కాబోయే భార్యతో స్పెషల్ ఈవెంట్‌కు నాగచైతన్య.. ఫోటోలు వైరల్! | Akkineni Naga Chaitanya and Sobhita Dhulipalla Papped at IFFI Event | Sakshi

Naga Chaitanya and Sobhita: ఈవెంట్‌లో జంటగా నాగచైతన్య- శోభిత.. ఫోటోలు వైరల్!

Published Thu, Nov 21 2024 4:10 PM | Last Updated on Thu, Nov 21 2024 4:31 PM

Akkineni Naga Chaitanya and Sobhita Dhulipalla Papped at IFFI Event

అక్కినేని హీరో నాగచైతన్య త్వరలోనే వివాహాబంధంలోకి అడుగుపెట్టనున్నారు. హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల మెడలో మూడుముళ్లు వేయనున్నారు. ఇటీవలే శోభిత తరఫు వారి పెళ్లి కార్డు కూడా రెడీ అయిపోయింది. ఇప్పటికే రెండు ఫ్యామిలీస్ పెళ్లి పనులతో బిజీగా ఉన్నారు. డిసెంబర్‌ 4న వీరి పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరగనుంది. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు కూడా మొదలైనట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.

అయితే శోభిత, నాగచైతన్య తాజాగా ఓ ఈవెంట్‌లో సందడి చేశారు. గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్‌ఎఫ్‌ఐ -2024) వేడుకల్లో కలిసి పాల్గొన్నారు. వీరితో పాటు అక్కినేని నాగార్జున, అమల, హీరో సుశాంత్‌తో పాటు కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలను ప్రసారం చేయనున్నారు. ఇది వీక్షించేందుకు నాగార్జున సతీసమేతంగా వెళ్లారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా.. ఈ ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్ నవంబర్ 28 వరకు జరగనుంది.

akkineni
 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
 
Advertisement