ఆటతో లేదా మాటతో మెప్పించాలి. అప్పుడే బిగ్‌బాస్ షోలో రాణించగలరు. ఈ రెండింటిలో ఏది బ్యాలెన్స్ కోల్పోయినా హౌస్ నుంచి బయటకు రావడం ఖాయం! అభయ్ నవీన్ రెండింటి మీదా పట్టు కోల్పోయాడు. ఫలితంగా ఈ వారం ఎలిమినేట్ అయ్యాడు. ఏదో అదృష్టం కలిసొచ్చి అభయ్ చీఫ్ అయ్యాడంతే!
అచ్చిరాని చీఫ్ పోస్ట్
కంటెస్టెంట్లు తనను నమ్మి చీఫ్ పదవి కట్టబెట్టారు. ఏ ముహూర్తాన చీఫ్ అయ్యాడో కానీ తనలో నిర్లక్ష్యం, ధిక్కార ధోరణి ప్రస్ఫుటంగా కనిపించాయి. పైగా సెల్ఫ్ నామినేట్ అవడంతో అతడి ఓవర్ కాన్ఫిడెన్స్ ఇట్టే బయటపడింది. గుడ్ల టాస్క్‌లో తన టీమ్ గెలుపు కోసం వెంపర్లాడుతుంటే చీఫ్ పోస్టులో ఉన్న అభయ్ మాత్రం పిచ్చ లైట్ తీసుకున్నాడు. అంతేనా, టీమ్ సభ్యులను కూడా ఆడొద్దని చెడగొట్టేందుకు ప్రయత్నించాడు.
ఎలిమినేషన్‌కు ప్రధాన కారణమిదే
పైగా తన టీమ్‌పై విరుచుకుపడుతున్న అవతలి టీమ్ వాళ్లపై అరవాల్సింది పోయి బిగ్‌బాస్ మీద తన ప్రతాపం చూపించాడు. బిగ్‌బాస్.. బయాస్డ్ అంటూ నానాబూతులు తిట్టాడు. ఆడలేక మద్దెల దెరువు అన్నట్లు తప్పంతా బిగ్‌బాస్ మీదకు తోసేశాడు. ఇది చూసిన జనాలు ముక్కున వేలేసుకున్నారు, తనను బయటకు పంపించడమే బెస్ట్ అనుకున్నారు.
నాగార్జున దయ చూపినా..
ఏదో అద్భుతంగా ఆడి బిగ్‌బాస్‌ను నిలదీసుంటే మెచ్చుకునేవారేమో కానీ, ఇలా చేతగానివాడిలా ఓ మూలన కూర్చుని సెటైర్లు వేయడం ఎవ్వరికీ మింగుడుపడలేదు, అందుకే నాగార్జున రెడ్ కార్డు చూపించినప్పటికీ దయ తలిచి హౌస్‌లో ఉండనిచ్చినా ప్రేక్షకులు అందుకు ఒప్పుకోలేదు. నిర్దాక్ష్యిణ్యంగా ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు. ఇక ఈ మూడువారాలకుగానూ దాదాపు రూ.6 లక్షలు సంపాదించినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment