
ఎన్టీఆర్‌కు సీఎం చంద్రబాబు నివాళి
టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం దివంగత ఎన్.టి. రామారావుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో సోమవారం ఉదయం 7.58 గంటలకు స్థానిక ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించారు. ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన అనంతరం సీఎం అసెంబ్లీకి వెళ్లారు. చంద్రబాబు వెంట మంత్రులు డా. నారాయణ, పరిటాల సునీత, పీతల సుజాత, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, పలువురు పార్టీ నేతలు ఉన్నారు.
- సాక్షి, హైదరాబాద్