
అక్కినేని ఇంట మరోసారి పెళ్లి బాజాలు మోగనున్నాయి.

నాగార్జున తనయుడు, హీరో నాగచైతన్య 2024 డిసెంబర్‌లో శోభిత ధూళిపాళను పెళ్లి చేసుకున్నాడు.

ఇప్పుడు మరో కుమారుడు అఖిల్ కూడా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నాడు.

గతేడాది నవంబర్‌లో అఖిల్- జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం జరిగింది.

మార్చి 24న వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే పెళ్లి పనులు కూడా మొదలయ్యాయని టాక్!






