అభయ్ నవీన్.. సిద్ధిపేట కుర్రాడు. ఇంజనీరింగ్ అయిపోగానే బ్యాంక్ ఉద్యోగం రావడంతో లైఫ్ సెటిల్ అనుకున్నాడు. అయితే అభయ్ చలాకీ మాటలు అందరికీ భలే నచ్చేవి. దీంతో కొలీగ్స్.. సినిమాల్లో ట్రై చేయొచ్చుగా అని సలహా ఇచ్చారు. ఇంతలో తనతోపాటు పనిచేసే అందరికీ ప్రమోషన్ వచ్చింది, ఒక్క తనకు తప్ప! ప్రమోషన్ రాకపోవడంతో అభయ్ హర్ట్ అయ్యాడు. ఆ మరుసటి రోజే ఉద్యోగానికి రాజీనామా చేశాడు. సినిమాల్లో ట్రై చేశాడు. బొమ్మల రామారం మూవీలో నటించాడు.
పెళ్లి చూపులు మూవీలో హీరో ఫ్రెండ్ పాత్రలో యాక్ట్ చేసి బాగా క్లిక్ అయ్యాడు. అలా కొన్ని మూవీస్ చేసిన అతడు సొంతంగా ఓ కథ రాసుకున్నాడు. అందరూ బాగుందని చెప్పేవారే కానీ ప్రొడ్యూస్ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. సినిమా రిలీజ్ చేసే సమయానికి అభయ్ తండ్రి మరణించాడు. ఆ బాధను దిగమించుకుని ప్రయత్నాలు కొనసాగించాడు. అలా మూడేండ్ల నిరీక్షణ తర్వాత 'రామన్న యూత్' రిలీజ్ చేశాడు. డైరెక్టర్‌గా ఫస్ట్ సినిమాకే మంచి మార్కులు కొట్టేశాడు. ఇప్పుడు బిగ్‌బాస్ 8వ సీజన్‌లో మూడో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టాడు. కానీ నోటిదురుసు వల్ల మూడో వారమే ఎలిమినేట్‌య్యాడు.
Comments
Please login to add a commentAdd a comment