వైల్డ్‌కార్డులు లేకుండా ఈరోజే లాస్ట్‌డే.. రేపు ఈ సమయానికల్లా ఎనిమిది మంది మాజీలు హౌస్‌లో తిష్ట వేస్తారు. సింపతీ ఏడుపులు వద్దంటూ నాగార్జున నాగమణికంఠకు క్లాసు పీకాడు. ఇదే మంచి తరుణమని హౌస్‌మేట్స్ అంతా కూడా మణిపైనే పడ్డారు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగిందో తెలియాలంటే నేటి(అక్టోబర్ 5) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..
మణికంఠకు క్లాస్ పీకిన నాగ్
నాగార్జున వచ్చీరావడంతోనే సింపతీకి ఫుల్‌స్టాప్ పెట్టమని మణికంఠకు గట్టిగా క్లాస్ పీకాడు. ఎంత బాధున్నా ఇప్పుడే ఏడ్చేసేయ్, కానీ తర్వాత మాత్రం ఏడవడానికి వీల్లేదన్నాడు. అయినా మణి కంట నుంచి ఒక్క నీటి చుక్క కూడా రాలేదు. దీంతో నాగ్.. నీ భార్య నీదగ్గరకు రానంటే ఏం చేస్తావ్? నీకు ఫుడ్ పంపించింది కూడా నీ భార్య కాదు ఫ్రెండ్ రాహుల్ అని చెప్పడంతో మణి ఏడ్చేశాడు. ఇంకా ఎన్నాళ్లు ఇలా ఏడుస్తూ సింపతీ కోరుకుంటావని తిట్టాడు.
ఫైర్? అదెలా ఉంటుంది సర్?
మణికి ఈ రేంజ్‌లో క్లాస్ పీకడంతో హౌస్‌మేట్స్ అంతా కూడా అతడి మీదే పడ్డారు. మొదటగా ప్రేరణ.. మణి అందరూ తన గురించే ఆలోచించాలనుకుంటాడంది. విష్ణుప్రియ, పృథ్వీ కూడా అతడిని సెల్ఫిష్ అనేశారు. ఈ సందర్భంగా నాగ్.. విష్ణుప్రియలో ఫైర్ చూడాలనుందనగా.. అదెలా ఉంటుంది సర్? అని అమాయకంగా ముఖం పెట్టి అడిగింది విష్ణు. దీంతో నాగార్జున మారు మాట్లాడలేక తన నోటికి తాళం వేసుకున్నాడు.
ప్రేరణను సెల్ఫిష్ అనేసిన యష్మి
నబీల్ వంతురాగా.. తాను గెలిచినప్పుడు యష్మి జెలసీతో ఏడ్చేసిందన్నాడు. యష్మి మళ్లీ మణి దగ్గరకే వచ్చి అతడు ప్రవర్తన అన్నోయింగ్‌గా అనిపిస్తుందంది. అలాగే ప్రేరణ సెల్ఫిష్‌గా అనిపిస్తోందని అభిప్రాయపడింది. నాగ్ మాత్రం.. ప్రేరణ గేమ్ అద్భుతంగా ఆడుతుందని మెచ్చుకున్నాడు. ఇక యష్మికి తండ్రి పంపిన మెసేజ్ చెప్తానన్నాడు నాగ్. కాకపోతే ఏదైనా సీక్రెట్ చెప్పాలని షరతు విధించాడు.
మోసపోయిన యష్మి
దీంతో యష్మి ఓపెన్ అవుతూ.. కాలేజీలో ఒకర్ని ప్రేమించాను.. ఈ విషయం ఎవరికీ తెలియకూడదని మా ఇద్దరి పేర్ల మొదటి అక్షరాలను చైనీస్ భాషలో పచ్చబొట్టు వేయించుకున్నాను. తర్వాత తెలిసిందేంటంటే.. ఇది జపనీస్ భాష అంట.. పైగా ఈ అక్షరాలకు అసలు అర్థమే లేదంటూ తను మోసపోయిన విషయం బయటపెట్టింది. సీక్రెట్ బయటపెట్టిన యష్మికి తండ్రి పంపిన మెసేజ్‌ను తెలియజేశాడు. నిన్ను చూస్తే గర్వంగా ఉంది, వారియర్‌లా పోరాడు, మిస్ అవుతున్నానని సందేశం పంపాడన్నాడు.
మణికంఠ కన్నీళ్లు
సీతకు ఈర్ష్య ఉందని పృథ్వీ, ప్రేరణ అభిప్రాయపడ్డారు. మణి కన్నింగ్ అని నిఖిల్, మణి టాక్సిక్ అని నైనిక పేర్కొన్నారు. మణికంఠ వంతు వచ్చేసరికి.. ఎవరినీ జడ్జ్ చేసే పరిస్థితిలో లేనంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. గేమ్ ఆడాల్సిందే అని నాగ్ గద్దించడంతో సీతకు జెలసీ ఉందన్నాడు. నేను ఎలా సేవ్ అవుతున్నానో అర్థం కావడం లేదనేసిందని చెప్పాడు. కిచెన్‌లో ప్రేరణ ప్రవర్తించిన తీరు నచ్చలేదన్నాడు. ఈరోజు ఎపిసోడ్‌లో నిఖిల్, నబీల్‌ను సేవ్ చేశారు.
ఆ నలుగురికీ ఆదిత్య పంచ్
తర్వాత వారం మధ్యలోనే ఎలిమినేట్ అయిన ఆదిత్యను స్టేజీపైకి పిలిచి జర్నీ చూపించాడు. అతడితో హగ్ అండ్ పంచ్ గేమ్ ఆడించాడు. నబీల్, పృథ్వీరాజ్, విష్ణుప్రియ, ప్రేరణ, నిఖిల్‌కు హగ్స్ ఇచ్చిన ఆదిత్య.. యష్మి, నైనిక, సీత, నాగమణికంఠకు పంచ్ ఇచ్చాడు. ఒక్కవారమైనా ఏ గొడవా లేకుండా ఆడమని మణికి సలహా ఇచ్చాడు. ఇక పుట్టినరోజునాడే ఆదిత్య బిగ్‌బాస్ నుంచి వీడ్కోలు తీసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment