ఫండే.. ఎప్పటిలాగే నాగ్ ఫన్ గేమ్స్ ఆడించాడు. మధ్యమధ్యలో నామినేషన్‌లో ఉన్న ఎనిమిదిమందిలో ఒక్కొక్కరినీ సేవ్ చేసుకుంటూ పోయాడు. అందరూ ఊహించనట్లుగానే అభయ్ నవీన్ ఎలిమినేట్ అయ్యాడు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియలాంటే నేటి (సెప్టెంబర్ 22) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..
మొదట సేవ్ అయింది వీళ్లే..
నాగార్జున వచ్చీరావడంతోనే నామినేషన్‌లో ఉన్న ఎనిమిది మందిలో సీత, ప్రేరణ సేవ్ అయినట్లు ప్రకటించాడు. తర్వాత కంటెస్టెంట్లతో సెట్, కట్ గేమ్ ఆడించాడు . ఫ్రెండ్స్‌లో సెట్ అయ్యేవాళ్లకు హార్ట్ ఇచ్చి, సెట్ కానివాళ్లకు హార్ట్‌ను ముక్కలు చేసివ్వాలన్నాడు. మొదటగా నిఖిల్.. మాట వింటాడని పృథ్వీకి హార్ట్ ఇచ్చాడు. కొన్ని మాటలు వదిలేయడం వల్ల బాధపడ్డానంటూ సోనియాకు హార్ట్ ముక్కలు చేసిచ్చాడు.
నిఖిల్ హృదయం ముక్కలు
గతవారం ఇచ్చిన మాట ప్రకారం సోనియా.. నాగ్ కోసం పాట పాడి అలరించింది. తర్వాత సీత.. చాలా విషయాల్లో అర్థం చేసుకుంటుందంటూ నైనికకు హార్ట్.. అర్థం చేసుకోవట్లేదంటూ విష్ణుప్రియకు బ్రోకెన్ హార్ట్ ఇచ్చింది. మణికంఠ.. నేను తప్పు చేసినప్పుడు సరిచేసిందని సోనియాకు హార్ట్ ఇవ్వగా నిఖిల్‌కు ముక్కలైన హృదయం ఇచ్చాడు. నబీల్.. ఆదిత్యకు హార్ట్, నైనికకు బ్రోకెన్ హార్ట్ ఇచ్చాడు. విష్ణుప్రియ.. సీతతో సెట్ అని, పృథ్వీతో ఇంకా సెట్ అవట్లేదంటూ కట్ చెప్పింది.
విష్ణుకు బ్రోకెన్ హార్ట్
నైనిక వంతురాగా సీతతో సెట్ అని, నిఖిల్‌తో కొన్ని చెప్పుకోలేకపోతున్నానంటూ కట్ చెప్పింది. ప్రేరణ.. సహనం నేర్పించాడంటూ అభయ్‌కు హార్ట్ ఇచ్చింది. ఫ్రెండే కాదని నన్ను నామినేట్ చేసిందంటూ యష్మికి హార్ట్ బ్రేక్ ఇచ్చింది. పృథ్వివంతు రాగా.. యష్మికి హార్ట్ ఇచ్చి.. నా మనసు ముక్కలు చేసిందంటూ విష్ణుకు బ్రోకెన్ హార్ట్ ఇచ్చాడు. సోనియా.. మణికి హార్ట్ ఇచ్చి అభయ్‌కు బ్రోకెన్ హార్ట్ ఇచ్చింది. అభయ్ వంతురాగా.. యష్మికి హార్ట్, ప్రేరణకు బ్రోకెన్ హార్ట్ ఇచ్చాడు. ఆదిత్య.. నబీల్ హార్ట్ ఇచ్చి, మణికి బ్రోకెన్ హార్ట్ ఇచ్చాడు.
అభయ్ ఎలిమినేట్
చివరగా యష్మి.. నిఖిల్‌కు సెట్ చెప్పి పృథ్వీకి కట్ చెప్పింది. తర్వాత నైనికను సేవ్ చేసి ఇంట్లోవారితో సరదా గేమ్ ఆడించారు. అనంతరం మణికంఠ, విష్ణుప్రియ, యష్మిని సేవ్ చేశారు. మళ్లీ ఓ గేమ్ ఆడించాక.. ఈ వారం కిచెన్‌లో మరో రెండు గంటలు ఎక్కువసేపు వంట చేసుకోవచ్చని ఆఫర్ ఇచ్చాడు. తర్వాత పృథ్విని సేవ్ చేస్తూ.. అభయ్ ఎలిమినేటెడ్ అని నాగ్ ప్రకటించడంతో సీత ఏడ్చేసింది.
ఆ ముగ్గురికి నల్ల గులాబీ
మితిమీరిన కామెడీకి ఫలితం అనుభవించాల్సిందేనని అభయ్ తన ఎలిమినేషన్‌ను అంగీకరించాడు. వెళ్లిపోతూ హౌస్‌లో ఉన్న ముగ్గురికి బ్లాక్ రోజ్ ఇచ్చాడు. కొన్ని పదాలు మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఉండమని విష్ణుప్రియకు, వీలైనంతవరకు వేరేవారి గొడవలకు దూరంగా ఉండమని మణికంఠకు, ఫైనల్స్‌లో చూడాలంటూ పృథ్వీకి బ్లాక్ రోజెస్ ఇచ్చాడు. నిఖిల్, సీత, సోనియా, నబీల్‌కు ఎర్రగులాబీలు ఇచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment