ఎలిమినేటెడ్‌ కంటెస్టెంట్ల టార్గెట్‌.. ట్రోఫీకి మరింత దగ్గరైన నిఖిల్‌ | Bigg Boss Telugu 8: Nikhil Maliyakkal Gets Lots of Sympathy in 12th Week | Sakshi
Sakshi News home page

ఆమెను జీవితంలో క్షమించనన్న నిఖిల్‌.. టైటిల్‌ గెలవడం ఖాయం?!

Published Wed, Nov 20 2024 7:14 PM | Last Updated on Wed, Nov 20 2024 7:39 PM

Bigg Boss Telugu 8: Nikhil Maliyakkal Gets Lots of Sympathy in 12th Week

ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్లతో నామినేషన్‌ చేయిద్దాం అని బిగ్‌బాస్‌కు ఏ ముహూర్తాన అనిపించిందో కానీ ఇది ఒకరకంగా నిఖిల్‌కు ప్లస్సే అయింది. వచ్చినవాళ్లంతా.. నిఖిల్‌ ఆట గురించి కాకుండా పర్సనల్‌ టార్గెట్‌ చేశారు. సింహంలా ఉండే నిఖిల్‌ను పిల్లిలా మార్చి తనవైపు తిప్పుకున్న సోనియా కూడా అతడిని తప్పుపట్టింది.

క్లారిటీ ఇవ్వకపోవడం తప్పే!
యష్మి విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడం తప్పని కుండ బద్ధలు కొట్టింది. సీత అయితే మరో అడుగు ముందుకేసి స్ట్రాంగ్‌గా ఉండే ఆడవారిని టార్గెట్‌ చేస్తున్నావని, వారిని గేమ్‌ కోసం వాడుకుంటున్నావంటూ నిందలేసింది. ఇది మరీ విడ్డూరం.. నిఖిల్‌తో డ్యాన్స్‌ చేయాలనుంది, నిఖిల్‌తో ఓ కలగన్నాను అంటూ యష్మినే అతడి వెంట పడింది. కనీసం ఫ్రెండ్‌లా అయినా ఉండమని అర్థించింది. అటు సీత కూడా నిఖిల్‌పై ఇష్టం చూపించింది. 

జీవితంలో క్షమించనన్న నిఖిల్‌
వీరిని పెద్దగా పట్టించుకోని నిఖిల్‌.. మీపై నాకు ఎలాంటి ఫీలింగ్స్‌ లేవు అని ముక్కుసూటిగా చెప్పలేకపోయాడు. అదే అతడికి పెద్ద మైనస్‌ అయింది. అయితే యష్మితో కొన్ని సందర్భాల్లో ఫీలింగ్స్‌ పెట్టుకోవద్దన్నట్లు ఛూఛాయగా చెప్పినప్పటికీ అదంత హైలైట్‌ అవలేదు. ఫలితంగా 12వ వారం నామినేషన్స్‌లో సీత.. ఆడవారి ఎమోషన్స్‌తో ఆడుకుంటావ్‌ అని నిందేయడంతో నిఖిల్‌ చాలా హర్టయ్యాడు. ఆమెను జీవితంలో క్షమించనన్నాడు. ఆ బాధతో భోజనం కూడా తినకుండా నిద్రపోయాడు.

నిఖిల్‌కు సింపతీ
బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎవరినైనా టార్గెట్‌ చేస్తే ప్రేక్షకులు అస్సలు ఊరుకోరు. అతడిపై చాలా సింపథీ చూపిస్తారు.. అదీ ఓట్ల రూపంలో! ఈ నామినేషన్‌ ప్రక్రియతో నిఖిల్‌పై జనాల్లో సింపథీ వచ్చింది. పైగా నటి కావ్యతో ప్రేమస్టోరీ చెప్తూ.. తమ మధ్య దూరం వచ్చింది, కానీ ఈ జీవితానికి తనే భార్య అని ఏడ్చేయడంతో జనాలు తెగ కనెక్ట్‌ అయిపోయారు. నిఖిల్‌ ప్రేమ సఫలం కావాలని కోరుకున్నారు. అలా ఈ వారం నిఖిల్‌కు నెగెటివిటీ కంటే సింపథీయే ఎక్కువ వచ్చింది. దీంతో విన్నింగ్‌ రేస్‌లో గౌతమ్‌ను వెనక్కు నెట్టి మరీ ముందుకు దూసుకొచ్చేశాడు. మరి తర్వాతి వారాల్లో వీరిద్దరి గేమ్‌ ఎలా ఉంటుందో చూడాలి!

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement