బిగ్‌బాస్ 8లో మూడో ఎలిమినేషన్. తెలంగాణ పోరడు అభయ్ నవీన్ బయటకొచ్చేశాడు. తొలి రెండు వారాలు మంచి పోటీ ఇచ్చేలా కనిపించిన ఇతడు.. మూడో వారం వచ్చేసరికి పిచ్చిపిచ్చిగా ప్రవర్తించాడు. పైపెచ్చు బిగ్‌బాస్‌నే నోటికొచ్చిన మాటలన్నాడు. దీంతో నీ ఆట చాలులే అని బయటకు పంపించేశారు. ఇప్పుడు తీరిగ్గా అభిమానులకు క్షమాపణలు చెబుతున్నాడు. ఎలిమినేషన్ తర్వాత అభయ్ నవీన్ ఓ వీడియోని ఇప్పుడు రిలీజ్ చేశాడు.
అభయ్ ఏమంటున్నాడు?
'బిగ్‌బాస్ హౌస్‌లో నేను ఇంకా ఎక్కువ రోజులు ఉంటానని మీరు అనుకున్నారు. మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినందుకు వెరీ వెరీ సారీ. కానీ వెళ్లే ముందే నేను చెప్పి దిల్ దార్ ఉంటానని. అది నచ్చితే లోపల ఉంటా లేదంటే ఉండనని. దురదృష్టవశాత్తూ బయటకొచ్చేశా. నాకు ఓట్లు వేసి నన్ను సపోర్ట్ చేసిన మీ అందరికీ మరోసారి థ్యాంక్స్. మీకు సినిమాలతో మరింత దగ్గరవుతా. మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటా' అని అభయ్ నవీన్ చెప్పుకొచ్చాడు.
(ఇదీ చదవండి: వాళ్లకు ఇచ్చారు.. మాకు పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు: ఎన్టీఆర్ ఫ్యాన్స్)
ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే?
తొలి రెండు వారాల్లో బేబక్క, శేఖర్ భాషా ఎలిమినేట్ అయ్యారు. మూడో వారానికి వచ్చేసరికి కన్నడ బ్యాచ్ నుంచి ఎవరైనా ఎలిమినేట్ అవుతారేమోనని అందరూ అనుకున్నారు. కానీ ఓ జట్టుకి(క్లాన్) లీడర్‌గా వ్యవహరించిన అభయ్ నవీన్ ఎలిమినేట్ అయిపోయాడు. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు ఆటిట్యూడ్, కాన్ఫిడెన్స్ చూపించాలి. కానీ అది మితిమీరిపోతే సమస్య వస్తుంది. అభయ్ కూడా అలా ఓవర్ కాన్ఫిడెంట్ అయ్యాడు. అయితే అయ్యాడు కానీ దాన్ని బయటకు చూపించడం దెబ్బేసిందని చెప్పొచ్చు.
బిగ్‌బాస్‌నే తిడితే ఎలా?
గత వారం జరిగిన గుడ్లు టాస్క్‌లో తన జట్టు గెలుపు కోసం పోరాడుతుంటే చీఫ్‌గా ఉన్న అభయ్ మాత్రం ఆటని లైట్ తీసుకున్నాడు. దీనికి తోడు తన టీమ్ సభ్యులని కూడా ఆడొద్దని చెడగొట్టేందుకు ప్రయత్నించాడు. తన టీమ్‌పై విరుచుకుపడుతున్న అవతలి టీమ్ వాళ్లపై అరవాల్సింది పోయి బిగ్‌బాస్ మీద ప్రతాపం చూపించాడు. బిగ్‌బాస్.. బయాస్డ్ (ఒకరికే సపోర్ట్ చేయడం) అని నానాబూతులు తిట్టాడు. ఆడలేక మద్దెల దెరువు అన్నట్లు తప్పంతా బిగ్‌బాస్ మీదకు తోసేశాడు. ఇప్పుడేమో ఎలిమినేట్ అయి బయటకొచ్చిన తర్వాత కాకమ్మ కబుర్లు చెబుతున్నాడు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ నాలుగు డోంట్ మిస్)
Comments
Please login to add a commentAdd a comment