Srisaila Devasthanam
-
పరమ శివుని భక్తిని చాటి చెప్పే చిత్రాలు.. ఎంచక్కా ఓటీటీల్లో చూసేయండి!
రెండు తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి సందడి మొదలైంది. శివనామస్మరణతో శ్రీశైల గిరులు మార్మోగిపోతున్నాయి. మార్చి 8న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు రాత్రంతా జాగరణ, ఉపవాసం చేయడం ఆనవాయితీ. అలా ఆ పరమశివుడిని, పార్వతిదేవిని స్మరించుకుంటూ భక్తితో పొంగిపోతుంటారు. ఇప్పటికే ఆ పరమ శివుని మహిమలపై వచ్చిన చాలా చిత్రాలు వచ్చాయి. శివరాత్రి సందర్భంగా శివున్ని తరించుకుంటూ సినిమాలు చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వివరాలు మీ కోసమే. శివుని భక్తిని చాటి చెప్పే సినిమాల జాబితాను మీకోసం తీసుకొస్తున్నాం. ముఖ్యంగా ఓటీటీల యుగంలో ఏయే సినిమా ఏక్కడ స్ట్రీమింగ్ అవుతుందో మీరే చూసేయండి. అలాగే శివరాత్రికి కచ్చితంగా చూడాల్సిన సినిమాల జాబితా ఇదుగో మీ కోసమే. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మహాభక్త సిరియాళ భక్త శంకర అమెజాన్ ప్రైమ్ భక్త కన్నప్ప ఎరోస్ నౌ శ్రీ మంజునాథ శివకన్య జీ5 మహాశివరాత్రి జియో సినిమా శివరాత్రి మహత్యం యూట్యూబ్ భక్త సిరియాళ భక్త మార్కండేయ శ్రీ మంజునాథ ఉమాచండీ గౌరీశంకరుల కథ కాళహస్తి మహత్యం శివలీలలు మహాశివరాత్రి దక్షయజ్ఞం జగద్గురు ఆదిశంకర మావూళ్లో మహాశివుడు శివకన్య శివరాత్రి మహత్యం వీటిలో భక్త కన్నప్ప, శ్రీ మంజునాథ భక్త మార్కండేయ, మహాభక్త సిరియాళ మరింత విశేషం కానుంది. మహాభక్త సిరియాళ చిత్రంలో తారకరత్న, అర్చన జంటగా నటించారు. వీటితోపాటు చిరంజీవి, నాగార్జున, మోహన్ బాబు, శ్రీహారి నటించిన జగద్గురు ఆదిశంకర చూడాల్సిన సినిమా. ఇవే కాకుండా శివరాత్రి మహత్యం, భూకైలాస్, అంజి, కార్తికేయ వంటి మరెన్నో చిత్రాలు ఉన్నాయి. వీటిలో మీకు నచ్చినవాటిని సెలక్ట్ చేసుకుని వాటిని చూస్తూ జాగారం చేసేయండి.. -
శ్రీశైలం చరిత్ర మీకు తెలుసా? మీకు తెలియని నిజాలు
-
శ్రీశైలం వస్తున్నారా.? మా సత్రం ఆతిథ్యం స్వీకరించండి
శ్రీశైలం: మల్లన్న సన్నిధి శ్రీశైలంలో సత్రాలు విస్తరిస్తున్నాయి. ఏడు దశాబ్దాల క్రితం రెండు సత్రాలతో మొదలై నేడు వంద ఎకరాల విస్తీర్ణంలో వందకుపైగా వెలిశాయి. వీటిలో కొన్ని సకల సౌకర్యాలు కలిగి భక్తులకు అవసరమైన సేవలు అందిస్తున్నాయి. మరికొన్ని అన్నపూర్ణ నిలయాలుగా వర్ధిల్లుతున్నాయి. కులానికో సత్రం.. తొలుత 1955కు పూర్వం ఆర్యవైశ్యులు శ్రీశైలానికి వచ్చే భక్తుల కోసం శ్రీ వాసవీ అఖిలభారత ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం, శ్రీ వీరశైవ లింగాయితీసత్రం ఏర్పడ్డాయి. ఆ కాలంలో రోడ్డుమార్గం లేకపోవడంతో అటవీమార్గం ద్వారా శివరాత్రి, ఉగాది పర్వదినాలకు భక్తులు శ్రీశైలం చేరుకునేవారు. 1957లో రోడ్డుమార్గం ఏర్పడిన తర్వాత అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ నీలం సంజీవరెడ్డి శ్రీశైలం వచ్చి మల్లన్నను దర్శించుకున్నారు. ఆ సమయంలో వాసవీసత్రాన్ని నిర్వహిస్తున్న మూర్తి వెంకటేశ్వర్లు, లింగాయితీ సత్రం ఫౌండర్ ప్రెసిడెంట్, అప్పటి కర్నూలు జిల్లా కలెక్టర్ బోగిశెట్టి జోగప్ప సత్ర నిర్మాణాలకు ముఖ్యమంత్రితో శంకుస్థాపన చేయించారు. ఈ రెండు కుల సత్రాలతో పాటు అప్పటికే శ్రీశైల జగద్గురు వాగీశ పండితారాధ్య పీఠంకు సంబంధించిన స్థలం ఆలయ ప్రాంగణంలో ఉండేది. ప్రస్తుతం వీరశైవ లింగాయితులకు సంబంధించిన మూడు సత్రాలు, ఆర్యవైశ్యులకు చెందిన సత్రాలు మూడు ఉన్నాయి. అనంతరం కాలంలో కరివేన బ్రాహ్మణ సత్రం, రెడ్డి, కమ్మ, కాపు, గౌడ, క్షత్రియ, వెలమ, యాదవ, నాయీబ్రాహ్మణ, రజక, కరికాల, గాండ్ల, పద్మశాలి, విశ్వబ్రాహ్మణ, వీరశైవ శరణ బసవేశ్వర, దేవాంగ, కుమ్మరి, వాల్మీకి (బోయ), ఉప్పర, ముదిరాజ్, తదితర ఎన్నో కులాల సత్రాలు శ్రీశైలంలో ఏర్పడ్డాయి. ప్రముఖ సత్రాలకు కోట్లకొద్ది డిపాజిట్లు ఉన్నాయి. వీటి ద్వారా నిర్వహణ కొనసాగిస్తున్నారు. పలు సత్రాల్లో 100కు పైగా గదులు, సూట్లు, ప్రత్యేక కాటేజీలు సైతం ఉన్నాయి. కాగా శ్రీశైల దేవస్థానం ఆయా సత్రాలకు కనిష్టంగా 50 సెంట్లు, గరిష్టంగా 4 నుంచి 5 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం ద్వారా కేటాయించింది. దాతల సహకారంతో.... ఏ సత్రమైనా అభివృద్ధి చెందాలంటే దాతల సహకారం ఎంతో అవసరం. దేవస్థానం కూడా గదుల నిర్మాణం, అన్నదానం తదితర వాటికి దాతల సహకారం తీసుకుంటుంది. అయితే, లక్షల్లో విరాళాలు ఇచ్చిన దాతలకు వసతి, దర్శన సౌకర్యాల విషయంలో వెసులుబాటు కల్పిస్తుంది. అదే సత్రాల నిర్వాహకులు రూ. 2 లక్షలు ఆపై విరాళం ఇచ్చిన దాతల పేరుపై గది కేటాయింపు చేస్తారు. ఏడాదిలో 30 నుంచి 60 రోజుల పాటు సదరు దాత ఉచితంగా వసతి కల్పిస్తారు. అన్నదానంలో పాలు పంచుకోవాలంటే రూ.216, రూ.516 కనిష్టంగా చెల్లించాలి. దాతల గోత్రనామాలతో అన్నదానం చేస్తారు. శాశ్వత పద్ధతిపై ఏడాదిలో ఒక్కరోజు అన్నదానానికి రూ. 1,116 నుంచి ఆపై విరాళాలు ఇవ్వవచ్చు. -
భూలోక కైలాసంగా ప్రసిద్ధి చెందిన శ్రీశైలం
-
పరమ పవిత్రం మల్లన్న దివ్య పరిమళ ‘విభూది’
సాక్షి, శ్రీశైలం: విభూది సంపదను ప్రసాదిస్తుంది. పవిత్రతను కలిగిస్తుంది. పాపాలను భస్మం చేస్తుంది. అరిష్టాలన్నింటిని తొలగిస్తుంది. సమస్త శుభాలను కలిగిస్తుంది. సర్వసంపదలను చేకూరుస్తుంది. తేజస్సును కలిగిస్తుంది. మోక్షాన్ని అనుగ్రహిస్తుంది. అటువంటి సద్గుణాలను ప్రసాదించే విభూదిని ధరించడం శుభప్రదమని పురాణాలు పెర్కొంటున్నాయి. అంతటి సుగుణాలను, పవిత్రతను కలిగిన విభూదిని శ్రీశైల దేవస్థానం తయారు చేస్తుంది. విభూది విక్రయాల ద్వారా దేవస్థానానికి ఏటా రూ.లక్షల్లో ఆదాయం సమకూరుతుంది. చదవండి: (రాకెట్ ఇంధనం తణుకు నుంచే...) శ్రీశైల మల్లన్న దర్శనార్థం వచ్చే భక్తులు స్వామి విభూదిని పరమ పవిత్రంగా భావిస్తారు. దేవస్థానం కూడా గోమయంతో స్థానిక గోశాలలో నిష్టగా తయారు చేయించి విక్రయిస్తుంది. విభూది విక్రయాల ద్వారా దేవస్థానానికి ఏటా రూ.లక్షల్లో ఆదాయం వస్తుంది. విభూది భక్తితో పాటు క్షేత్రానికి ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటిగా మారింది. క్షేత్రానికి వచ్చే భక్తులకు దేవస్థానం స్వచ్చమైన గోమయంతో తయారు చేసిన దివ్యపరిమళ విభూదిని అందుబాటులో ఉంచింది. దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలలో విభూదిని తయారు చేస్తుంది. తయారీలో శాస్త్రోక్తంగా, ప్రమాణాలు పాటిస్తున్నారు. విభూది తయారీ ఇలా.. దేవస్థానం గోశాల నుంచి లభించే గోమయం(ఆవుపేడ)ను పిడకలుగా చేసి ఎండలో ఆరబెడతారు. ఎండిన వాటిని కాల్చి తద్వారా వచ్చిన బూడిద(భస్మం)ను వడపోసి ప్రత్యేక యంత్రంలో వేస్తారు. వచ్చిన మిశ్రమాన్ని కేకులాగా తయారు చేసి మళ్లీ కాల్చుతారు. తద్వారా వచ్చే భస్మాన్ని విడతల వారీగా వడపోసి చివరికి విభూదిని తయారు చేస్తారు. అలాగే ప్రతిరోజు ఆలయ ప్రాంగణంలో రుద్రయాగం, చండీయాగంలోని భస్మాన్ని కూడా విభూది తయారులో వినియోగిస్తుండడంతో పవిత్రత చేకూరుతుంది. విభూది తయారు చేయడానికి 17మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. చదవండి: (వరుస సర్వీసులతో దూసుకుపోతున్న విశాఖ ఎయిర్పోర్ట్) ఆదాయ వనరు.. దివ్య పరిమళ విభూదిని ప్యాకెట్లు, డబ్బాల్లో దేవస్థానం విక్రయిస్తుంది. 10గ్రాముల విభూది డబ్బా రూ.10, 50గ్రాముల విభూది డబ్బా రూ.20, 75గ్రాముల విభూది డబ్బా రూ.30, 100గ్రాముల విభూది డబ్బా రూ.40, 50గ్రాముల విభూది ఉండా రూ.10, విభూది ప్యాకెట్లను రూ.10గా విక్రయిస్తున్నారు. కిలో విభూది ధర రూ.300గా నిర్ణయించారు. దీంతో ఆలయానికి విభూది విక్రయాల ద్వారా ఏటా రూ.లక్షల్లో ఆదాయం లభిస్తుంది. -
‘తెలుగు రాష్ట్రాల్లో పర్యటన.. ఎంతో ఆనందాన్నిచ్చింది’
శ్రీశైలం టెంపుల్: వారం రోజులుగా తెలుగు గాలిని పీలుస్తూ.. తెలుగు నేలపై తిరుగుతుండడం తనకెంతో ఆనందాన్నిచ్చిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. శ్రీశైలంలోని శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను శుక్రవారం ఉదయం ఆయన దర్శించుకున్నారు. శ్రీశైలంలోని అతిథి గృహం వద్దకు చేరుకున్న ఆయనకు దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, జిల్లా కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ ఫక్కీరప్ప తదితరులు పుష్పగుచ్ఛాలు అందించి ఘనస్వాగతం పలికారు. అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మల్లన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అత్యంత స్వల్ప వ్యవధిలో రాష్ట్ర ప్రభుత్వానికి తన కార్యక్రమం చెప్పినప్పటికీ అన్ని ఏర్పాట్లు భేషుగ్గా చేశారని ప్రశంసించారు. రాష్ట్ర మంత్రి, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యే, ఇతర అధికారులు స్వయంగా వచ్చి స్వాగతం పలికారని.. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి ఏటా రెండు మూడుసార్లు ఇక్కడకు వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకునే వాడినని తెలిపారు. కర్నూలు జిల్లాతో తనకు ఎంతో అవినాభావ సంబంధం ఉందని, వృత్తిరీత్యా ఈ ప్రాంతానికి చెందిన ఏరాసు అయ్యపరెడ్డి వద్ద 10ఏళ్లపాటు జూనియర్‌గా పనిచేశానని జస్టిస్ ఎన్వీ రమణ గుర్తుచేశారు. శ్రీశైల వైభవం పుస్తకావిష్కరణ స్కంద పురాణంలోని శ్రీశైల ఖండం మూలప్రతిని సంస్కృతం నుంచి తెలుగులో శ్లోక భావార్థాలను రూపొందించడంలో కీలకపాత్రను పోషించిన త్రిష్టి లక్ష్మీసీతారామాంజనేయ శర్మను సీజే జస్టిస్ ఎన్వీ రమణ సత్కరించారు. అలాగే, ఘంటా మఠం జీర్ణోద్ధరణ పనుల్లో లభించిన పురాతన తామ్ర శాసనాల విశేషాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం దేవస్థానం ప్రచురించిన శ్రీశైల వైభవం పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. కాగా, సీజే జస్టిస్ ఎన్వీ రమణ వెంట ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ న్యాయమూర్తి జస్టిస్ డి.వెంకటరమణ, తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ న్యాయమూర్తి జస్టిస్ వెంకటేశ్వరరెడ్డి ఉన్నారు. చదవండి: ‘యాదాద్రి అద్భుతం.. అద్వితీయం’ సీజేఐ ప్రశంసలు -
శ్రీశైలం నిధుల స్వాహా కేసులో మరికొందరి హస్తం
సాక్షి, శ్రీశైలం: దేవస్థానం అభిషేకాది ఆర్జిత సేవా టిక్కెట్లు, దర్శన కౌంటర్లు, డొనేషన్ కౌంటర్, పెట్రోల్‌బంక్‌లో జరిగిన అక్రమాల్లో 20 మంది ప్రమేయం ఉన్నట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే పోలీస్ విచారణలో మరో ఆరుగురి హస్తం కూడా ఉన్నట్లు తేలింది. నిందితుల్లో 16 మంది..నిజాన్ని ఒప్పుకొని, నిధులు ఎలా స్వాహా చేశారో చెప్పారని డీఎస్పీ వెంకట్రావ్‌కు తెలియజేశారు. ముఖ్యంగా దేవస్థానంలో కంప్యూటర్ విభాగంలో పనిచేస్తున్న దార్శెల్లి, రూపేష్.. ప్రధాన పాత్రధారులుగా ఉన్నట్లు తెలిసింది. ఒకరి ఐడీపై మరొకరు టిక్కెట్లను అక్రమ మార్గంలో విక్రయించారు. సాంకేతికతను ఆధారం చేసుకుని ఫేక్ ఐడిని సృష్టించి దాని ద్వారా అక్రమార్జనకు పాల్పడినట్లు విచారణలో తేలింది. ఈ ప్రక్రియ అంతా 2017లో జరిగినట్లుగా పోలీసులు నిర్ధారించారు. దేవస్థానం ఈఓ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న వారే కాకుండా పోలీసులు విచారణలో..హరినాయక్, చంద్ర, మురళీధర్‌రెడ్డి, రామనాయుడు, అనీల్, నరసింహులు హస్తం కూడా ఉన్నట్లు నిర్ధారించారు. వీరిపై కూడా కేసు నమోదు చేస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: చరిత్ర గతిని మార్చే పాలన మొత్తం మీద 23 మంది నిందితులు అక్రమాలను ఒప్పుకోవడంతో.. వీరి వద్ద నుంచి అక్రమార్జిత సొమ్మును సాధ్యమైనంతవరకు రికవరీ చేసేందుకు డీఎస్పీ ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. దేవస్థానం ద్వారా వచ్చిన రెండు కేసులే కాకుండా విడివిడిగా ఎఫ్ఐఆర్లను నమోదు చేసే ప్రక్రియ ప్రారంభమైందని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ప్రస్తుతం ఉన్న కేసులను ఆధారం చేసుకుని దేవస్థానంలోని మరికొన్ని కీలక విభాగాల్లో ఉద్యోగులను దర్యాప్తు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలిసింది. -
సీఎం జగన్‌ను కలిసిన శివాచార్య మహాస్వామి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని శ్రీశైల జగద్గురు డాక్టర్ చన్నా సిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామి కలిశారు. తాడేపల్లిలోని సీఎం వైఎస్ జగన్ నివాసంలో వీరి భేటీ జరిగింది. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌కు శాలువా కప్పి.. పుష్పగుచ్ఛంతో శివాచార్య మహాస్వామి సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాయదుర్గం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కూడా ఉన్నారు. -
ముంచుకొస్తున్న మూఢం
సాక్షి, కర్నూలు : మూఢం ముంచుకొస్తోంది. వివాహాది శుభకార్యాలు జరుపుకునే వారికి మరో ఆరు రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ ముహుర్తాల్లోనే వివాహాలు జరుపుకునేందుకు ఆగమేఘాలపై ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వివాహాది శుభకార్యాలు భారీగా జరుగుతున్నాయి. ఈనెల 27వ తేదీతో ముహూర్తాలు ముగియనున్నాయి. ఆ తరువాత శుక్ర మూఢమి కారణంగా మరో మూడు నెలల పాటు పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు ఇతర శుభకార్యాలకు బ్రేక్ పడనుంది. ఈనెల 23, 25, 26, 27 తేదీల్లో ఉన్న ముహుర్తాల్లో శుభకార్యాలు జరుపుకోలేని వారు ఆశ్వయయుజ మాసమైన అక్టోబరు 2 వరకు వేచి ఉండాల్సిందే. ఆ మూఢమి కాలం ముగిసే వరకు పెళ్లి వారితో పాటు, పురోహితులు, కేటరింగ్, పూలు, మండపాలు డెకరేషన్ చేసే వారు, కల్యాణ మండపాల యజమానులు నిరీక్షించాల్సిందే. మరో మూడు నెలలు శుభకార్యాలకు ముహూర్తాలు లేకపోవడంతో వివాహాలు, గృహ ప్రవేశాలను ఈనెల 27వ తేదీలోగా ముగించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో అంతటా హడావుడి కనిపిస్తోంది. వస్త్ర, బంగారు దుకాణాలు కళకళలాడుతున్నాయి. మండపాల డెకరేషన్, పురోహితులు బిజీబిజీగా కనిపిస్తున్నారు. కల్యాణ మండపాలు దొరకని వారు శ్రీశైలం, మహానంది తదితర పుణ్యక్షేత్రాల్లో వివాహాలకు మండపాలను ముందుగానే బుక్ చేసుకున్నారు. ఈ ఐదు రోజుల తర్వాత శుభకార్యాలకు బ్రేక్ పడనుంది. శ్రావణ మాసంలోనూ శూన్యమే జూలై ఆషాఢం కావడంతో అది శూన్యమాసం. ఆ తరువాత వచ్చే ఆగస్టు (శ్రావణమాసం)లో ఏటా వివాహాది శుభకార్యాలకు మంచి ముహుర్తాలు ఉండేవి. ఈ ఏడాది శ్రావణమాసంలో కూడా మూఢమి వచ్చింది. అలాగే సెప్టెంబర్ (భాద్రపద మాసం) శూన్యమాసమైంది. దీంతో వరుసగా ఈ మూడు నెలలు శుభకార్యాలకు బ్రేక్ పడనుంది. తిరిగి అక్టోబర్ 2 నుంచి శుభ ముహుర్తాలున్నాయి. – శ్రీకాంత్‌స్వామి, అర్చకులు -
శ్రీశైలం మల్లన్న ఆదాయం రూ.2.21కోట్లు
శ్రీశైలం, న్యూస్‌లైన్: శ్రీశైల మహాక్షేత్రంలో ఫిబ్రవరి 20 నుంచి మార్చి 4 వరకు జరిగిన బ్రహ్మోత్సవాలలో భక్తులు సమర్పించిన కానుకలను రెండు రోజుల పాటు లెక్కించగా రూ. 2,21,62,614 లభించినట్లు ఈఓ చంద్రశేఖర అజాద్ గురువారం విలేకరులకు తెలిపారు. అక్కమహాదేవి అలంకార మండపంలో బుధ, గురువారాలలో హుండీల ఆదాయాన్ని లెక్కిం చారు. ఈ లెక్కింపులో నగదుతో పాటు 1,057 యుఎస్ డాలర్లు, 140కువైట్ దినార్లు, 30యుఏ పౌండ్లు, 10 ఆస్ట్రేలియా డాలర్లు, 20 సింగపూర్ డాలర్లు, 10 సౌదీ రియాల్స్, 10 మలేషియా రింగెట్స్ లభించాయన్నారు. -
నేటి నుంచి శివరాత్రి బ్రహ్మోత్సవాలు
శ్రీశైలం, న్యూస్‌లైన్: శ్రీశైల మహాక్షేత్రంలో గురువారం నుంచి మార్చి 2వ తేదీ వరకు 11 రోజుల పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. రోజూ వాహన సేవలు, 27న మహాశివరాత్రి పర్వదినాన లింగోద్భవకాల మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, పాగాలంకరణ, కల్యాణ మహోత్సవం చేస్తారు. 28న రథోత్సవం నిర్వహిస్తామని ఈవో ఆజాద్ తెలిపారు. ఉ. 9 గంటలకు యాగశాల ప్రవేశం, గణ పతి పూజతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. 24న రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీ స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పిస్తారన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఈనెల 23 వరకే స్వామివార్ల స్పర్శ దర్శనాన్ని కల్పించనున్నట్లు తెలిపారు. 24 నుంచి మార్చి 2 వరకు అలంకార దర్శనాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. 20 నుంచి మార్చి 1 వరకు వరకు ఆర్జిత సేవలన్నీ రద్దు చేస్తున్నట్లు ఈవో ప్రకటించారు.