విష్ణుప్రియ గుండె ముక్కలు.. కొత్త మెగా చీఫ్‌ ఎవరంటే? | Bigg Boss 8 Telugu November 6th Full Episode Review And Highlights: Tasty Teja Fun And Prerana Become New Mega Chief | Sakshi
Sakshi News home page

Bigg Boss 8 Nov 6th Highlights: లొల్లి పుట్టించిన తేజ.. విష్ణుప్రియ మనసు ముక్కలు.. ఎట్టకేలకు ఆవిడే చీఫ్‌!

Published Wed, Nov 6 2024 11:04 PM | Last Updated on Thu, Nov 7 2024 11:13 AM

Bigg Boss Telugu 8, Nov 6th Episode Full Review: Prerana New Mega Chief

మెగా చీఫ్‌ కంటెండర్‌షిప్‌ కోసం హౌస్‌లో పోటీలు జరిగాయి. యష్మి, విష్ణుప్రియ, ప్రేరణ.. ముగ్గురూ టఫ్‌ టాస్కులోనూ కష్టపడి ఆడారు. అటు బిగ్‌బాస్‌ గాసిప్స్‌ వినాలని తహతహలాడిపోయాడు. ఇంకా ఏం జరిగిందో తెలియాలంటే నేటి (నవంబర్‌ 6) ఎపిసోడ్‌ హైలైట్స్‌ చదివేయండి..

కీని పట్టు.. కంటెండర్‌షిప్‌ను గెలిచేట్టు
ఇప్పటికే రోహిణి, నబీల్‌ కంటెండర్‌షిప్‌ బ్యాడ్జులు గెలిచారు. మిగిలిన పృథ్వీ కోసం 'కీని పట్టు.. కంటెండర్‌షిప్‌ను గెలిచేట్టు' అనే గేమ్‌ ఇచ్చాడు. ముందుగా తాళాలు సంపాదించి అన్ని బాక్సులు ఓపెన్‌ చేసినవారు గెలుస్తారు. పృథ్వీతో ఎవరు తలబడాలనుకుంటున్నారో చెప్పాలనగా దాదాపు హౌస్‌మేట్స్‌ అందరూ ముందుకొచ్చారు. దీంతో పృథ్వీ.. అందరిలో నుంచి విష్ణుప్రియను సెలక్ట్‌ చేసుకున్నాడు. అలా పృథ్వీ, విష్ణు ఆడారు.

విష్ణును బోల్తా కొట్టించిన పృథ్వీ
ఈ గేమ్‌లో పృథ్వీ అతి తెలివితో విష్ణుప్రియను బురిడీ కొట్టించి గెలిచేశాడు. అలాగే కంటెండర్‌షిప్‌ బ్యాడ్జ్‌ ధరించాడు. అతడి సూట్‌కేస్‌లో రూ.99,000 ఉండగా.. అవి ప్రైజ్‌మనీలో యాడ్‌ అయ్యాయి. పృథ్వీకి ఒకర్ని చీఫ్‌ కంటెండర్‌ చేసే ఛాన్స్‌ ఉండగా ఆ అవకాశాన్ని అతడు విష్ణుప్రియకు ఇచ్చాడు. ఆ తర్వాత నువ్వు చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటావు.. నిన్ను ఆదర్శంగా తీసుకుని చాలా మారిపోయాను అంటూ విష్ణుతో కబుర్లాడాడు పృథ్వీ.

మెలిక పెట్టిన బిగ్‌బాస్‌
ఇకపోతే బ్యాడ్జులు గెలిచిన నబీల్‌, పృథ్వీ, రోహిణి.. యష్మి, విష్ణుప్రియ, ప్రేరణలను కంటెండర్లుగా సెలక్ట్‌ చేశారు. ఈ ముగ్గురికీ బిగ్‌బాస్‌ ఇసుక బస్తాలతో గేమ్‌ పెట్టాడు. ఇందులో ప్రేరణ విజయం సాధించి కంటెండర్‌షిప్‌ బ్యాడ్జ్‌ ధరించింది. అలాగే తన దగ్గరున్న సూట్‌కేసులో రూ.1 లక్ష ఉంది. ఇక్కడే బిగ్‌బాస్‌ ఓ మెలిక పెట్టాడు. ఈ సూట్‌కేసుకు బదులుగా మిస్టరీ సూట్‌కేస్‌ సెలక్ట్‌ చేసుకోవచ్చన్నాడు. దీంతో పాతది వదిలేసి మిస్టరీ సూట్‌కేస్‌ తెరిచింది. తీరా చూస్తే ఆశ్చర్యంగా అందులో రూ.2,10,00 ఉన్నాయి. ఇది విన్నర్‌ ప్రైజ్‌మనీలో జమైంది.

అంతమాట అనేసిందేంటి?
గంగవ్వ.. ప్రేమపక్షులు పృథ్వీ, విష్ణులను అన్నాచెల్లి అనేసింది. పృథ్వీకి విష్ణు చెల్లిలా అన్నీ దగ్గరుండి చేసి పెడుతుందని మెచ్చుకుంది. అక్కడ చెల్లి అనే పదం విని విష్ణు గుండె ముక్కలైంది. చెల్లి కాదు, అతడంటే ప్రేమ అని విష్ణు చెప్తున్నా కూడా అవన్నీ కుదరవని తీర్పు చెప్పింది. అనంతరం బిగ్‌బాస్‌.. తేజను కన్ఫెషన్‌ రూమ్‌కు పిలిచి అతడి ముందు కేక్‌ పెట్టాడు. కేక్‌ కావాలంటే ఇంటిసభ్యుల గురించి ఒక మంచి గాసిప్‌ చెప్పాలన్నాడు.

అప్పట్లో ట్రయాంగిల్‌.. ఇప్పుడైతే..
దీంతో తేజ.. గౌతమ్‌- యష్మి- నిఖిల్‌ మధ్య ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ నడిచిందని కానీ ఇప్పుడు అది లేదన్నాడు. గౌతమ్‌- యష్మి మధ్య అక్కాతమ్ముళ్ల అనుబంధం, నిఖిల్‌- యష్మి మధ్య ఫ్రెండ్‌షిప్‌ ఉందన్నాడు. నీకు ఎవరు క్రష్‌ అని బిగ్‌బాస్‌ అడగడంతో పడీపడీ నవ్విన తేజ.. క్రష్‌ కాదుగానీ ప్రేరణతో మంచి అనుబంధం ఏర్పడిందన్నాడు. కన్ఫెషన్‌ రూమ్‌ నుంచి బయటకు వచ్చిన తేజ అసలు విషయం చెప్పకుండా.. యష్మి సూట్‌కేస్‌ ఎవరికైనా ఒకరికి ఇవ్వాలని బిగ్‌బాస్‌ చెప్పాడంటూ అబద్ధమాడాడు. 

తేజ పెట్టిన పెంట
అది నిజమని నమ్మిన యష్మి.. వెంటనే తన సూట్‌కేసును గౌతమ్‌కు ఇచ్చింది. పోయినవారం అతడిని రేస్‌ నుంచి తీసేసినందుకు ఈసారి ఒక ఛాన్స్‌ ఇవ్వాలనుకుంది. కానీ పృథ్వీ అందుకు ఒప్పుకోలేదు. అతడికెందుకు ఇస్తావంటూ కోపంగా మాట్లాడాడు. దీంతో యష్మి ఫీలైంది. అది చూసిన విష్ణు.. ఈ అబ్బాయిలు డిక్టేటర్‌గా మనల్ని రూల్‌ చేయడమేంటని అసహనం వ్యక్తం చేసింది.

గాసిప్‌ చెప్తే కేక్‌ ఫ్రీ
అటు ప్రేరణను కన్ఫెషన్‌ రూమ్‌లోకి పిలిచిన బిగ్‌బాస్‌ ఏదైనా గాసిప్‌ చెప్తే కేక్‌ తినొచ్చన్నాడు. నిఖిల్‌కు యష్మి అంటే ఇష్టం.. కానీ, అందరి ముందు బయటపడటం లేదు అని తెలిపింది. ఈ ఇంట్లో అందరికంటే జెన్యూన్‌ ఎవరని అడగ్గా గంగవ్వ పేరు చెప్పింది. ఇకపోతే ఎంతోకాలంగా మెగా చీఫ్‌ పోస్ట్‌ కోసం కళ్లలో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న ప్రేరణ ఎట్టకేలకు చీఫ్‌ పదవిని కైవసం చేసుకున్నట్లు భోగట్టా!

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement