పెళ్లాంబిడ్డ కావాలంటావ్‌, అంతలోనే హగ్గుకోసం వెంటపడ్తావ్‌! | Bigg Boss Telugu 8: Naga Manikanta Asks Huggs From Sonia Akula | Sakshi
Sakshi News home page

Naga Manikanta: 'రానురాను రాజు గుర్రం గాడిద అయిందట'. నీకో భార్య ఉందన్న విషయం మర్చిపోయావా?

Published Thu, Sep 19 2024 7:04 PM | Last Updated on Thu, Sep 19 2024 7:19 PM

Bigg Boss Telugu 8: Naga Manikanta Asks Huggs From Sonia Akula

నాకు బంధాలు, బాధ్యతలు నచ్చవు. నన్ను ఒంటరిగానే వదిలేయండి.. అని బిగ్‌బాస్‌ 8 ప్రారంభంలోనే మొరపెట్టుకున్నాడు నాగమణికంఠ. పెళ్లాం బిడ్డ దూరమయ్యారని, వారిని తిరిగి తనదగ్గరకు తెచ్చుకోవడం కోసమే ఈ షోకు వచ్చానని మొదటిరోజే ఫ్లాష్‌బ్యాక్‌ చెప్పాడు.

సింపతీ వద్దు!
నామినేషన్స్‌లోనూ అదే కథ మళ్లీ వినిపించాడు. సింపతీ గేమ్‌ ఆడుతున్నాడన్న కామెంట్స్‌ రావడంతో కాస్త పద్ధతి మార్చుకున్నాడు. ఇంటి నుంచి తన తల్లి శాలువా వచ్చినప్పుడు కూడా సింపతీ కోసమైతే తనకు ఇవ్వొద్దు అని నాగమణికంఠ కరాఖండిగా చెప్పాడు. అప్పుడతడిలో మెచ్యురిటీ చూసి జనాలు ముచ్చటపడిపోయారు.

అపరిచితుడిలా మణికంఠ
టాస్కులు వస్తే చాలు పట్టుదల, ఏకాగ్రత చూపించే అతడి అంకితభావాన్ని మెచ్చి ఓట్లు గుద్ది నామినేషన్స్‌ నుంచి సేవ్‌ చేశారు. అంతా ఓకే అనుకునేలోపే మణికంఠ అపరిచితుడిలా ప్రవర్తిస్తున్నాడు. ఒక్కోసారి ఏడుస్తూ, మరోసారి అమ్మాయిలతో సరదాలు చేస్తూ, ఇంకోసారి తన ముందు తప్పు చేస్తే సహించకుండా ఉంటూ ఎవరికీ అంతుచిక్కకుండా ప్రవర్తిస్తున్నాడు.

హగ్గుల పిచ్చి
ఈ మధ్యే యష్మి ఇబ్బందిపడుతున్న విషయాన్ని అర్థం చేసుకోకుండా ఆమెను వెనక నుంచి హగ్‌ చేసుకున్నాడు. ఈ విషయంలో తను చాలా చిరాకుపడింది. మరోసారైతే తనకెవరూ ముద్దు ఇవ్వడం లేదు, ముద్ద(తిండి) పెట్టడం లేదని తనకు తానే ఏవేవో మాట్లాడుకున్నాడు. ఈసారైతే ఏకంగా తను అక్క అని పిలిచే సోనియాను ఒక హగ్‌ కావాలని అడుక్కున్నాడు. 

నీకో భార్య ఉంది, తెలుసా?
ఎటు చూసినా కెమెరాలున్నాయని నిరాశపడుతూనే తనను హత్తుకున్నాడు. ఇతడి ప్రవర్తన అర్థమైపోయిన నైనిక మణికంఠను ముఖం పట్టుకుని అడిగేసింది. 'నువ్వు ఇక్కడ అందరితో ప్రేమలో ఉన్నావు, కానీ అంత వద్దమ్మా! నీకు భార్య ఉన్నప్పుడు తనతో మాత్రమే ప్రేమలో ఉండాలి. ఇలా అందరికీ ముద్దులు పెట్టడమేంటి? పెళ్లయ్యాక అసలు అవతలివారిని ఫ్లర్టింగే చేయకూడదు' అని క్లాస్‌ పీకింది.

ఏదైనా చేసేయొచ్చా?
చాలా తప్పుగా మాట్లాడుతున్నావని మణి అనగా.. నేను నిజం మాట్లాడుతున్నా అని నైనిక కుండ బద్ధలు కొట్టింది. దీంతో అతడు.. ఇక్కడే కదా చిల్‌ అయ్యేది.. ఇంటికెళ్లాక ఎలా కుదరదుగా అని డ్యాన్స్‌ చేశాడు. ఈ హగ్గులు, ముద్దుల గోల తగ్గించుకుంటేనే మణి ఇంకొన్నాళ్లయినా బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉండగలుగుతాడు. లేదంటే జనాలే తనను బయటకు నెట్టేయడం ఖాయం!  ఇప్పటికే మణి వీడియోలు సోషల్‌ మీడియాలో వైరలవుతుండగా.. రానురాను రాజు గుర్రం గాడిద అయిందట.. నీ పేరు నువ్వే చెడగొట్టుకుంటున్నావ్‌ అని కామెంట్లు చేస్తున్నారు.

 

 

చదవండి: బెదిరించకు, మంచిగా అడిగితే చెప్తా.. సోనియాకు నబీల్‌ కౌంటర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement