రాంగోపాల్ వర్మ తాజాగా తెరకెక్కించబోతున్న సినిమా 'లక్ష్మీస్ ఎన్టీఆర్'.. దివంగత నేత ఎన్టీ రామారావు జీవితకథ ఆధారంగా ఈ సినిమాను తీయనున్నట్టు వర్మ ప్రకటించిన నాటినుంచి.. ఈ ప్రాజెక్టు చుట్టూ అనేక వివాదాలు ముసురుకుంటున్నాయి. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు ఈ సినిమా విషయంలో వర్మపై విరుచుకుపడ్డారు. వారి విమర్శలకు, ఆరోపణలకు వర్మ ఫేస్‌బుక్ వేదికగా దీటుగానే సమాధానం ఇస్తున్నారు.
ఎన్టీఆర్ జీవితంలోని ప్రజలకు పెద్దగా తెలియని చీకటికోణాలను ఈ సినిమాలో ఆవిష్కరిస్తానంటూ వర్మ చెప్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో ఇప్పటికే అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో తాజాగా వర్మ పెట్టిన ఓ పోస్టు అందరి దృష్టి ఆకట్టుకుంటోంది.
ఎన్టీఆర్ తనకు షేక్‌హ్యాండ్ ఇస్తున్న ఫొటోను వర్మ తాజాగా ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. ఈ ఫొటోలో వెనుక ఎన్టీఆర్-శివపార్వతి దండలు మార్చుకుంటుండగా.. వారి వెనుక చంద్రబాబు నిల్చున్న ఫొటో ఉది. ఈ ఫొటోకు వర్మ ఆసక్తికరమైన కామెంట్ పెట్టారు. ఎన్టీఆర్‌పై సినిమా తీస్తున్నందుకు ఆయన తనను అభినందిస్తున్నారంటూ పేర్కొన్నారు. మొత్తానికి ఈ పోస్టుకు 11వేలకుపైగా రియాక్షన్‌లు రావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment