తెలుగు బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ ఎలా ఉంది? మొదట్లో చప్పగా.. వైల్డ్ కార్డ్స్ వచ్చాక కాస్త జోష్‌గా సాగుతోంది. ఎప్పుడో అస్సాం ట్రైన్ ఎక్కాల్సిన సీజన్‌ను తిరిగి గాడిలో పడేలా చేసింది వైల్డ్ కార్డ్సే! అయితే వీరితో పోలిస్తే పాత కంటెస్టెంట్లు నెలరోజులపాటు తమ మనుగడను కాపాడుకునేందుకు ఎక్కువ కష్టపడ్డారు. ఆ సమయంలో తమకంటూ ఫ్యాన్‌బేస్ ఏర్పరుచుకున్నారు. దీంతో మధ్యలో వచ్చినవారికంటే పాతవారికే ఓట్లు పడే ఛాన్సులు ఎక్కువుంటాయి.
వైల్డ్ కార్డ్ విన్నర్ కాకూడదట!
వైల్డ్ కార్డ్స్ రెట్టింపు కష్టపడితేనే ఓట్లు తమవైపు మళ్లుతాయి. ఇక విషయమేంటంటే.. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ విన్నర్ అవకూడదంటున్నాడు అభయ్ నవీన్. నిఖిల్‌కు ఫ్రెండ్ అయిన ఇతడు.. పరోక్షంగా గౌతమ్ గెలవకూడదని చెప్తున్నాడు. పెద్దగా గేమ్స్ ఆడకపోయినా ఈజీగా చీఫ్ అయిపోయి నోటి దురుసుతో షో నుంచి ఎలిమినేట్ అయిన అభయ్ తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశాడు.
ఇది అధర్మం కాదా?
నిఖిల్, నేను బెలూన్ టాస్క్ ఆడినప్పుడు వాడి చేతిలో స్టిక్ ఇరిగిపోయినా నేను ఫైట్ చేశాను. అది ధర్మం కాదు, ఒకరి చేతిలో స్టిక్ లేనప్పుడు గేమ్ ఆడకూడదు అన్నారు కదా! అదే ధర్మం కానప్పుడు మధ్యలో వచ్చిన వ్యక్తి ఎలా గెలుస్తాడన్నా? బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా, తనపై జనాల్లో పాజిటివ్ ఉందా? నెగెటివ్ ఉందా? తెలుసుకోకుండా మొదటి నుంచి నచ్చిన గేమ్ ఆడుతున్నవాడు గెలిస్తే కరెక్టా?
అప్పుడు ఈ కాన్సెప్ట్ దేనికి?
లేదా వారి బలం, బలహీనతలు తెలుసుకుని గేమ్ మధ్యలో జాయిన్ అయి ఆడేవారు గెలిస్తే కరెక్టా? ఏదైనా సరే.. ఫస్ట్ నుంచి ఆడుతున్నవాడు గెలిస్తేనే కిక్ ఉంటదన్నా.. అది నా ఫీలింగ్ అని చెప్పుకొచ్చాడు. ఈ వీడియో చూసిన ఓ వ్యక్తి అలాంటప్పుడు వైల్డ్ కార్డ్స్ కాన్సెప్ట్ తీసేయమని చెప్పండి.. ఫస్ట్, లాస్ట్ ఇదంతా కాదు.. ఎవరు బాగా ఆడితే వాళ్లు గెలవాలి అని కామెంట్ చేశాడు. దీనికి అభయ్.. వైల్డ్‌కార్డ్ అనేది కేవలం జనాల్ని ఎంగేజ్ చేయడానికి మాత్రమేనని రిప్లై ఇచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment