శ్రీశైలం మల్లన్న ఆదాయం రూ.2.21కోట్లు | Srisailam Mallanna temple income Rs. 2. 21 crors | Sakshi
Sakshi News home page

శ్రీశైలం మల్లన్న ఆదాయం రూ.2.21కోట్లు

Published Fri, Mar 7 2014 1:36 AM | Last Updated on Sat, Sep 2 2017 4:25 AM

శ్రీశైల మహాక్షేత్రంలో ఫిబ్రవరి 20 నుంచి మార్చి 4 వరకు జరిగిన బ్రహ్మోత్సవాలలో భక్తులు సమర్పించిన కానుకలను రెండు రోజుల పాటు లెక్కించగా రూ. 2,21,62,614 లభించినట్లు ఈఓ చంద్రశేఖర అజాద్ గురువారం విలేకరులకు తెలిపారు.

శ్రీశైలం, న్యూస్‌లైన్: శ్రీశైల మహాక్షేత్రంలో ఫిబ్రవరి 20 నుంచి మార్చి 4 వరకు జరిగిన బ్రహ్మోత్సవాలలో భక్తులు సమర్పించిన కానుకలను రెండు రోజుల పాటు లెక్కించగా రూ. 2,21,62,614 లభించినట్లు ఈఓ చంద్రశేఖర అజాద్ గురువారం విలేకరులకు తెలిపారు. అక్కమహాదేవి అలంకార మండపంలో బుధ, గురువారాలలో హుండీల ఆదాయాన్ని లెక్కిం చారు. ఈ లెక్కింపులో నగదుతో పాటు 1,057 యుఎస్ డాలర్లు, 140కువైట్ దినార్లు, 30యుఏ పౌండ్లు, 10 ఆస్ట్రేలియా డాలర్లు, 20 సింగపూర్ డాలర్లు, 10 సౌదీ రియాల్స్, 10 మలేషియా రింగెట్స్ లభించాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement