‘రద్దు’తో రైతుకు కొత్త చిక్కులు | New problems to farmers ban of pass books | Sakshi
Sakshi News home page

‘రద్దు’తో రైతుకు కొత్త చిక్కులు

Published Tue, Aug 4 2015 12:54 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

‘రద్దు’తో రైతుకు కొత్త చిక్కులు - Sakshi

‘రద్దు’తో రైతుకు కొత్త చిక్కులు

కంటిలో నలక పడిందని కన్ను తీసేస్తామన్నట్టు పాస్ పుస్తకాల రద్దుతో లంచగొండి తనం మటుమాయం కాదుగానీ రైతుల కష్టాలకు అంతుండదు. ఇక, 1బి రికార్డు ద్వారానే బ్యాంకు అప్పులు తదితర లావాదేవీలు జరిపిస్తామనడం వెర్రితనం.
 
 రైతుల పట్టాదారు పాస్ పుస్త కాలను త్వరలోనే రద్దు చేస్తా మంటూ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ప్రకటన రాష్ట్ర రైతాంగాన్ని తీవ్ర ఆందో ళనకు గురిచేస్తోంది. గతంలో రైతులు ఎదుర్కొనవలసి వస్తుండిన అనేక సమస్యలకు విరుగుడుగానే నాటి ముఖ్య మంత్రి యన్.టి.రామారావు పట్టాదారు పాస్ పుస్తకా లను ప్రవేశపెట్టారు. దీంతో అంతవరకు బ్యాంకులు, గ్రామీణ సహకార పరపతి సంఘాల రుణాల విషయం లో రైతాంగం ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులు తొల గిపోయాయి. అంతేకాదు రైతాంగానికి నేడు అవి అత్యా వశ్యకమైనవిగా మారాయి కూడా. వాటిని రద్దు చేస్తా మంటూ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం రైతులను ఒక్కసారిగా అయోమయ పరిస్థితులలో పడ వేసింది. ప్రభుత్వం అంటున్నట్టుగా పాస్‌బుక్కులు రద్ద య్యేసరికే  ‘1బి’లో (భూమి హక్కును తెలిపే రికా ర్డు)ఆన్‌లైన్లో భూయజమానులుగా తమ పేర్లు నమోదు అవుతాయనే భరోసా లే దు. కాబట్టి పాసు పుస్తకాల రద్దు తర్వాత తమ పరిస్థితి ఏమిటో తెలియని ఆందోళనలో రైతాంగం ఉంది.  
 
 పెద్ద సంఖ్యలో రైతులు ఇప్పటికీ పాసు పుస్తకాల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరు గుతూనే ఉన్నారు. పాస్ బుక్ కోసం రూ.4 లక్షల లంచం అడగడంతో కడప జిల్లాలో ఒక రైతు ఆత్మహత్య చేసుకో వాల్సివచ్చింది! ప్రభుత్వం రద్దు చేస్తామంటున్న పాస్ పుస్తకానికి రైతాంగంలో ఎంత విలువందో ఇది తెలియ జేయడం లేదా? పాసు పుస్తకాల జారీలోని అవినీతిని, వాటి దుర్వినియోగాన్ని అరికట్టాలంటే రెవెన్యూ వ్యవస్థ లోని లోపాలను సరిదిద్దాలి. పాసుపుస్తకాల రద్దు ఎలా ఆ పని చేయగలదో ఎవరికీ అర్థంకానిది. ఇక ప్రభుత్వం సూచిస్తున్న ప్రత్యామ్నాయం పూర్తి అయోమయం. ఏ రిజిష్టరులో గ్రామ కంఠాలుగా నమోదైన భూములను ఇప్పుడనుభవిస్తున్న రైతులకిస్తారా లేక ప్రభుత్వ భూమి కింద నమోదు చేస్తారా? సమాధానం లేదు. ‘1బి’ రికా ర్డుల్లో 50 శాతం కూడా అసలు రైతుల పేర్లు నమోదు కాలేదు. దస్తావేజులన్నీ ఉన్నా విలువైన భూములను 1బిలో చేర్చాలంటే రైతులు ఎంతో కొంత చేయి తడపా ల్సిందే.
 
 1బి రికార్డు సరిచేయడం మంచిదే. కానీ అదేమీ ఒకటి, రెండు వారాల్లో అయ్యేది కాదు. 1బి లో అసలు రైతుల పేర్లను నమోదు చెయ్యాలంటే... చాలా సంద ర్భాల్లో పూరా నంబరులోని మొత్తం భూమికంటే ఎక్కు వ భూమి ఇప్పటికే నమోదయి ఉంటోంది. ఆ పూరా నంబర్లలో నమోదై ఉన్న రైతుల దస్తావేజులను తనిఖీ చేయాలి. కొన్ని సందర్భాలలో తిరిగి సర్వే చేయిస్తే తప్ప పూర్తి రికార్డుగా పరిగణించలేం. దీనికి చాలా సమయమే పడుతుంది. సర్వేయర్లూ పెద్ద సంఖ్యలో కావాలి. లేక పోతే 1బి తప్పుల తడకగా ఉండటం ఖాయం. ఇప్పటికే ప్రభుత్వ అవసరాల కోసం తీసుకున్న భూమిని సబ్ డివి జన్ చేయలేదు. అది కూడా మొత్తం సర్వే నంబర్లలో, అసైన్డ్ భూమి కింద సబ్ రిజిస్ట్రార్ రికార్డులలో నమోదై ఉంది. ఆ సర్వే నంబరులో మిగిలి ఉన్న రైతుల భూమిని అమ్మాలంటే రెవెన్యూ వారు అడంగల్ సబ్ డివిజన్ చేసి, వాటి 1బిలలో మార్పులు చేసి, సబ్ రిజిస్ట్రార్ ద్వా రా, జిల్లా రిజిస్ట్రార్‌కి పంపాలి.
 
 ఆ తర్వాత ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారి నుంచి ఆదేశాలు వస్తే తప్ప రిజిస్ట్రేషన్ కాదు. ఒక సామాన్య రైతు ఇంత పని చేయడం చాలా కష్టం. రెవెన్యూ వ్యవస్థలో మార్పులు చేయాల్సిన అవసరం ఉండటం వల్ల రికార్డు సరిచేయ కుండా మార్పు చేస్తే రైతులకు తమ భూమి, ఏఏ నంబ ర్లలో ఉందో అర్థం కాని పరిస్థితి ఎదురవుతుంది. కం టిలో నలక పడిందని కన్ను తీసేస్తామన్నట్టు పాస్ పుస్త కాలను రద్దు చేసేస్తే... లంచగొండితనం మటుమాయం కాదుగానీ రైతుల కష్టాలకు అంతుండదు. ఇక, 1బి రికార్డు ద్వారానే బ్యాంకు అప్పులు తదితర లావా దేవీలు జరిపిస్తామనడం వెర్రితనం. 1బి రికార్డు సరి చేయవలసింది రెవెన్యూ అధికారులు కారా? కంప్యూట ర్‌లో 1బి రికార్డు నమోదుకు వారు లంచం తీసుకోరా? మరి పాస్ పుస్తకాల రద్దుతో ప్రయోజనం ఏమిటి? రాష్ట్రంలో ప్రభుత్వం పని చేయడం లేదు, అంతా అధి కారుల పాలనే. కాబట్టి పాస్ పుస్తకాల జారీని   క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఆ క్రమంలో సమూల మార్పులు తెచ్చి పాస్ పుస్తకాల జారీని సులభతరం చేయాలి.
 
 మరో ముఖ్యమైన అంశం కాలువల ఆధునికీకరణ. డా॥వై.ఎస్. రాజశేఖరరెడ్డి గారు పురాతన డెల్టా వ్యవ స్థను పూర్తి స్థాయిలో ఆధునికీకరణం చేయడానికి నడుం బిగించారు. కాగా, ప్రస్తుత ప్రభుత్వం డెల్టా ఆధునికీ కరణనే రద్దు చేసింది. ఇక రుణమాఫీ అంటూ ఆర్భాటం చేసి, రైతు వ్యవస్థనే రద్దు చేయబోతోంది.

సహకార సం ఘాల ద్వారా దీర్ఘకాలిక అప్పులకు వడ్డీ రాయితీ జీఓ ఇవ్వక దాన్నీ రద్దు చేసింది. ఇక వ్యవసాయ యాంత్రీక రణ పేరిట కొందరు టీడీపీ కార్యకర్తలు సబ్సిడీ యంత్రా లను రైతులకు అమ్మి సొమ్ము చేసుకొంటున్నారు. ఇదిలా ఉండగా, రైతులకు విత్తనాలను సరఫరా చేయలేక, వారిని నేరుగా ప్రైవేట్ మార్కెట్‌లో కొనుక్కోమనే నిస్స హాయ స్థితిలో ప్రభుత్వం ఉంది. రైతులకు లాభసాటి యైన కనీస మద్దతు ధరను ఇవ్వకపోగా, ఎరువుల సబ్సి డీని మధ్య దళారుల చేతికి అందించి రైతుని దగా చేస్తోం ది, వ్యవసాయరంగాన్ని నష్టపరుస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం తన తప్పుడు విధానాలు విడనాడి రైతుకింత మేలు చేసే దిశకు మరలాలని కోరుతున్నాం.
 (వ్యాసకర్త రాష్ట్ర నీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి) మొబైల్: 9440204323
 - కొవ్వూరి త్రినాథరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement