ఓవర్ కాన్ఫిడెన్స్‌కు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు! బిగ్‌బాస్ 8లో ఓ కంటెస్టెంట్ విషయంలో ఇది నిరూపితం కాబోతోంది. మూడో వారం అభయ్ నవీన్ ఎలిమినేట్ కానున్నాడు. ఇప్పటికే షూటింగ్ అయిపోవడంతో తన ఎలిమినేషన్ గురించి లీకులు బయటకు వచ్చేశాయి. నిజానికి అభయ్ ఎలిమినేట్ అయ్యేవాడే కాదు, అసలు నామినేట్ అయ్యేవాడు కూడా కాదు!
సెల్ఫ్ నామినేట్
సోమవారం నామినేషన్స్ జరిగే సమయానికి హౌస్‌లో నిఖిల్, అభయ్ ఇద్దరూ చీఫ్స్‌గా ఉన్నారు. బిగ్‌బాస్ వీరిలో ఒకరు నామినేట్ కావాలని చెప్పాడు. దీంతో అభయ్, నిఖిల్ చర్చించుకున్నారు. నిఖిల్ తాను నామినేట్ అవుతానంటే అభయ్ అందుకు ఒప్పుకోలేదు. సేవ్ అవుతానన్న నమ్మకంతో తానే నామినేషన్‌లోకి వెళ్తానన్నాడు.
పర్ఫామెన్స్ సున్నా
చీఫ్ అయ్యానంటే తనలో కూడా ఏదో టాలెంట్ ఉండే ఉంటుంది, అందరూ తనను సపోర్ట్ చేస్తున్నారు.. ఇలా తనకు తానే గొప్పగా ఊహించుకున్నాడు. పోనీ ఈ వారం గేమ్ పర్ఫామెన్స్ ఏమైనా ఉందా? అంటే అదీ లేదు. చీఫ్‌గా అట్టర్ ఫ్లాప్! చేతకానివాడిలా ఆడకపోవడమే కాక టీమ్ అంతా కూడా గేమ్‌ను వదిలేయమన్నాడు. అటు బిగ్‌బాస్‌నూ బూతులు తిట్టాడు. ఇది చూసి బిగ్‌బాస్ అడిని చీఫ్ పదవి నుంచి తొలగించాడు.
గుణపాఠంగా..
అటు జనాలు సైతం.. అభయ్ హౌస్‌లో ఉంటే మిగతావారిని కూడా చెడగొట్టేలా ఉన్నాడని భావించి తనను పంపించేయడమే నయమనుకున్నారు. అందుకనే పెద్దగా ఓట్లు పడలేదు. చివరికి ఓవర్ కాన్ఫిడెన్స్‌తో చేతులు కాల్చుకున్నాడు. తను తీసుకున్న గోతిలో తనే పడ్డాడు. ఈ వారం ఎలిమినేట్ అయి హౌస్ అందరికీ ఓ గుణపాఠంగా మారాడు.
Comments
Please login to add a commentAdd a comment