కల్యాణ్ రామ్.. అర్జున్ సన్నాఫ్ వైజయంతి | Kalyan Ram Arjun Son Of Vyjayanthi Movie Title Poster | Sakshi
Sakshi News home page

Kalyan Ram-Vijayashanthi: మరోసారి 'వైజయంతి'గా విజయశాంతి

Published Sat, Mar 8 2025 9:22 PM | Last Updated on Sun, Mar 9 2025 10:36 AM

Kalyan Ram Arjun Son Of Vyjayanthi Movie Title Poster

కల్యాణ్ రామ్ కొత్త మూవీకి టైటిల్ ఫిక్స్ చేశారు. గత కొన్నిరోజుల నుంచి అనుకుంటున్నట్లే ఓ పేరుని టైటిల్ గా అధికారికంగా ఇప్పుడు ప్రకటించారు. ఈ మేరకు క్రేజీ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఇందులో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు.

'బింబిసార'తో హిట్ కొట్టిన కల్యాణ్ రామ్.. దీని తర్వాత రెండు ఫ్లాప్స్ చవిచూశాడు. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని ఓ మూవీ చేస్తున్నాడు. ఇందులో విజయశాంతి కీలక పాత్ర పోషిస్తుండటంతో అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు వీళ్లిద్దరూ తల్లికొడుకులుగా నటిస్తున్నారని క్లారిటీ వచ్చింది. ఈ మేరకు 'అర్జున్ సన్నాఫ్ వైజయంతీ' అనే టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: ఎన్టీఆర్ లుక్ పై ఎందుకింత ట్రోలింగ్?)

పోలీస్ డ్రస్సులో విజయశాంతి, పక్కనే కల్యాణ్ రామ్ నడుస్తున్నట్లు ఉన్న లుక్ ఆకట్టుకుంటోంది. 'ప్రతి స్త్రీ ఒక కొడుకును పెంచుకుంటుంది. వైజయంతి ఐపీఎస్ ఇక్కడ అర్జున్ అనే సైన్యాన్ని పోషిస్తోంది'' అని పేర్కొన్నారు. .

గతంలోనూ విజయశాంతి.. వైజయంతి పేరుతో ఓ సినిమా చేశారు. అందులో ఆర్మీ ఆఫీసర్ కాగా.. ఇప్పుడు పోలీస్ గా నటిస్తున్నారు. ఇందులో కల్యాణ్ రామ్ సరసన సయీ మంజ్రేకర్ హీరోయిన్. ప్రదీప్ చిలుకూరి దర్శకుడు. త్వరలో రిలీజ్ వివరాలు వెల్లడిస్తారు.

(ఇదీ చదవండి: 'రేఖాచిత్రం' సినిమా రివ్యూ (ఓటీటీ))

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement