నిఖిల్‌కు హ్యాండిచ్చిన ఆ ఇద్దరు.. విష్ణుప్రియకు ఘోర అవమానం! | Bigg Boss Telugu 8: Yashmi Team Won on Nainika Team | Sakshi
Sakshi News home page

Bigg Boss 8 Telugu: పృథ్వీకి వింత అలవాటు, విష్ణుప్రియను ఎవరూ పట్టించుకోరేంటి?

Published Thu, Sep 5 2024 11:12 PM | Last Updated on Fri, Sep 6 2024 9:30 AM

Bigg Boss Telugu 8: Yashmi Team Won on Nainika Team

నామినేషన్స్‌లో ఉండటంతో నాగమణికంఠ సైలెంట్‌ అయిపోయాడు. బోలాగా మాట్లాడే విష్ణుప్రియను టీమ్‌లోకి తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు.. యష్మి తనను నమ్మినందుకు అభయ్‌.. ఆమెను గెలిపించాడు.. ఇలాంటి ఎన్నో సంగతులను నేటి (సెప్టెంబర్‌ 5)ఎపిసోడ్‌ హైలైట్స్‌లో చదివేయండి..

ఫేస్‌వాష్‌తో బ్రషింగ్‌!
నామినేషన్స్‌ రోజు మొదలుపెట్టిన ఏడుపును మణికంఠ ఇంకా ఆపలేదు. బహుశా ఎలిమినేషన్‌ భయం పట్టుకుందో, ఏమో కానీ ఓరకమైన శూన్యంలోకి వెళ్లిపోయాడు. తన జీవితం ఏమవుతుందో తెలియడం లేదంటూ మళ్లీ కంటతడి పెట్టుకున్నాడు. మరోవైపు బాత్రూమ్‌లో పృథ్వీ తనకు తెలియకుండా చేసిన పనితో అందరినీ నవ్వించాడు. టూత్‌పేస్ట్‌ అనుకుని అతడు తన బ్రష్‌కు ఫేస్‌వాష్‌ క్రీమ్‌ పెట్టుకోవడంతో అక్కడున్న అందరూ ఫక్కుమని నవ్వారు.

చీఫ్‌లకు టీమ్స్‌
ఇక నైనిక ప్రేమ వ్యవహారాన్ని నిఖిల్‌ బయటకు లాగాలని ప్రయత్నించాడు. కానీ దానికింకా టైముందన్నట్లు ఒక్క ముక్క కూడా చెప్పడానికి ఇష్టపడలేదు. పైగా అబ్బాయి పేర్లు గెస్‌ చేయనా అంటుంటే కూడా వద్దంటూ తెగ సిగ్గుపడిపోయింది. ఇంతలో బిగ్‌బాస్‌ ముగ్గురు చీఫ్‌లకు ఓ టాస్క్‌ ఇచ్చాడు. రాజుకు సైన్యం ఉన్నట్లే చీఫ్‌లకు క్లాన్‌ ఉండాలని, అది వారే నిర్మించుకోవాలని చెప్పాడు. 

ఆ ముగ్గురూ చెరొకరిని..
చీఫ్‌ అవడానికి ఒక అడుగు దూరంలో ఆగిపోయిన బాషా, బేబక్క, అఫ్రిదిలకు మాత్రం ఏ చీఫ్‌ కింద చేరాలనేది సొంతంగా నిర్ణయించుకోవచ్చని ఆఫర్‌ ఇచ్చాడు. దీంతో బాషా.. యష్మిని, బేబక్క.. నిఖిల్‌ను, అఫ్రిది.. నైనికను సెలక్ట్‌ చేసుకున్నారు. మిగతా ఇంటిసభ్యుల్లో ఎవరు ఎవరికి కావాలనేది చీఫ్‌లు నిర్ణయించుకోవాలన్నాడు. ప్రేరణ కావాలని నిఖిల్‌, యష్మి ఇద్దరూ కోరారు. అయితే ప్రేరణ.. యష్మి టీమ్‌లోకి వెళ్లడానికే మొగ్గు చూపుంది. 

నిఖిల్‌ టీమ్‌లో మణికంఠ
అలాగే అభయ్‌ కావాలని నిఖిల్‌, యష్మి ఇద్దరూ అడిగారు. అయితే యష్మి టీమ్‌కు బలం కావాలని కోరిందని, దాన్ని నెరవేర్చేందుకు ఆమె టీమ్‌లోకి అడుగుపెడుతున్నానన్నాడు అభయ్‌. నాగమణికంఠకు తనను తాను ప్రూవ్‌ చేసుకునే అవకాశం ఇవ్వాలనుకుంటున్నానంటూ అతడిని తన టీమ్‌లో చేర్చుకున్నాడు నిఖిల్‌. పృథ్వీ కావాలని నిఖిల్‌, యష్మి ఇద్దరూ అడిగారు. అయితే పృథ్వీ యష్మిని ఎంపిక చేసుకోవడం గమనార్హం.

విష్ణుప్రియ వంతు వచ్చేసరికి..
చీఫ్‌ నైనిక.. తన నిర్ణయాలు బాగుంటాయంటూ ఆదిత్యను,  బ్యూటీ విత్‌ బ్రెయిన్‌ అంటూ సీతను తన టీమ్‌లో చేర్చుకుంది. విష్ణుప్రియ పేరెత్తేసరికి ఎవరూ తనను తీసుకోవడానికి ఆసక్తి చూపలేదు. కొన్ని క్షణాల తర్వాత నైనిక.. విష్ణుప్రియను తీసుకుంది. యష్మి, నైనిక టీమ్‌లో నలుగురు చొప్పున ఉండటంతో సోనియాకు ఇంకో ఆప్షన్‌ లేక నిఖిల్‌ టీమ్‌లో చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆమె.. నిఖిల్‌లో నాయకత్వ లక్షణాలున్నాయి, ఈ ఆడపులి నీ టీమ్‌లో ఉంటే విజయం తథ్యమన్నట్లుగా తనకు తానే డప్పు కొట్టుకుంది.

నిఖిల్‌ ఎమోషనల్‌
కాసేపటి తర్వాత తననెందుకు సెలక్ట్‌ చేసుకోలేదని విష్ణుప్రియ వెళ్లి నిలదీయడంతో నిఖిల్‌ ఎమోషనలయ్యాడు. తన ఉద్దేశం అది కాదంటూ కంటతడి పెట్టుకున్నాడు. మణికంఠను నేను తీసుకోకపోతే ఇంకెవ్వరూ తీసుకోరు, అందుకే అతడిని చేర్చుకున్నాను.. నిన్నెవరైనా తీసుకుంటారనే ఊరుకున్నట్లు పేర్కొన్నాడు.

వింత అలవాటు
పృథ్వీ ఊరికనే కప్పు కూర తినే అలవాటు చూసి బేబక్క షాక్‌ అయింది. అలాంటి పద్ధతులు ఇక్కడ కష్టమని పరోక్షంగా హెచ్చరించింది. అటు ప్రేరణ.. తన టవల్‌ను ఆదిత్య చూసుకోకుండా వాడేశాడంటూ తెగ ఫ్రస్టేట్‌ అయింది. చూసుకోలేదు, తప్పయిపోయిందంటూ ఆదిత్య పదిసార్లు క్షమాపణ చెప్పినా ఆమె మాత్రం అదే పాఠం అప్పజెబుతూనే ఉంది. దీంతో ఈ గోడు వినలేక బిగ్‌బాస్‌ తనకు కొత్త టవల్‌ పంపించాడు. బాత్‌రూమ్‌ను క్లీన్‌గా ఉంచడం లేదంటూ యష్మి, ప్రేరణ, సోనియా కాసేపు వాదులాడుకున్నారు.

మాట మీద నిలబడ్డాడు
గేమ్‌ విషయానికి వస్తే.. యష్మి, నైనిక టీమ్స్‌లో నలుగురు చొప్పున ఉండటంతో ఈ రెండు టీమ్‌లకు బాల్‌ పట్టు- గోల్‌ కొట్టు అనే టాస్క్‌ ఇచ్చారు. ఈ గేమ్‌లో నైనిక టీమ్‌ ఒక్క గోల్‌ కూడా చేయలేకపోయింది. యష్మి టీమ్‌లో అభయ్‌.. ఒక గోల్‌ చేయడంతో వీరి టీమ్‌ గెలుపొందింది. గెలిచిన యష్మి టీమ్‌.. ముగ్గురు సభ్యులు మాత్రమే ఉన్న నిఖిల్‌ టీమ్‌లో నుంచి ఒకరిని లాక్కునే ఛాన్స్‌ ఉంది. అయితే వాళ్లు సోనియాను లాక్కున్నారని తెలుస్తోంది. ఇలాగైతే నిఖిల్‌ టీమ్‌లో ఇద్దరు మాత్రమే మిగులుతారు.

 

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement