యష్మిని ఆడుకున్న బిగ్‌బాస్‌.. ఏడ్చినా కరుణించలేదు! | Bigg Boss 8 Telugu October 4th Full Episode Review And Highlights: Home Food And Personal Messages For Contestants | Sakshi
Sakshi News home page

Bigg Boss 8 Day 33 Highlights: యష్మికి ఫ్యామిలీ సపోర్ట్‌ లేదా? ఈవారం మణి వెళ్లిపోయేలా ఉన్నాడే!

Published Sat, Oct 5 2024 12:05 AM | Last Updated on Sat, Oct 5 2024 11:32 AM

Bigg Boss Telugu 8, Oct 4th Full Episode Review: Home Food for Contestants

ఆదిత్య ఎలిమినేషన్‌తో హౌస్‌లో తొమ్మిది మందే మిగిలారు. వీరికోసం బిగ్‌బాస్‌ అదిరిపోయే డీల్‌ తీసుకొచ్చాడు. ఇంటి వంటను కళ్లముందుంచాడు. కానీ దాన్ని తినే అదృష్టం మాత్రం కొందరికే ఉంటుందని ట్విస్ట్‌ ఇచ్చాడు. మరి ఎవరెవరు ఇంటి భోజనం అందుకున్నారో తెలియాలంటే నేటి (అక్టోబర్‌ 04) ఎపిసోడ్‌ హైలైట్స్‌ చదివేయండి..

జాతకం చెప్పిన మణి
మణికంఠకు సపోర్ట్‌ చేస్తే ఆడియన్స్‌ దృష్టిలో మనల్నే విలన్‌ చేస్తున్నాడని సీత అభిప్రాయపడింది. అతడు సింపతీ గేమ్‌ ఆడుతున్నాడంది. ఇదిలా ఉంటే తర్వాతి రోజు మార్నింగ్‌ మస్తీ పేరిట బిగ్‌బాస్‌ మణికంఠతో హౌస్‌మేట్స్‌కు జ్యోతిష్యం చెప్పించాడు. ఈ సందర్భంగా మణి తనలోని ఫన్‌ యాంగిల్‌ను బయటపెట్టాడు. తర్వాత హౌస్‌మేట్స్‌ మణి జాతకం చెప్పారు. ఈ వారం వెళ్లిపోయేలా ఉన్నావని నబీల్‌, ప్రతిదానికి ఏడవొద్దని యష్మి సెటైర్లు వేశారు.

భార్య మెసేజ్‌ కోసం మణి ఆరాటం
అనంతరం అసలైన ఆట మొదలుపెట్టాడు. మొదటగా యష్మిని కన్ఫెషన్‌ రూమ్‌లోకి పిలిచాడు. నిఖిల్‌ కోసం అతడి అమ్మ చేసిన వంటను, నాగమణికంఠ కోసం అతడి భార్య చేసిన వంటను ముందు పెట్టాడు. వీరికి మెసేజెస్‌ కూడా వచ్చాయన్నాడు. అయితే ఇద్దరిలో ఒకరినే సెలక్ట్‌ చేసుకుని వారికి ఫుడ్‌, లెటర్‌ ఇవ్వాలన్నాడు. యష్మి.. క్షణం ఆలోచించకుండా నిఖిల్‌ పేరు చెప్పింది.  అది విని మణికంఠ గుండె బద్ధలయ్యింది. తన భార్య ఏమని మెసేజ్‌ పంపిందోనని దిగులు చెందాడు. అంతలోనే తనకోసం బిర్యానీ చేసి పంపినందుకు తినకపోయినా మనసు నింపుకున్నాడు.

నువ్వు వారియర్‌వి..
అమ్మ చేతి వంట తిన్న తర్వాత నిఖిల్‌.. 'ఎవరి కోసమూ మారాల్సిన అవసరం లేదు, లక్ష్యాన్ని మర్చిపోకు' అంటూ తల్లి పంపిన మెసేజ్‌ చూసుకుని మురిసిపోయాడు. తర్వాత కన్ఫెషన్‌ రూమ్‌లోకి వెళ్లిన పృథ్వీ విష్ణుప్రియకు బదులుగా నైనిక కోసం ఆమె తల్లి చేసిన ఇడ్లీసాంబార్‌ తీసుకెళ్తానన్నాడు. విష్ణు ముందుగానే త్యాగం చేసేందుకు రెడీ అని హింటివ్వడంతోనే పృథ్వీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. నువ్వు వారియర్‌వి, నీ బలం చూపించు అంటూ అమ్మ పంపిన మెసేజ్‌ చూసి నైనిక మురిసిపోయింది.

యష్మి ఎమోషన్స్‌తో ఆడుకున్న బిగ్‌బాస్‌
మణికంఠ వంతురాగా యష్మీని పక్కన పెట్టేసి పృథ్వీ ఫుడ్‌ తీసుకెళ్లిచ్చాడు. దీంతో యష్మి బోరుమని ఏడ్చేసింది. నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను అంటూ తల్లి నుంచి వచ్చిన మెసేజ్‌ చూసి పృథ్వీ ఖుషీ అయ్యాడు. ఇంతలో బిగ్‌బాస్‌ యష్మి కోసం తండ్రి పంపిన మెసేజ్‌ను సైతం టీవీలో వేశాడు. కానీ ఒక లైన్‌ చదివేలోపే దాన్ని తీసేయడంతో యష్మి ఒక్కసారి మెసేజ్‌ చూపించు బిగ్‌బాస్‌ అని ఏడుస్తూ వేడుకుంది. కానీ బిగ్‌బాస్‌ కనికరించలేదు. 

ఒంటరి పోరాటం..
ఇంతకీ ఆ మెసేజ్‌లో ఏముందంటే.. హాయ్‌ అమ్మూ, నువ్వు చిన్నప్పటి నుంచి ఒంటరిగానే నీ పోరాటాలను ఎదుర్కొన్నావు.. ఆ సమయంలో నీకు తోడుగా లేను. నీ కలలను సాకారం చేసుకునేటప్పుడు కుటుంబంలో ఎవరమూ నీకు సపోర్ట్‌ చేయలేదు. అయినా నువ్వు వారియర్‌లా పోరాడావు, మేము తప్పని నిరూపించావు. మేము గర్వపడేలా చేశావు. ధైర్యంగా ఉండు, మిస్‌ యూ మగలే.. ఇట్లు నీ పప్పా అని రాసి ఉంది.

పెళ్లయి 10 నెలలే..
తర్వాత కన్ఫెషన్‌ రూమ్‌లోకి వెళ్లిన నిఖిల్‌.. ప్రేరణ, నబీల్‌, సీత.. ముగ్గురిలో ప్రేరణను సెలక్ట్‌ చేసుకున్నాడు. తనకు ఇష్టమైన పావ్‌ బాజీని ప్రేరణ ఆవురావురుమని ఆరగించింది. 'మన పెళ్లయి పది నెలలే అవుతోంది.. నీకు ఈ షో ఎంత ముఖ్యమో నాకు తెలుసు. నిన్ను కలవలేనప్పటికీ టీవీలో సంతోషంగా చూస్తున్నాను. నిన్ను చూసి గర్విస్తున్నాను. మిస్‌ యూ.. ఇట్లు నీ పుట్టు' అని భర్త మెసేజ్‌ చదివి సంతోషించింది.

విష్ణుకు మెసేజ్‌
చివరగా ఇంటి నుంచి భోజనం అందుకోలేకపోయినవారికోసం బిగ్‌బాస్‌ మరో ఛాన్స్‌ ఇచ్చాడు. నిఖిల్‌, నైనిక, ప్రేరణ, పృథ్వీ కలిసి.. మిగతా హౌస్‌మేట్స్‌లో ఒకరికి ఫుడ్‌ తీసుకెళ్లొచ్చనగా అందరూ విష్ణుప్రియ పేరు చెప్పారు. చెల్లి పంపిన చికెన్‌ బిర్యానీ చూసి విష్ణు కన్నీళ్లు పెట్టుకుంది. తనకు ఏమని మెసేజ్‌ వచ్చిందంటే. ఆట మీద దృష్టి పెట్టి రేసుగుర్రంలా ఆడు, సైలెంట్‌గా ఉండటం వల్ల నీ గేమ్‌ డల్‌ అవుతుంది. టాస్కుల్లో ఫైర్‌ చూపించు.. ప్రేక్షకుల మనసు గెలుచుకో అని రాసుంది. మరి ఇప్పుడైనా విష్ణు.. పృథ్వీపైనే కాకుండా గేమ్‌పై ఫోకస్‌​ పెడుతుందేమో చూడాలి!

 

 

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement