![Akkineni Nagarjuna Comments In Thandel Movie Success Meet](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/Nagarjuna1.jpg.webp?itok=elj_2CnX)
అక్కినేని హీరో నాగచైతన్య ఇటీవలే తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా సినిమా ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ మూవీలో చైతూ సరసన నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్‌గా నటించింది. తొలి రోజే ఈ మూవీ పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. దీంతో మూవీ టీమ్ విజయోత్సవ వేడుకల్లో మునిగిపోయారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో తండేల్ మూవీ సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. తండేల్ మూవీ సక్సెస్ ఈవెంట్‌కు అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తండేల్ సినిమా గురించి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
నాగార్జున మాట్లాడుతూ.. ' తండేల్ సినిమా విడుదలైనరోజు ఢిల్లీలో ప్రధాని మోదీ గారి దగ్గర ఉన్నాం. నా ఫోన్ కూడా నా దగ్గర లేదు.. ఫోన్ తీసుకున్నాక ఫోన్స్, మెసేజులతో నిండిపోయింది. అరవింద్ కథ విన్న వేళా విశేషం.. చందు మొండేటితో తీద్దామన్న వేళా విశేషం.. డీఎస్పీతో చేద్దామన్న వేళ.. మీరందరూ వచ్చి నాగచైతన్య అడిగిన వేళ.. శోభితను నాగచైతన్య పెళ్లి చేసుకున్న వేళా విశేషం ఇలా అన్నీ బాగున్నాయి. తండేల్ సక్సెస్ చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. సక్సెస్ మీట్‌కు వచ్చి చాలా రోజులవుతోంది. చైతుని చూస్తే నాన్న గారు గుర్తొచ్చారు. 2025లో మళ్లీ వస్తున్నాం. గట్టిగా కొడుతున్నాం. అయితే దయచేసి కొంచెం కొడుకు, కోడలు ముందు నా రొమాంటిక్ వీడియోలను చూపించవద్దని' నవ్వుతూ మాట్లాడారు. ప్రస్తుతం నాగార్జున చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కొడుకు, కోడలు ముందు నా రొమాంటిక్ వీడియోలను చూపించవద్దు 😂 - #Nagarjuna #NagaChaitanya #SobhitaDhulipala #Thandel #TeluguFilmNagar pic.twitter.com/XyLy2bXmO3
— Telugu FilmNagar (@telugufilmnagar) February 11, 2025
Comments
Please login to add a commentAdd a comment