆ పాత్రను ఒప్పుకోవడమే కాకుండా ఎంతో ప్రతిభావంతంగా నటించి ప్రేక్షకులను గెలుచుకోవడం విశేషం అనిపిస్తుంది. ‘భీష్మ’ తర్వాత సినిమా అంతా ముసలి వేషం వేసి కొడుకులు, మనవళ్లు ఉన్న పాత్ర చేయడానికి ఈ సినిమాలో ఉన్న కథాబలమే కారణం అనిపిస్తుంది. ఎన్టీఆర్‌కు వృద్ధులైన తల్లిదండ్రుల సమస్యల పట్ల సానుభూతి ఉంది. ఈ సినిమా చేయడానికి అది ఒక కారణం కావచ్చు. ఈ సమస్య ఆయన మనసులో ఎంత గాఢంగా ఉండిపోయిందంటే తన చివరి రోజుల్లో రచయిత డి.వి.నరసరాజు (బడిపంతులు ఈయనే రాశారు)తో ఇలాంటి సమస్య మీదే ఒక సినిమా స్వీయ నిర్మాణ దర్శకత్వంలో చేయాలని తపించారు కూడా. స్కూలు పిల్లలు తప్ప తన బాగోగులు కూడా పట్టించుకోని ఉపాధ్యాయుడిగా, భార్య దూరమయ్యాక ఆమె ఉత్తరం కోసం ఎదురు చూసే భర్తగా, పిల్లల ఈసడింపును భరించే నిస్సహాయుడైన తండ్రిగా ఆయన ఉదాత్త నటన ప్రదర్శించాడు. దానికంటే విశేషం అప్పటికి కుర్ర దర్శకుడిగానే చెప్పుకోవాల్సిన పి. చంద్రశేఖరరెడ్డి ఎంతో సమర్థంగా సినిమాను నడిపించడం.. రక్తి కట్టించడం. ఈ సినిమాలో చిన్న హీరోగా కనిపించిన కృష్ణంరాజు ఆ తర్వాత ఎంత పెద్ద హీరో అయ్యాడో చూశాం. అలాగే ఎన్టీఆర్‌కు మనవరాలిగా నటించిన శ్రీదేవి ఆ తర్వాత పెరిగి పెద్దదై ‘వేటగాడు’, ‘సర్దార్ పాపారాయుడు’, ‘బొబ్బిలిపులి, ‘కొండవీటి సింహం’, ‘జస్టిస్ చౌదరి’ వంటి అనేక సినిమాలలో ఆయన పక్కన హీరోయిన్గా నటించింది.ఇలాంటి వింతలూ విడ్డూరాలు ఈ సినిమాలు చాలా ఉన్నాయి. కాని తల్లిదండ్రులను చూడని సంతానమే అతి పెద్ద వింతని, కన్నవారికి అన్నం పెట్టని సంతానమే అతి పెద్ద విడ్డూరమనీ ఈ సినిమా చెబుతుంది. విషాదం ఇలాంటి సంతానం పెరగడం. ‘బడిపంతులు’కు ప్రాప్త కాలజ్ఞత తప్ప కాలదోషం పట్టకపోవడం. ఈ కథావస్తువు పనికిరాకుండా పోయే రోజుల కోసం ఎదురు చూద్దాం. హిందీలో ‘బాగ్బన్’ ‘బడిపంతులు’ సినిమాకు మూలం మరాఠీ రచయిత విష్ణువామన్ శిర్వాడ్కర్ రాసిన నవల ‘వైష్ణవి’. దీని ఆధారంగా దర్శక నిర్మాత బి.ఆర్.పంతులు ‘స్కూల్ మాస్టర్’ అనే సినిమాను కన్నడలో, హిందీలో కూడా నిర్మించారు. దాని రీమేక్ హక్కులతోనే తెలుగులో ‘బడిపంతులు’ తీశారు. అయితే ఇది జరిగిన చాలా ఏళ్లకు 2003లో అమితాబ్, హేమమాలినిలతో ఇదే కథ హిందీలో ‘బాగ్బన్’ సినిమాగా వచ్చింది. హిట్ అయ్యింది కూడా. తెలుగులో ఎన్.టి.రామారావు ప్రియశిష్యుడుగా జగ్గయ్య కనిపిస్తే హిందీలో అమితాబ్ ప్రియ శిష్యుడుగా సల్మాన్‌ఖాన్ కనిపిస్తాడు. బూచాడమ్మ బూచాడు.... తెలుగులో టెలిఫోన్ మీద వచ్చిన తొలి సరదా పాట ‘బడిపంతులు’లో ఉంది. ‘బూచాడమ్మ బూచాడు’ పాటను చిన్నారి శ్రీదేవి అభినయిస్తే అందంగా చిత్రీకరించారు. ఆత్రేయ ఈ పాట రాయగా కె.వి.మహదేవన్ బాణీ కట్టారు. ఇందులోనే ఉన్న ‘భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు’ పాట ప్రతి ఆగస్టు 15కు వినిపిస్తూనే ఉంటుంది. ఇంకా ‘నిన్న మొన్న రేకు విప్పిన కన్నెముగ్గ’ డ్యూయెట్ కూడా హిట్టే. – కె -
గతం నాస్తి, అసత్యాలే ఆస్తి
డేట్లైన్ హైదరాబాద్ ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి ఆహ్వానించింది తానేనని కూడా చెప్పారు చంద్రబాబు. అదే నిజమైతే 1982లో ఎన్టీ రామారావు పార్టీ ప్రకటించి, న్యూ ఎంఎల్ఏ క్వార్టర్స్‌లో మీటింగ్ పెట్టి ప్రకటన చేసిన నాటి నుంచి, ఎన్టీఆర్ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయిన కొన్ని మాసాల వరకు ఆయన వెంట ఎందుకు కనిపించలేదు? ఎన్టీఆర్‌మీద పోటీ చేస్తానని అనలే దని కూడా చెప్పారు. 1983 ఎన్నికల ముందు పార్టీ నాయకురాలు ఆదేశిస్తే మామ మీద పోటీకి సిద్ధమని చేసిన ప్రకటన కటింగ్‌లు సోషల్ మీడియా నిండా కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గత శనివారం రాష్ట్ర శాసనసభ, మండలి సమావేశాల చివరిరోజున మీడియాతో ఇష్టా గోష్టిగా మాట్లాడారు. ఆ సమావేశంలో పాల్గొన్న జర్నలిస్ట్‌లలో ఎంతమంది ఎంతకాలంగా చంద్రబాబునాయుడుగారినీ, ఆయన రాజకీయాలనూ, పరి పాలనా పద్ధతినీ పరిశీలిస్తున్నారో, రిపోర్ట్ చేస్తున్నారో తెలియదు కానీ ఆయన కొన్ని విషయాలలో అలవోకగా అసత్యాలు మాట్లాడుతూ ఉంటే కనీసం ఇదేమిటి? ఇట్లా జరగలేదు కదా ఆనాడు! అని నిలదీయకపోవడం ఆశ్చర్యం. అయినా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మీడియా ఉన్న పరిస్థితిని చూస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా లేదు. చంద్రబాబు నిర్వహించే సుదీర్ఘ పత్రికా గోష్ఠులలో ఆయన ఉపన్యాసాలు వినాల్సిందే తప్ప, ఎదురు ప్రశ్నించే సాహసం చెయ్యకూడదు. అట్లా చే స్తే ఆయన దబాయించి కూర్చోబెడతారు. ఆయన దృష్టిలో ప్రశ్నించే వాళ్లంతా ఉన్మాదులు, అభివృద్ధి నిరోధకులు, ప్రజా వ్యతిరేకులు. ఈ ధోరణిని అడ్డుకునే సాహసం మీడియాకు లేకుండా పోతు న్నది. దానికి కారణం తెలిసిందే. ఇవాళ మీడియాకూ రాజకీయాలు ఉన్నారు. చంద్రుడి ఇలాకాలో మర్యాదరామన్నలు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలి, ప్యాకేజీలు వద్దు అంటూ మొన్న శనివారం రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్షాలూ, ప్రజాసంఘాలూ ఇచ్చిన పిలుపు విజయవంతమైతే ఏలినవారి ప్రాపకంలో ఉన్న పత్రికల్లో సింగిల్ కాలమ్ వార్త కూడా కనిపించలేదు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని కోరుతూ శాసనసభ రెండుసార్లు ఏకగ్రీవ తీర్మానం చేసి పంపింది. దానిని ప్రతిపాదించిన ముఖ్యమంత్రే కేంద్రం ప్యాకేజీ ప్రకటిస్తే, శాసనసభ ఇంకో ఆరు గంటల్లో సమావేశం అవుతుందనగా అర్ధరాత్రి పత్రికా గోష్ఠి నిర్వహించి హర్షం ప్రకటిస్తారు. ఒక్క ఆరుగంటలు ఆగి శాసనసభ ముందుకు కేంద్రం ప్యాకేజీ ప్రతిపాదన తెచ్చి మన తీర్మానాలకు కేంద్రం స్పందన ఇదీ అని చెప్పాల్సిన బాధ్యతను ఆయన పట్టించుకోలేదు. శాసనవ్యవస్థల పట్ల చంద్ర బాబునాయుడుకీ, ఆయన పార్టీ వారికీ ఉన్న గౌరవం ఎంతటిదో చాలాసార్లు రుజువైంది. మొన్నటికి మొన్న శాసనమండలిలో ఆయన, ఆయన పార్టీ సభ్యులు సెల్ఫీలు దిగిన విషయం రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తరువాత, తానెందుకు ఆ నిర్ణయం తీసుకున్నదీ సభలో చెప్పుకుంటానని 45 నిమిషాలు బతిమాలినా కుదరదు పొమ్మన్న ఆనాటి శాసనసభ స్పీకర్, ఇవ్వాల్టి ఆర్థిక, శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడిని పక్కన చేర్చు కున్న చంద్రబాబుకు శాసనవ్యవస్థల పట్ల ఎంత గౌరవం ఉందో అందరూ అర్థం చేసుకుంటారు. ఎన్టీఆర్ మాట్లాడితే ఎక్కడ సభ్యులు కరిగిపోరుు, మళ్లీ ఆయన పక్షం చేరిపోతారోనన్న భయంతో ఆనాడు ఆయనను మాట్లాడ నివ్వలేదు. ప్రఖ్యాత కమ్యూనిస్ట్ నాయకుడు తరిమెల నాగిరెడ్డి శాసన సభ్య త్వానికి రాజీనామా చేసి పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని తృణీకరించి వెళ్లిన నాడు కూడా ఆయన సుదీర్ఘ చారిత్రక ప్రసంగం చేసే అవకాశం కల్పించిన గొప్ప సంప్రదాయాలను పాటించిన శాసనసభలోనే ఎన్టీరామారావుకు చంద్రబాబు బృందం మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఆయన నోరు నొక్కే సింది. శాసనవ్యవస్థల పట్ల తెలుగుదేశం నాయకత్వానికి ఉన్న గౌరవం ఇది. టీడీపీ స్థాపించమని చెప్పిన అల్లుడు ఇక చంద్రబాబు శాసనసభ ఆవరణలో తన పెళ్లిరోజున మీడియాతో పంచుకున్న అనుభవాలలో ఆయన వ్యక్తిగత విషయాల జోలికి పోకుండా, రాజకీయాల గురించి చెప్పుకుంటే ఆయన మాట్లాడిన వాటిలో చాలా అసత్యాలు ఉన్నాయని ఆయా సందర్భాలలో క్రియాశీలక వృత్తి బాధ్యతలు నిర్వర్తించిన విలేకరులంతా ఒప్పుకుంటారు. వారిలో కొందరయినా ఇంకా జర్నలిజంలో కొనసాగుతున్నారు. ఆ రోజున ఆయన మాట్లాడిన రాజకీయ సంబంధమైన విషయాలకే వస్తే అంజయ్య మంత్రివర్గంలో తనకు మంత్రి పదవి రావడంలో అప్పటి తన మంచి మిత్రుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పట్టుదల గురించి చెప్పలేదు, సన్నిహితంగా ఉండేవాళ్లం అని మాత్రం చెప్పి వదిలేశారు. నిజమే, రాజశేఖరరెడ్డి విగ్రహం కనిపిస్తేనే సహించలేని, ఆ పేరు వింటేనే భరించలేని స్థితిలో తనకు మంత్రి పదవి రావడానికి రాజశేఖరరెడ్డి పట్టుపట్టారని చంద్రబాబు ఎందుకు చెప్పుకుంటారు? అప్పట్లో అంజయ్య మంత్రివర్గంలోకి వైఎస్ఆర్, చంద్రబాబు ఇద్దరికీ ఎలా స్థానం లభించిందో అప్పటి తరం నాయకులు, జర్నలిస్ట్‌లలో ఎవరిని అడిగినా చెపుతారు. ఎన్టీ ఆర్‌ను రాజకీయాల్లోకి ఆహ్వానించింది తానేనని కూడా చెప్పారు చంద్ర బాబు. అదే నిజమైతే 1982లో ఎన్టీ రామారావు పార్టీ ప్రకటించి, న్యూ ఎంఎల్ఏ క్వార్టర్స్‌లో మీటింగ్ పెట్టి ప్రకటన చేసిన నాటి నుండి, ఎన్టీఆర్ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయిన కొన్ని మాసాల వరకు ఆయన వెంట ఎక్కడా చంద్రబాబు ఎందుకు కనిపించలేదు? ఎన్టీఆర్ మీద పోటీ చేస్తానని తాను అనలేదని కూడా చెప్పారు. 1983 ఎన్నికల ముందు పార్టీ నాయకు రాలు (ఇందిరాగాంధీ) ఆదేశిస్తే మామ మీద పోటీకి సిద్ధమని చంద్రబాబు చేసిన ప్రకటన కటింగ్‌లు గత మూడురోజులుగా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారంలో ఉన్నాయి. పత్రికలు ఆనాడు అసత్యాలు రాసి ఉంటే ఆయన ఆనాడే ఎందుకు ఖండించలేదు? చంద్రబాబు తెలుగుదేశం ప్రవేశం ఆ పార్టీ ఆవిర్భావం నుండి ఉన్న వాళ్లెవరికీ ఇష్టంలేదు. 1985 నాటి గండిపేట మహానాడులో చంద్రబాబును పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించబోతున్నారని ప్రచారం జరిగింది. నాడు ఆయన మామ మీద చేసిన సవాలు తాలూకు పత్రికల వార్తల కటిం గ్లు ఆ మరునాడు తెలుగు విజయం ఆవరణ అంతటా కనిపించాయి. ఆయన ప్రధాన కార్యదర్శి కాకుండా అడ్డుకునేందుకు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు వర్గమే ఈ కటింగ్‌లు బయటికి తెచ్చిందని వార్తలు కూడా వచ్చారు. ఆ విషయంలో తనను అనవసరంగా వివాదంలోకి ఈడ్చారని దగ్గుబాటి మీడియా మీద అలిగారు కూడా. అయినా చంద్రబాబునాయుడే ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇదంతా నేను ‘ఉదయం’ దినపత్రికకు రిపోర్ట్ చేశాను. ఆ తరువాత అధికారం కోల్పోయాక ఎన్.టి. రామారావు అనేక సందర్భాలలో ఈ విషయం ప్రస్తావించి తనకు జరిగిన ద్రోహానికి బాధపడ్డారు. మరి ఆనాడు పత్రికలు అసత్యాలు రాశాయా? రాస్తే మీరెందుకు ఖండించలేదు అని మొన్నటి మీడియా చిట్‌చాట్‌లో స్నేహ పూర్వకంగా అయినా ఒక్కరూ చంద్రబాబును ప్రశ్నించలేకపోయారు. తనను టీడీపీలో చేరొద్దనీ, ఉన్న పార్టీ నుంచే పోటీ చెయ్యమని ఎన్టీఆర్‌గారే సూచించారని కూడా చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్‌ది ఒక విభిన్నమైన పోకడ. రాజకీయాల్లో ఆయన విలక్షణ వ్యక్తిత్వం గురించి తెలిసిన వారెవ్వరూ ఇది నమ్మరు. ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్ని కించపరిచేందుకు చంద్రబాబు చేసిన మరో ప్రయత్నం ఇది. చంద్రబాబు వైస్రాయ్ హోటల్లో శిబిరం ఏర్పాటు చేసినప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు దగ్గర కార్యదర్శిగా ఉన్న డాక్టర్ జయప్రకాశ్‌నారాయణ్ అర్ధరాత్రి వెళ్లి పరిస్థితి వివరించినప్పుడు అధికారం పోతే పోయింది కానీ, ఎవరినీ బుజ్జగించేది లేదని ఖరాఖండిగా చెప్పిన ఎన్టీఆర్ చంద్రబాబును కాంగ్రెస్‌లోనే ఉండి పదవి కాపాడుకో అని చెప్పారంటే ఎవరు నమ్ముతారు? పుట్టగానే పరిమళించిన పూవు ఇది ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్ని తగ్గించి చూపే ప్రయత్నమే. రెండుసార్లు ప్రధాన మంత్రి పదవి వద్దన్న మాట నిజమే. దేవెగౌడ, ఐకే గుజ్రాల్ తరహాలో రాజకీయ చతురత లేని వ్యక్తి కాదు కాబట్టే ఆయన ప్రధాని పదవిని వద్దను కున్నారప్పుడు. బయటి నుండి కాంగ్రెస్ ఇచ్చే మద్దతు మీద ఆధారపడి నడిచే యునెటైడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో ప్రధాని పదవి తుమ్మితే ఊడిపోయే ముక్కు అని తెలుసు కాబట్టే వద్దనుకున్నారు. ఆనాడు ప్రధానమంత్రి పదవి తీసు కుంటే రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి పదవి చేజారిపోతుంది. రాష్ట్రంలో ప్రభుత్వం మీదా, పార్టీ మీదా పట్టు సడలిపోతుంది అని ఆయన కంటే బాగా ఎవరికీ తెలుస్తుంది. 13 ఏళ్ల లోకేశ్‌బాబు ప్రధాని పదవి టెంపరరీ, ముఖ్యమంత్రి పదవి పర్మినెంట్ అని తండ్రికి సలహా ఇచ్చాడంటే నమ్మదల చుకున్న వారు నమ్మొచ్చు కానీ అది ఆనాడు చంద్రబాబు అభిప్రాయమే. ప్రజాస్వామ్యంలో పదవులు శాశ్వతం అని ఆయన నమ్మినంతగా ఇంకెవరూ నమ్మరు. ఏ ఎన్నికలూ స్వశక్తితో గెలవని చంద్రబాబు 1995లో ముఖ్యమంత్రి అయ్యాక 2020 దాకా తానే ముఖ్యమంత్రిని అనుకుని 2004లో ఓటమి చవి చూశారు కదా! రానున్న మంత్రివర్గ విస్తరణలో లోకేశ్‌ను మంత్రిని చేయబో తున్నారనే వార్తలు వస్తున్నారుు, ఇప్పటికే ఆయన తండ్రి చాటున రాజకీయా లనూ, పాలననూ చక్కబెడుతున్నట్టు కూడా ప్రచారంలో ఉంది కాబట్టి 13 ఏళ్ల లోకేశ్ సలహా అంటూ చంద్రబాబు చెప్పిన మాటలు ఆ కోణంలో ఏమన్నా ఉపయోగపడవచ్చు. పూవు పుట్టగానే పరిమళించింది అన్నట్టు లోకేశ్‌బాబు 13వ ఏటనే తండ్రికి రాజకీయ సలహాదారు అయ్యారన్నమాట. ఇక భారతీయ జనతా పార్టీతో స్నేహం కారణంగా మైనారిటీలు తన పార్టీకి దూరమయ్యారన్న విషయం గ్రహించిన చంద్రబాబు అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో రాష్ట్రపతిగా ఏపీజే అబ్దుల్ కలాం అభ్యర్థిత్వాన్ని అంగీకరించారు తప్ప ఆనాడు చంద్రబాబు ఆ పదవికి హామీ ఇచ్చింది కృష్ణకాంత్కేనన్నది సత్యం. మధ్యలో వదిలేసి ఇప్పుడు మళ్లీ మిత్రుడయ్యాడు కాబట్టి కమలనాథులు కలాం మా అభ్యర్థి, చంద్రబాబుకు సంబంధంలేదు అని చెప్పుకోలేకపోవచ్చు. మనం ఏమైనా మాట్లాడొచ్చు కానీ, చరిత్రను మార్చలేం కదా! ఆ విషయం చంద్రబాబుకు బాగా తెలుసు. దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
ఎంత మాటన్నారు చంద్రబాబు గారూ!
-
ఎంత మాటన్నారు చంద్రబాబు గారూ!
(సాక్షి వెబ్ ప్రత్యేకం) ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సరిగ్గా 35 ఏళ్ల తర్వాత తన రాజకీయ జీవిత విశేషాలను నెమరువేసుకుంటూ చెప్పిన పలు విషయాలు విశ్లేషకులను నివ్వెరపరుస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. అసలు పార్టీ పెట్టమని ఎన్టీఆర్‌కు చెప్పింది తానేననీ, ఎన్నికల్లో ఎన్టీఆర్పైన పోటీ చేస్తానని తానెప్పుడూ చెప్పలేదంటూ చంద్రబాబు అంటున్న విషయాలపై ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రజలు రకరకాల సెటైర్లు వేస్తున్నారు. గత చరిత్రను తిరగదోడుతున్నారు. 1982లో పార్టీ స్థాపించాలని ఎన్టీఆర్ నిర్ణయం తీసుకున్న రోజుల్లో చంద్రబాబు కాంగ్రెస్‌లో సినిమాటోగ్రఫీ, పురావస్తు శాఖల మంత్రిగా కొనసాగుతున్నారు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పుడుగానీ, దాని కోసం జరిగిన కసరత్తులోగానీ చంద్రబాబు పాత్ర ఎక్కడా లేదు. పైపెచ్చు సినిమా గ్లామర్‌కు ఓట్లు రాలుతాయా? అంటూ ఎద్దేవా చేశారు. అలాంటి చంద్రబాబు తన పెళ్లి రోజును స్మరించుకుంటూ చెప్పిన వివరాలు ప్రజలను విస్మయపరిచాయి. "ఎన్టీఆర్‌కు పార్టీ పెట్టమని చెప్పింది నేనే...." పెళ్లయి 35 ఏళ్లు అయిన సందర్భంగా మీడియాతో ముచ్చటిస్తూ చంద్రబాబు చెప్పినమాట ఇది. ఇంతకు ముందెప్పుడూ చంద్రబాబు ఈ మాట చెప్పలేదు. ఎన్టీఆర్ బతికి ఉన్నప్పుడు ఇలాంటి మాటలే ఆయన నోటి నుంచి రాలేదు. ఎన్టీఆర్ మరణించిన 20 ఏళ్ల తర్వాత చంద్రబాబు చెప్పిన ఈ మాటలను.. గతంలో జరిగిన సంఘటనలతో పోల్చుతూ సోషల్ మీడియాల్లో పోస్టులు చేస్తున్నారు. నిజానికి అంతకు ముందు ఏం జరిగిందంటే... 1982 మార్చి 21 న రామకృష్ణా స్టూడియోస్‌లో విలేకరుల సమావేశం పెట్టి ప్రజాజీవితంలోకి రావాలని నిర్ణయించుకున్నానని ఎన్టీఆర్ ప్రకటించారు. అప్పుడు ఎన్టీఆర్ పక్కన చంద్రబాబు లేరు సరికదా... పెట్టిన తర్వాత పార్టీలో చేరాలని ఆహ్వానించినా చంద్రబాబు తిరస్కరించారు. అదో గాలి పార్టీ అని ఎద్దేవాచేశారు. ఎన్టీఆర్ ప్రకటన వెలువడిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన నాదెండ్ల భాస్కరరావు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆదయ్య, రత్తయ్య, నారాయణ తదితరులు ఆ పార్టీకి రాజీనామా చేసి ఎన్టీఆర్‌కు మద్దతు ప్రకటించారు. ఆ సమయంలోనూ పక్కన చంద్రబాబు లేరు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఊటీలో సినిమా షూటింగ్ ముగించుకుని 1982 మార్చి 29న హైదరాబాద్ వచ్చిన ఎన్టీఆర్ నేరుగా నాదెండ్ల ఇంటికి వెళ్లారు. అప్పుడు కూడా చంద్రబాబు లేరు. హైదరాబాద్ లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఎన్టీఆర్ తన పార్టీ పేరు తెలుగుదేశంగా ఖరారు చేశారు. అప్పుడు చంద్రబాబు ఆ దరిదాపుల్లో లేరు. రామకృష్ణా స్టూడియోస్‌లో టీడీపీ లోగోను ఎన్టీఆర్ ఒక కాగితం మీద గీశారు. చక్రం, నాగలి, గుడిసె చిత్రాలతో పసుపు జెండా రూపొందించి అక్కడే ఉన్న ప్రముఖుల అభిప్రాయాలను కోరారు. వారెవరంటే... బెజవాడ పాపిరెడ్డి, తుర్లపాటి సత్యనారాయణ, యలమంచిలి శివాజీ, నాదెండ్ల భాస్కరరావు, రత్తయ్య, ఆదయ్య, నారాయణ, దగ్గుబాటి చెంచురామయ్య తదితరులు మాత్రమే. అక్కడ కూడా చంద్రబాబు లేరు. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత 1982 ఏప్రిల్ 11 న హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో టీడీపీ తొలి బహిరంగ సభను ఎన్టీఆర్ నిర్వహించారు. ఆ ఛాయల్లో ఎక్కడా చంద్రబాబు లేరు. ఆనాడేం జరిగింది... దగ్గుబాటి మాటల్లోనే... "నిజాం కాలేజీలో మొదటిసభ ముగిసిన తర్వాత ఆయా నాయకుల మద్దతు కోరడానికి, పార్టీలోకి ఆహ్వానించడానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన నాటి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చంద్రబాబు దగ్గరికి వెళ్లాను. అప్పుడు చంద్రబాబు ఒక కాగితం తీసుకుని లెక్కలేసి ఎన్టీఆర్ జేబులోంచి పైసా తీయడు. ఎన్టీఆర్‌కు 5 శాతం ఓట్లు మాత్రమే వస్తాయి. సినిమా మోజుకి ఓట్లు పడతాయా? ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవడు. నాకు కాంగ్రెస్‌లో మంత్రిపదవి ఉంది. నేను మంత్రి పదవి వదులుకుని ఎలా వస్తాను?" అంటూ టీడీపీలోకి వచ్చేదే లేదని తేల్చిచెప్పారు చంద్రబాబు. ఆ తర్వాత క్రమంలో 1982 మే 28న ఎన్టీఆర్ తన జన్మదినం సందర్భంగా తిరుపతిలో ఒక సభ ఏర్పాటుచేసి దానికి మహానాడు అని పేరు ఖరారుచేశారు. (ఆ సమయంలోగానీ... ఆ సభ జరిగినప్పుడు గానీ ఆ దరిదాపుల్లో చంద్రబాబు లేరు) 1982 నవంబర్ 18 న కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే మామ ఎన్టీఆర్ మీద పోటీకి రెడీ అని చంద్రబాబు ప్రకటన చేశారు. 1982 లో తిరుపతిలోని పాలిటెక్నిక్ గ్రౌండ్స్ లో నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ, అధిష్టానం ఆదేశిస్తే మామ ఎన్టీఆర్ మీద పోటీకి సిద్ధమని ప్రకటించారు. దానికి కొద్దిరోజుల ముందే ఆంధ్రపత్రికలో (దగ్గుబాటి ఒక చరిత్ర కొన్ని నిజాలు పుస్తకం నుంచి) చంద్రబాబు చెప్పిన విషయాలు "మామ ఎన్టీఆర్ పై ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి రెడీ. తెలుగుదేశం ఒక గాలి పార్టీ. దానికి భవిష్యత్తు లేదు" అన్న శీర్షికతో ప్రచురితమైంది. ఇదే విషయం అప్పట్లో మరికొన్ని పత్రికల్లో ప్రచురితమైంది. ఏమాత్రం తడుముకోకుండా...!! చంద్రబాబు ఆ మాటలు చెప్పినట్టు చరిత్రలో ఎన్నో సాక్ష్యాలున్నా, ఏమాత్రం తడబాటు లేకుండా ఎన్టీఆర్‌పై పోటీ చేస్తానని తానెప్పుడూ చెప్పలేదని తాజాగా అన్నారు. 1983 జనవరి 5న పుట్టినగడ్డ చంద్రగిరిలో మేడసాని వెంకటరామ నాయుడు అలియాస్ మీసాల నాయుడు చేతిలో 17,429 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి చంద్రబాబు ఘోరంగా ఓడిపోయారు. అప్పుడే టీడీపీ రాష్ట్రంలో ఘన విజయం సాధించింది. సరిగ్గా ఆ తర్వాతి నుంచి చంద్రబాబు రూటు మార్చడం ప్రారంభించారు. ఎన్నికల్లో ఓడిపోయిన 15 రోజులకే మామ ఎన్టీఆర్ వద్దకు పలువురి ద్వారా రాయబారం పంపారు. తన విధానాలను మార్చుకుంటానని, అంకితభావంతో పనిచేస్తానని... రాయబారం నెరిపారు. ఆ తర్వాత టీడీపీలో చేరుతానని ప్రకటన చేశారు. (విధానాలను మార్చుకుంటా అంటున్నారని, అందుకే పార్టీలో చేర్చుకుంటున్నానని ఎన్టీఆర్ చెప్పినట్టు దగ్గుబాటి తన పుస్తకంలో రాసుకున్నారు) 1983లో చిత్తూరు జిల్లాలో టీడీపీ ఓటమికి తీవ్రకృషి చేయడమే కాకుండా అప్పట్లో జిల్లాలోని టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేయించిన చంద్రబాబును చేర్చుకుంటే పార్టీ పతనానికి నాంది పలికినట్టేనని అప్పట్లో టీడీపీ నేత సిద్దయ్య మూర్తి బహిరంగంగానే ప్రకటించారు. అదే సంవత్సరం జరిగిన పార్టీ రాష్ట్ర స్థాయి సదస్సులో చంద్రబాబును ఓడించిన మీసాల నాయుడు లేచి కాంగ్రెస్ వారిని పార్టీలో చేర్పించుకోరాదని తీర్మానం ప్రవేశపెట్టగా దానికి మద్దతు తెలుపుతూ 99 శాతం మంది చేతులెత్తి దాన్ని బలపరిచారు. ఇలాంటివారిని పార్టీలోకి ఆహ్వానిస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని మహిళా విభాగం నాయకురాలు రమణమ్మ అసంతృప్తి వ్యక్తం చేశారు. వీరి చేరికను వ్యతిరేకిస్తూ మరో నాయకురాలు సీతామహాలక్ష్మి కన్నీరు పెట్టుకున్నారు. ఆ తర్వాతి కాలంలో వారందరికీ సర్దిచెప్పిన ఎన్టీఆర్ (పిల్లనిచ్చిన మామ కావడంతో) చంద్రబాబును పార్టీలో చేర్చుకున్నారు. (తోడల్లుడు దగ్గుబాటు వెంకటేశ్వరరావు రాసిన ఒక చరిత్ర కొన్ని నిజాలు పుస్తకంలోంచి...) రాజ్యాంగం పర్మిట్ చేస్తే...! ''ఒక వ్యక్తి బొమ్మ (ఎన్టీఆర్) పెట్టుకొని గెలవలేదు. ప్రతి ఒక్కరి కంట్రిబ్యూషన్ ఉంది. అందరూ కలిసే ఎన్నికల్లో గెలిచాం. ఎన్టీఆర్‌కు చరిష్మా ఉంటే ఆయన 1989లో ఎందుకు ఓడిపోయారని అడుగుతున్నాను. 1984 ఆగస్టు క్రైసిస్ తర్వాత మిత్రపక్షాలు అందరూ కలిసి 240 మంది గెలిచాం. తిరిగి 1994లో అందరికీ తెలిసిందే. ఆ విధంగా ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్తో గెలిచాం. ఏ ఒక్కరితో కాదు'' -1995లో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు అసెంబ్లీ వేదికగా చంద్రబాబు చెప్పిన మాటలివి. ఒకానొక చర్చ సందర్భంగా ఆయన ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన అంశంపై చంద్రబాబు సభలో మాట్లాడారు. "ఇదే హౌస్‌లో 227 మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ చేసినా ఇంకా ప్రజాస్వామ్యం...! ప్రజాస్వామ్యం...! అని మాట్లాడితే నాకే అర్థం కావడం లేదు. అసలు ప్రజాస్వామ్యానికి డెఫినిషన్ ఏమిటని వారిని (ప్రతిపక్షాలను ఉద్దేశించి) అడుగుతున్నాను. ఎన్టీఆర్ ఏం చేశారంటే... పార్టీ రాజ్యాంగాన్ని రాసుకున్నామని అన్నారు. ఆయన ఎప్పుడు రాసుకున్నారో నాకు తెలియదు. పార్టీ అధ్యక్షుడిగా శాశ్వతంగా ఆయన ఉంటారని రాసుకున్నారు. మన కాన్ స్టిట్యూషన్ కూడా పర్మిట్ చేస్తే... ఆయన శాశ్వతంగా ముఖ్యమంత్రి అని రాసుకునే వారేమో నాకు తెలియదు." ఆగ్రహంతో ఊగిపోతూ అన్న మాటలివి. (5 డిసెంబర్ 1995 రోజున శాసనసభలో చంద్రబాబు చేసిన ప్రకటన - అసెంబ్లీ రికార్డుల్లోంచి). ఇదే చంద్రబాబు.. తనకు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చిందని, కానీ అప్పటికి పదో తరగతి చదువుతున్న తన కుమారుడు లోకేశ్‌ను అడిగితే ముఖ్యమంత్రి పదవి శాశ్వతం, ప్రధాని పదవి అశాశ్వతం అని చెప్పాడని, అందుకే తాను ముఖ్యమంత్రి పదవినే ఎంచుకున్నానని చెప్పారు. ఎన్టీఆర్ విషయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తి.. తన కొడుకు చెబితే మాత్రం ముఖ్యమంత్రి పదవి శాశ్వతం అని ఎలా భావించారో ఆయనకే తెలియాలి! కళ్లార్పకుండా... ఎన్టీఆర్ విషయంలో ఇలా ఒకో సందర్భంలో ఒకలా మాట్లాడిన చంద్రబాబు తాజాగా మీడియాతో చేసిన వ్యాఖ్యలు సర్వత్రా నివ్వెరపరుస్తున్నాయి. మామ ఎన్టీఆర్‌పై ఎక్కడినుంచైనా పోటీకి రెడీ అని చంద్రబాబు ప్రకటన చేసిన కొద్దిరోజుల్లోనే ఇప్పుడు రాజకీయాల్లో చురుగ్గా ఉన్న నేతలు టీఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు, కేంద్ర మంత్రి పి. అశోక గజపతిరాజు, కాంగ్రెస్ నేత కె.జానారెడ్డి, టీడీపీ నేత ముద్దుకృష్ణమ నాయుడు తదితరులు టీడీపీలో చేరారు. ఇలా ఒకరేంటి... చాలామంది నేతలు చంద్రబాబు కన్నా ఎంతో ముందుగా టీడీపీలో చేరినవారే. ఆనాటి చరిత్రకు వీళ్లంతా సాక్షులే. ఇంత జరిగినా... ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి ఆహ్వానించింది తానేననీ, పార్టీ పెట్టమని చెప్పిందీ తానేననీ... వంటి మాటలు అలవోకగా చెప్పడం చంద్రబాబుకే చెల్లింది. -
‘రద్దు’తో రైతుకు కొత్త చిక్కులు
కంటిలో నలక పడిందని కన్ను తీసేస్తామన్నట్టు పాస్ పుస్తకాల రద్దుతో లంచగొండి తనం మటుమాయం కాదుగానీ రైతుల కష్టాలకు అంతుండదు. ఇక, 1బి రికార్డు ద్వారానే బ్యాంకు అప్పులు తదితర లావాదేవీలు జరిపిస్తామనడం వెర్రితనం. రైతుల పట్టాదారు పాస్ పుస్త కాలను త్వరలోనే రద్దు చేస్తా మంటూ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ప్రకటన రాష్ట్ర రైతాంగాన్ని తీవ్ర ఆందో ళనకు గురిచేస్తోంది. గతంలో రైతులు ఎదుర్కొనవలసి వస్తుండిన అనేక సమస్యలకు విరుగుడుగానే నాటి ముఖ్య మంత్రి యన్.టి.రామారావు పట్టాదారు పాస్ పుస్తకా లను ప్రవేశపెట్టారు. దీంతో అంతవరకు బ్యాంకులు, గ్రామీణ సహకార పరపతి సంఘాల రుణాల విషయం లో రైతాంగం ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులు తొల గిపోయాయి. అంతేకాదు రైతాంగానికి నేడు అవి అత్యా వశ్యకమైనవిగా మారాయి కూడా. వాటిని రద్దు చేస్తా మంటూ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం రైతులను ఒక్కసారిగా అయోమయ పరిస్థితులలో పడ వేసింది. ప్రభుత్వం అంటున్నట్టుగా పాస్‌బుక్కులు రద్ద య్యేసరికే ‘1బి’లో (భూమి హక్కును తెలిపే రికా ర్డు)ఆన్లైన్లో భూయజమానులుగా తమ పేర్లు నమోదు అవుతాయనే భరోసా లే దు. కాబట్టి పాసు పుస్తకాల రద్దు తర్వాత తమ పరిస్థితి ఏమిటో తెలియని ఆందోళనలో రైతాంగం ఉంది. పెద్ద సంఖ్యలో రైతులు ఇప్పటికీ పాసు పుస్తకాల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరు గుతూనే ఉన్నారు. పాస్ బుక్ కోసం రూ.4 లక్షల లంచం అడగడంతో కడప జిల్లాలో ఒక రైతు ఆత్మహత్య చేసుకో వాల్సివచ్చింది! ప్రభుత్వం రద్దు చేస్తామంటున్న పాస్ పుస్తకానికి రైతాంగంలో ఎంత విలువందో ఇది తెలియ జేయడం లేదా? పాసు పుస్తకాల జారీలోని అవినీతిని, వాటి దుర్వినియోగాన్ని అరికట్టాలంటే రెవెన్యూ వ్యవస్థ లోని లోపాలను సరిదిద్దాలి. పాసుపుస్తకాల రద్దు ఎలా ఆ పని చేయగలదో ఎవరికీ అర్థంకానిది. ఇక ప్రభుత్వం సూచిస్తున్న ప్రత్యామ్నాయం పూర్తి అయోమయం. ఏ రిజిష్టరులో గ్రామ కంఠాలుగా నమోదైన భూములను ఇప్పుడనుభవిస్తున్న రైతులకిస్తారా లేక ప్రభుత్వ భూమి కింద నమోదు చేస్తారా? సమాధానం లేదు. ‘1బి’ రికా ర్డుల్లో 50 శాతం కూడా అసలు రైతుల పేర్లు నమోదు కాలేదు. దస్తావేజులన్నీ ఉన్నా విలువైన భూములను 1బిలో చేర్చాలంటే రైతులు ఎంతో కొంత చేయి తడపా ల్సిందే. 1బి రికార్డు సరిచేయడం మంచిదే. కానీ అదేమీ ఒకటి, రెండు వారాల్లో అయ్యేది కాదు. 1బి లో అసలు రైతుల పేర్లను నమోదు చెయ్యాలంటే... చాలా సంద ర్భాల్లో పూరా నంబరులోని మొత్తం భూమికంటే ఎక్కు వ భూమి ఇప్పటికే నమోదయి ఉంటోంది. ఆ పూరా నంబర్లలో నమోదై ఉన్న రైతుల దస్తావేజులను తనిఖీ చేయాలి. కొన్ని సందర్భాలలో తిరిగి సర్వే చేయిస్తే తప్ప పూర్తి రికార్డుగా పరిగణించలేం. దీనికి చాలా సమయమే పడుతుంది. సర్వేయర్లూ పెద్ద సంఖ్యలో కావాలి. లేక పోతే 1బి తప్పుల తడకగా ఉండటం ఖాయం. ఇప్పటికే ప్రభుత్వ అవసరాల కోసం తీసుకున్న భూమిని సబ్ డివి జన్ చేయలేదు. అది కూడా మొత్తం సర్వే నంబర్లలో, అసైన్డ్ భూమి కింద సబ్ రిజిస్ట్రార్ రికార్డులలో నమోదై ఉంది. ఆ సర్వే నంబరులో మిగిలి ఉన్న రైతుల భూమిని అమ్మాలంటే రెవెన్యూ వారు అడంగల్ సబ్ డివిజన్ చేసి, వాటి 1బిలలో మార్పులు చేసి, సబ్ రిజిస్ట్రార్ ద్వా రా, జిల్లా రిజిస్ట్రార్‌కి పంపాలి. ఆ తర్వాత ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారి నుంచి ఆదేశాలు వస్తే తప్ప రిజిస్ట్రేషన్ కాదు. ఒక సామాన్య రైతు ఇంత పని చేయడం చాలా కష్టం. రెవెన్యూ వ్యవస్థలో మార్పులు చేయాల్సిన అవసరం ఉండటం వల్ల రికార్డు సరిచేయ కుండా మార్పు చేస్తే రైతులకు తమ భూమి, ఏఏ నంబ ర్లలో ఉందో అర్థం కాని పరిస్థితి ఎదురవుతుంది. కం టిలో నలక పడిందని కన్ను తీసేస్తామన్నట్టు పాస్ పుస్త కాలను రద్దు చేసేస్తే... లంచగొండితనం మటుమాయం కాదుగానీ రైతుల కష్టాలకు అంతుండదు. ఇక, 1బి రికార్డు ద్వారానే బ్యాంకు అప్పులు తదితర లావా దేవీలు జరిపిస్తామనడం వెర్రితనం. 1బి రికార్డు సరి చేయవలసింది రెవెన్యూ అధికారులు కారా? కంప్యూట ర్లో 1బి రికార్డు నమోదుకు వారు లంచం తీసుకోరా? మరి పాస్ పుస్తకాల రద్దుతో ప్రయోజనం ఏమిటి? రాష్ట్రంలో ప్రభుత్వం పని చేయడం లేదు, అంతా అధి కారుల పాలనే. కాబట్టి పాస్ పుస్తకాల జారీని క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఆ క్రమంలో సమూల మార్పులు తెచ్చి పాస్ పుస్తకాల జారీని సులభతరం చేయాలి. మరో ముఖ్యమైన అంశం కాలువల ఆధునికీకరణ. డా॥వై.ఎస్. రాజశేఖరరెడ్డి గారు పురాతన డెల్టా వ్యవ స్థను పూర్తి స్థాయిలో ఆధునికీకరణం చేయడానికి నడుం బిగించారు. కాగా, ప్రస్తుత ప్రభుత్వం డెల్టా ఆధునికీ కరణనే రద్దు చేసింది. ఇక రుణమాఫీ అంటూ ఆర్భాటం చేసి, రైతు వ్యవస్థనే రద్దు చేయబోతోంది. సహకార సం ఘాల ద్వారా దీర్ఘకాలిక అప్పులకు వడ్డీ రాయితీ జీఓ ఇవ్వక దాన్నీ రద్దు చేసింది. ఇక వ్యవసాయ యాంత్రీక రణ పేరిట కొందరు టీడీపీ కార్యకర్తలు సబ్సిడీ యంత్రా లను రైతులకు అమ్మి సొమ్ము చేసుకొంటున్నారు. ఇదిలా ఉండగా, రైతులకు విత్తనాలను సరఫరా చేయలేక, వారిని నేరుగా ప్రైవేట్ మార్కెట్లో కొనుక్కోమనే నిస్స హాయ స్థితిలో ప్రభుత్వం ఉంది. రైతులకు లాభసాటి యైన కనీస మద్దతు ధరను ఇవ్వకపోగా, ఎరువుల సబ్సి డీని మధ్య దళారుల చేతికి అందించి రైతుని దగా చేస్తోం ది, వ్యవసాయరంగాన్ని నష్టపరుస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం తన తప్పుడు విధానాలు విడనాడి రైతుకింత మేలు చేసే దిశకు మరలాలని కోరుతున్నాం. (వ్యాసకర్త రాష్ట్ర నీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి) మొబైల్: 9440204323 - కొవ్వూరి త్రినాథరెడ్డి -
'ఎన్టీఆర్ పదవీచ్యుతిలో డీజీపీ పాత్రధారి'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా జాస్తి వెంకట రాముడిని నియమించడాన్ని సవాలు చేస్తూ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు (నాని) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రకాశ్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా రాముడి నియామకం జరిగిందని, అందువల్ల ఆయన నియామకపు జీవోను నిలిపేసి, రాముడి కన్నా సీనియర్ అధికారికి డీజీపీ బాధ్యతలు అప్పగించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని ఆయన తన పిటిషన్లో న్యాయస్థానాన్ని కోరారు. ఎన్టీ రామారావును సీఎం పదవి నుంచి దించివేయడంలో సహకరించినందుకే రాముడిని ...చంద్రబాబు డీజీపీగా చేశారని కొడాలి నాని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. గతంలో ఎన్టీ రామారావును గద్దె దించేందుకు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలను వైస్రాయ్ హోటల్లో ఉంచారు. ఆ హోటల్ హైదరాబాద్ నార్త్ జోన్ పరిధిలో ఉందని, దానికి డిప్యూటీ కమిషనర్ గా రాముడు వ్యవహిరించారని, తనకు అప్పుడు సహకరించినందుకే చంద్రబాబు...ఇప్పుడు రాముడిని డీజీపీని చేశారని కొడాలి నాని తన పిటిషన్లో పేర్కొన్నారు. వీటన్నింటి దృష్ట్యా రాముడు నిష్పాక్షికంగా పోలీసు బలగాలను నడిపిస్తారనే విశ్వాసం ప్రజలకు కలగడం లేదని, అంతేకాకుండా 1993లో రాముడు పుట్టిన తేదిని సవరించడం జరిగిందని, దానివల్లే ఆయనకు మరో రెండేళ్లపాటు డీజీపీగా కొనసాగే అవకాశం వచ్చిందన్నారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని డీజీపీగా రాముడు నియామకాన్ని రద్దు చేయాలని, కేసు తేలేంతవరకు డీజీపీ బాధ్యతలను మరో సీనియర్ అధికారికి అప్పిగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును అభ్యర్థించారు. -
చంద్రబాబు వల్లే ఎన్టీఆర్ మరణం: వీహెచ్
చంద్రబాబు చేసిన అవమానం వల్లే ఎన్టీ రామారావు మరణించారని, ఆయన మరణంపై మళ్లీ విచారణ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాస్తానని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు తెలిపారు. టీడీపీ నేతలు ఇప్పుడు ఎన్టీఆర్ మీద లేనిపోని ప్రేమాభిమానాలు కురిపిస్తున్నారన్నారు. పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టించింది కాంగ్రెస్ పార్టీయేనని వీహెచ్ తెలిపారు. కావాలంటే బేగంపేట విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టుకోవాలి గానీ, శంషాబాద్ డొమెస్టిక్ టెర్మినల్‌కు మాత్రం రాజీవ్ గాంధీ పేరు ఉండాల్సిందేనన్నారు. దీనికోసం పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద మంగళవారం ధర్నా చేస్తామని చెప్పారు. -
ఎన్టీఆర్‌కు సీఎం చంద్రబాబు నివాళి
టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం దివంగత ఎన్.టి. రామారావుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో సోమవారం ఉదయం 7.58 గంటలకు స్థానిక ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించారు. ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన అనంతరం సీఎం అసెంబ్లీకి వెళ్లారు. చంద్రబాబు వెంట మంత్రులు డా. నారాయణ, పరిటాల సునీత, పీతల సుజాత, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, పలువురు పార్టీ నేతలు ఉన్నారు. - సాక్షి, హైదరాబాద్ -
నేటికీ బ్రిటీష్ కాలం నాటి సంఖ్యే...
ఒంగోలు కలెక్టరేట్ : ‘ప్రస్తుతం ఉన్న సిబ్బంది సంఖ్య బ్రిటీష్ కాలం నాటిదే. ఒకవైపు జనాభా పెరుగుతున్నా అందుకు అనుగుణంగా కార్యాలయాలు పెంచడం లేదు. సిబ్బందిని పెంచడంలేదు. పైగా, ప్రస్తుతం ఉన్న వారిని దిగకోస్తూ మానసిక ఆందోళనకు గురిచేస్తున్నారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన నూతన ప్రభుత్వమైనా ఈ సమస్యపై దృష్టి సారించి పరిష్కరించాలి’ అని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. శుక్రవారం ఒంగోలు వచ్చిన సందర్భంగా స్థానిక రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1983 తరువాత అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 25 నుంచి 50 వేలలోపు జనాభా ఉంటే మండలాన్ని ఏర్పాటు చేశారన్నారు. ప్రస్తుతం లక్షలాది జనాభా పెరిగినా అదే సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని కలెక్టరేట్లలో కూడా ఇదే పరిస్థితి నెలకొందన్నారు. 432 మంది సూపరింటెండెంట్లకు సంబంధించి 167 కోట్ల రూపాయల బడ్జెట్‌తో గత ప్రభుత్వానికి నివేదిక అందించినప్పటికీ పట్టించుకోలేదన్నారు. నూతనంగా 20 డివిజన్లు ఏర్పాటు చేయాలని సీసీఎల్ఏ ప్రభుత్వానికి నివేదిస్తే కేవలం 10 డివిజన్లతో సరిపెట్టిందన్నారు. జలయజ్ఞంలో భాగంగా రాష్ట్రంలో 78 భూసేకరణ యూనిట్లు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ల ఆధీనంలో ఉన్నాయని, అందులో 35 మంది సిబ్బంది ఉన్నారని, వాటిలో 28 యూనిట్ల ను రద్దు చేశారని ఆయన పేర్కొన్నారు. ఆక్రమణలు తొలగించిన వారిపై క్రిమినల్ కేసులు అన్యాయం... ఆక్రమణలు తొలగించిన రెవెన్యూ అధికారులు, సిబ్బందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం అన్యాయమని బొప్పరాజు ఆందోళన వ్యక్తం చేశారు. ఆక్రమణలు తొలగించే సమయంలో ఒకవర్గం వారు రెచ్చగొట్టి మరో వర్గంచేత సంబంధిత తహసీల్దార్, ఆర్ఐపై కేసులు పెట్టిస్తున్నారని, చివరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా నమోదు చేయిస్తున్నారని తెలిపారు. అమాయకులైన ప్రజలను రెచ్చగొట్టి దళారులు కేసులు పెట్టిస్తున్నారని, ఇలాంటి కేసులపై జిల్లా అధికారులు, పోలీసు యంత్రాంగం స్పందించాలని ఆయన కోరారు. తూతూమంత్రంగా హెల్త్‌కార్డులు... ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని నాలుగేళ్ల నుంచి కోరుతుంటే గత ప్రభుత్వం చివరి దశలో తూతూమంత్రంగా ఇచ్చిందని బొప్పరాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. 30 రకాల వ్యాధులకు ఓపీ ట్రీట్మెంట్ ఇవ్వాలని కోరినప్పటికీ ఫలితం లేకుండా పోయిందన్నారు. రెగ్యులర్‌గా ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పిస్తే కొంతమేర ప్రయోజనం ఉంటుందన్నారు. ప్రతి ఉద్యోగికి రెండు లక్షల రూపాయల రీయింబర్స్మెంట్ ఉన్నందున నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం హెల్త్‌కార్డుల విషయంలో మరింత ప్రయోజనకరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులనుకొనసాగించాలి... ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను కొనసాగించాలని బొప్పరాజు కోరారు. జూన్ నెలాఖరుకు కాంట్రాక్టు ముగిసి రోడ్డున పడతామన్న ఆందోళన ఎక్కువ మంది ఉద్యోగుల్లో ఉందన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు లేకుండా పనిజరిగే పరిస్థితులు లేవన్నారు. ఇదే విషయాన్ని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి విన్నవించడం జరిగిందన్నారు. ఆయనతో పాటు ఆర్థిక శాఖామంత్రి యనమల రామకృష్ణుడు కూడా సానుకూలంగా స్పందించారన్నారు. జిల్లాస్థాయిల్లో పదోన్నతులు, బదిలీలు, కారుణ్య నియామకాలు చేపట్టాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. విలేకరుల సమావేశంలో ఏపీఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బండి శ్రీనివాసరావు, శరత్‌బాబు, ఏపీఆర్ఎస్ఏ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కేఎల్ నరసింహారావు, ఆర్.వాసుదేవరావు, ప్రభుత్వ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కోయ కోటేశ్వరరావు పాల్గొన్నారు. -
కమల దళంలోకి పురందేశ్వరి
బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సమక్షంలో పార్టీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి బేషరతుగా బీజేపీలోకి వచ్చానని స్పష్టీకరణ విభజన విషయంలో కాంగ్రెస్ తీరు బాధ కలిగించిందని వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్.టి.రామారావు కుమార్తె, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. గత నెలలో తెలంగాణ బిల్లును లోక్‌సభలో ప్రవేశ పెట్టిన అనంతరం ఆమె కాంగ్రెస్ పార్టీకి, కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాధ్ సింగ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఆ తర్వాత శుక్రవారం రాత్రి ఆమె బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎం. వెంకయ్యనాయుడుతో కలిసి ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాను బేషరతుగా బీజేపీలో చేరానని, పార్టీ దిశానిర్దేశం మేరకు ముందుకెళ్తానని ఆమె తెలిపారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ తీరు బాధ కలిగించిందని అన్నారు. సీమాంధ్ర ప్రజలకు న్యాయం చేయడానికి జాతీయ పార్టీ బీజేపీయే సరైనదని భావించినట్టు చెప్పారు. ‘‘రాష్ట్రం సమైక్యంగా ఉండాలని భావించా. కానీ రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. పార్టీ నిర్ణయానికి కట్టుబడి, సీమాంధ్ర అభివృద్ధికి కొన్ని షరతులను జీవోఎం, ఆంటోని కమిటీకి చెప్పాం. వాటిని బిల్లులో సరిగా పెట్టలేదు. ఇది బాధ కలిగించింది. బీజేపీ నేత వెంకయ్యనాయుడు రాజ్యసభలో గట్టిగా పట్టుబట్టిన తర్వాత ప్రధాని సీమాంధ్రకు ప్యాకేజీ ప్రకటించారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన తర్వాత రాజకీయాల నుంచి వైదొలగాలనుకున్నా. మరికొంతకాలం కొనసాగాలని నా భర్త, కుటుంబ సభ్యులు, మిత్రులు, సన్నిహితులు ఒత్తిడి తెచ్చారు. దీంతో జాతీయ పార్టీలో చేరితే మా ప్రాంత ప్రజలకు న్యాయం చేయొచ్చని భావించి బీజేపీలో చేరాను. నా తండ్రితో ఉన్న సంబంధాలు, గత పదేళ్లలో నా పనితీరు నచ్చి బీజేపీ అగ్రనేతలు నన్ను ఆదరించారు’’ అని చెప్పారు. పురందేశ్వరి రామాయపట్నం వద్ద వెయ్యి ఎకరాలు కొన్నారని, అక్కడే పోర్టు పెట్టాలని డిమాండ్ చేశారని, అది రాకపోవడంతో పార్టీని వీడారని కేంద్ర మంత్రి జైరాం రమేష్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా.. ‘‘అది వారి అవగాహన రాహిత్యం. ఆయన ఏం మాట్లాడారో వినకుండా నేను సమాధానం చెప్పడం సరికాదు. సీమాంధ్రకు ఏదైతే కావాలని చెప్పానో అది రానందుకు బాధకలిగింది’’ అని బదులిచ్చారు. ప్రజాదరణ ఉన్నవారికి ప్రోత్సాహం: వెంకయ్య మంచి వ్యక్తిత్వం, ప్రజాదరణ ఉన్నవారిని బీజేపీ ప్రోత్సహిస్తుందని వెంకయ్యనాయుడు చెప్పారు. మోడీ నాయకత్వాన్ని బలపర్చి, బీజేపీని సమర్థించే వారికి స్వాగతం పలుకుతామన్నారు. పురందేశ్వరి చేరికతో పార్టీకి, ప్రజలకు ప్రయోజనం ఉంటుందని అన్నారు. మంత్రి పదవుల్లో ఉన్నవారు, ప్రముఖులు మరికొందరు బీజేపీలో చేరడానికి సుముఖత తెలుపుతున్నారని, వారి పేర్లు ఇప్పుడే చెప్పనని అన్నారు. విభజన హామీలను బీజేపీ, మోడీయే అమలు చేస్తారని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. ప్యాకేజీ ఇవ్వాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్‌కు ముందే ఉంటే రాజ్యసభలో వెంకయ్యనాయుడుకు మాట్లాడే అవకాశం వచ్చేదికాదన్నారు. రాజ్యసభలో ఇచ్చిన హామీలు, బిల్లులో పొందుపర్చిన అంశాలన్నీ తమ ఒత్తిడి వల్లే సాధ్యమయ్యాయని, అవి ఎవరు అమలు చేయగలరో ప్రజలు ఆలోచించాలని అన్నారు. అగ్రనేతలను కలసిన పురందేశ్వరి బీజేపీలో చేరక ముందు పురందేశ్వరి ఆ పార్టీ అగ్రనేతలు ఎల్కే అద్వానీ, రాజ్‌నాథ్, సుష్మాలను కలిశారు. తొలుత అద్వానీ నివాసంలో రాజ్‌నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్, వెంకయ్యనాయుడు సమావేశమయ్యారు. పార్టీలో పురందేశ్వరి చేరిక, లోక్‌సభ స్థానం కేటాయింపుపై చర్చించారు. అనంతరం రాజ్‌నాథ్ వెళ్లిపోయిన కొద్దిసేపటికి అద్వానీ నివాసానికి పురందేశ్వరి వెళ్లారు. అక్కడ వెంకయ్య సమక్షంలో అద్వానీ, సుష్మాల ఆశీర్వాదం తీసుకున్నారు. వారిద్దరూ ఆమెను పార్టీలోకి స్వాగతించారు. అనంతరం పురందేశ్వరి అశోకా రోడ్‌లోని రాజ్‌నాథ్ నివాసానికి వెళ్లి ఆయనతో చర్చించారు. రాజ్‌నాథ్ సమక్షంలో పార్టీలో చేరారు. హైదరాబాద్ వెళ్లి రాష్ట్ర పార్టీ నాయకత్వం సమక్షంలో సభ్యత్వం తీసుకోవాలని రాజ్‌నాథ్ సూచించారు. ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న విశాఖపట్నం నుంచి లేదా విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని పురందేశ్వరి ప్రతిపాదిస్తున్నట్టు తెలిసింది. ‘రాజకీయాలకు గుడ్‌బై’ కారంచేడు, న్యూస్‌లైన్: పర్చూరు ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. పర్చూరు నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలతో శుక్రవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2009 ఎన్నికల్లోనే రాజకీయాల నుంచి వైదొలగాలనుకున్నా పురందేశ్వరి నేను లేకపోతే తానూ ఉండనని చెప్పడంతో పోటీ చేశానన్నారు. అందరి సహకారంతో మళ్లీ గెలవగలిగానని, అవకాశం, అదృష్టంతోనే ఇంతవరకు రాజకీయ జీవితం కొనసాగించానని చెప్పారు. తాను తప్పుకుంటే ఇంకొకరికి అవకాశం కల్పించవచ్చనే వైదొలగుతున్నట్లు దగ్గుబాటి పేర్కొన్నారు. -
'అన్నలిద్దరూ స్వర్గంలో కలుసుకున్నారు'
హైదరాబాద్ : కళామతల్లికి ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావులు.... ముద్దుబిడ్డలని నటుడు బాబు మోహన్ అన్నారు. వారిద్దర్నీ చూసి కళామతల్లి గర్వించిందన్నారు. వారిద్దరూ ఇప్పుడు స్వర్గంలో కలుసుకున్నారని బాబూ మోహన్ వ్యాఖ్యానించారు. అక్కినేని తనను...పేరు పెట్టి పిలిచింది మహా అయితే రెండు... మూడుసార్లు అని ఎప్పుడూ 'అండగాడా...వచ్చావా' అని పిలిచేవారన్నారు. ఆయనతో అలా పిలిపించుకునే భాగ్యం కలిగిందని బాబూ మోహన్ అన్నారు. తండ్రి లాంటి తండ్రిని కోల్పోయానని ఆయన పేర్కొన్నారు. ఆ కుటుంబానికి ఈ విషాదాన్ని ఎదుర్కొనే మనోధైర్యం ప్రసాదించాలని దేవుడిని కోరుకుంటున్నట్లు బాబు మోహన్ అన్నారు. అక్కినేని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. -
అల్లుడా మజాకా..!