కంటెస్టెంట్ల ఫోటోపై పెయింట్ వేసి నామినేట్ చేయాలి. బజర్ మోగినప్పుడు ముందుగా బ్రష్ పట్టుకున్న వారికే నామినేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. నామినేషన్స్ అంటేనే గొడవలు కాబట్టి దానికి ఏమాత్రం కొదవ లేదు. యష్మి తప్పును తన నోటితోనే చెప్పించాడు తేజ.. మరి ఎవరు ఎవర్ని నామినేట్ చేశారో నేటి (నవంబర్ 11) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..
ఫేవరిటిజం స్పష్టంగా కనిపిస్తోంది
ముందుగా మెగా చీఫ్ ప్రేరణ.. గౌతమ్ ఫోటోకు పెయింట్ పూస్తూ ప్రతీది ఆడియన్స్ ఏమనుకుంటారు? అనేది ఆలోచిస్తూ అడుగు వేస్తున్నాడు. అందరితో కలవట్లేదు, టీమ్ స్పిరిట్ లేదు అని కారణాలు చెప్పింది. ఆ కారణాలు గౌతమ్‌కు ఏమాత్రం మింగుడుపడలేదు. టీమ్ వర్క్ అంటే.. ఓడినా, గెలిచినా కలిసి పోరాడటం.. అంతే తప్ప నీవల్ల ఓడిపోయాం అంటూ గుచ్చిగుచ్చిచెప్పడం టీమ్ మెంబర్ లక్షణం కాదు. ఇక్కడ ఫేవరిటిజం, గ్రూపిజం స్పష్టంగా కనిపిస్తోంది అని ప్రేరణపై మండిపడ్డాడు.
నాది తప్పయితే యష్మిది కూడా తప్పే!
తర్వాత బజర్ మోగగానే బ్రష్ పట్టుకున్న నిఖిల్.. తేజను నామినేట్ చేశాడు. ఎవిక్షన్ షీల్డ్ గేమ్‌లో అతడు కావాలని తప్పు చేశాడన్నాడు. దీనికి తేజ స్పందిస్తూ.. నేను తెలిసి తప్పు చేయలేదు. నేను గుడ్డు వేయడం తప్పయితే నా తర్వాత యష్మి చేసింది తప్పు కాదా? అని సూటిగా ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు నిఖిల్ సమాధానం దాటవేస్తుంటే.. నీకు మాట్లాడటానికి భయం.. అంటూ రెచ్చగొట్టాడు. దాంతో నిఖిల్.. ఆమెది తప్పు కాదు, నీదే తప్పు అన్నాడు.
దమ్ము లేదు
ఇంతలో నిఖిల్ గ్యాంగ్ వీళ్లను ఆపేందుకు రాగా.. ముగ్గురూ నాపై అటాక్ చేస్తున్నారా? అని తేజ అన్నాడు. దాంతో పృథ్వీ.. ఆ ముగ్గురు ఎవరని అడిగారు. నువ్వు అడిగితే నేను చెప్పను అని తేజ అంటే.. నీకు పేర్లు చెప్పే దమ్ము లేదు అంటూ తేజపై రెచ్చిపోయాడు. తర్వాత గౌతమ్.. అవతలి వ్యక్తులను అగౌరవపర్చడం అలవాటైపోయిందంటూ పృథ్వీని నామినేట్ చేశాడు.
తల్లికి తేజ క్షమాపణలు
దీని గురించి చర్చించే క్రమంలో.. నీ బెదిరింపులకు అందరూ భయపడతారేమో కానీ నేను కాదు అని గౌతమ్ అన్నాడు. నువ్వు విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నావని పృథ్వీ ఆరోపించాడు. అనంతరం తేజ ముందుగా తన తల్లికి సారీ చెప్పాడు. నిన్ను హౌస్‌కు తీసుకొస్తానని చెప్పాను, కానీ ఆ మాటపై నిలబడలేకపోతున్నందుకు క్షమించమన్నాడు. ఇందుకు కారణమైన హౌస్‌మేట్స్‌కు థాంక్యూ చెప్పాడు.
వరస్ట్ ప్లేయర్ అంటూ
తర్వాత యష్మిని నామినేట్ చేస్తూ.. ఆమె అభిప్రాయాన్ని గౌరవించకుండా నేను ఒక గుడ్డును పాము నోట్లో పెట్టాను. తర్వాత యష్మి కూడా ఆలోచించకుండా వెళ్లి మరో గుడ్డు పాము నోట్లో వేసింది. నేను చేసింది తప్పే.. అలాగే యష్మి చేసింది కూడా తప్పే! అన్నాడు. దీనిపై యష్మి.. తాను తప్పు చేయలేదని వాదించింది. ఈ క్రమంలో హే.. పో, కూర్చో అంటూ చిరాకుపడింది. వరస్ట్ ప్లేయర్ అంటూ తేజపై ముద్ర వేసింది. పృథ్వీ.. చీఫ్‌గా, సంచాలకుడిగా ఫెయిలయ్యావంటూ అవినాష్‌ను నామినేట్ చేశాడు.
మాట తప్పావ్
రోహిణి.. చీఫ్ కంటెండర్ అయినప్పుడు నాకు సపోర్ట్ చేస్తానని చెప్పి మాట తప్పావంటూ విష్ణుప్రియను నామినేట్ చేసింది. ఆ రోజు అందుకే ఏడ్చానని రోహిణి పేర్కొంది. దీనికి విష్ణు తలతిక్క సమాధానమిచ్చింది. తొక్కలో మాట ఇచ్చుండకపోతే నాకు ఈ సమస్య వచ్చేదే కాదు. ఇప్పుడు చెప్తున్నా.. నాకు అందరికంటే పృథ్వీయే ఎక్కువ అని ప్రకటించేసింది. ఇక ఈ వారం గౌతమ్, తేజ, పృథ్వీ, అవినాష్, విష్ణుప్రియ, యష్మీ నామినేట్ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment