రెండు తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి సందడి మొదలైంది. శివనామస్మరణతో శ్రీశైల గిరులు మార్మోగిపోతున్నాయి. మార్చి 8న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు రాత్రంతా జాగరణ, ఉపవాసం చేయడం ఆనవాయితీ. అలా ఆ పరమశివుడిని, పార్వతిదేవిని స్మరించుకుంటూ భక్తితో పొంగిపోతుంటారు.
ఇప్పటికే ఆ పరమ శివుని మహిమలపై వచ్చిన చాలా చిత్రాలు వచ్చాయి. శివరాత్రి సందర్భంగా శివున్ని తరించుకుంటూ సినిమాలు చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వివరాలు మీ కోసమే. శివుని భక్తిని చాటి చెప్పే సినిమాల జాబితాను మీకోసం తీసుకొస్తున్నాం. ముఖ్యంగా ఓటీటీల యుగంలో ఏయే సినిమా ఏక్కడ స్ట్రీమింగ్ అవుతుందో మీరే చూసేయండి. అలాగే శివరాత్రికి కచ్చితంగా చూడాల్సిన సినిమాల జాబితా ఇదుగో మీ కోసమే.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్
- మహాభక్త సిరియాళ
- భక్త శంకర
అమెజాన్ ప్రైమ్
- భక్త కన్నప్ప
ఎరోస్ నౌ
- శ్రీ మంజునాథ
- శివకన్య
జీ5
- మహాశివరాత్రి
జియో సినిమా
- శివరాత్రి మహత్యం
యూట్యూబ్
- భక్త సిరియాళ
- భక్త మార్కండేయ
- శ్రీ మంజునాథ
- ఉమాచండీ గౌరీశంకరుల కథ
- కాళహస్తి మహత్యం
- శివలీలలు
- మహాశివరాత్రి
- దక్షయజ్ఞం
- జగద్గురు ఆదిశంకర
- మావూళ్లో మహాశివుడు
- శివకన్య
- శివరాత్రి మహత్యం
వీటిలో భక్త కన్నప్ప, శ్రీ మంజునాథ భక్త మార్కండేయ, మహాభక్త సిరియాళ మరింత విశేషం కానుంది. మహాభక్త సిరియాళ చిత్రంలో తారకరత్న, అర్చన జంటగా నటించారు. వీటితోపాటు చిరంజీవి, నాగార్జున, మోహన్ బాబు, శ్రీహారి నటించిన జగద్గురు ఆదిశంకర చూడాల్సిన సినిమా. ఇవే కాకుండా శివరాత్రి మహత్యం, భూకైలాస్, అంజి, కార్తికేయ వంటి మరెన్నో చిత్రాలు ఉన్నాయి. వీటిలో మీకు నచ్చినవాటిని సెలక్ట్ చేసుకుని వాటిని చూస్తూ జాగారం చేసేయండి..
Comments
Please login to add a commentAdd a comment