పెళ్లి తర్వాత మొదటిసారి జంటగా గుడికి వెళ్లిన నాగచైతన్య-శోభిత | Naga Chaitanya And Shobhitha Visit Srisailam Temple | Sakshi
Sakshi News home page

పెళ్లి తర్వాత మొదటిసారి జంటగా గుడికి వెళ్లిన నాగచైతన్య-శోభిత

Dec 6 2024 1:54 PM | Updated on Dec 6 2024 6:01 PM

Naga Chaitanya And Shobhitha Visit Srisailam Temple

అక్కినేని నాగ చైతన్య ,శోభిత ధూళిపాళ  మూడు ముళ్లతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అయితే, ఈ నూతన దంపతులు కొత్త జీవితాన్ని ఆనందంగా ప్రారంభించాలని అక్కినేని అభిమానులు, ఆత్మీయులు ఆశీర్వదించారు. పెళ్లి అయిన వెంటనే వారిద్దరూ మొదటగా శ్రీశైలం మల్లన్నను దర్శించుకుని ఆశీర్వాదం తీసుకున్నారు.

నూతన వధూవరులతో పాటు అక్కినేని నాగార్జున కూడా ఉన్నారు. ఇరువురి  కుటుంబ సభ్యులు అందరూ స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న తర్వాత స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు. కొత్త దంపతులకు అర్చకులు వేదాశీర్వచనంతో పాటు ఆలయ మహాద్వారం వద్ద వారికి  అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం ప్రసాదాలు వారికి అందించారు. పెళ్లి తర్వాత మొదటిసారి జంటగా చై-శోభిత కనిపించడంతో అభిమానులు భారీగా గుమికూడారు.

మల్లన్న సన్నిధిలో కొత్త జంట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement