బిగ్‌బాస్ హౌస్‌లో కెరటం టీమ్ సభ్యులు నాగమణికంఠ, నిఖిల్ రేషన్ లేక అల్లాడిపోతున్నారు. నిజానికి రేషన్ కోసం పెట్టిన గేమ్‌లో వీరు గెలవాల్సింది. అయితే యష్మి సంచాలకురాలు కావడంతో ఆటను తనకు నచ్చినట్లు మార్చేసింది. తాజా ప్రోమోలో నాగ్ ఆ విషయాన్ని ప్రస్తావించాడు.
ప్లేటు తిప్పేసిన యష్మి
మరమరాలు పావుకిలో తేవాలని బిగ్‌బాస్(#BiggBosstTlugu8) ఓ టాస్క్ ఇచ్చాడు. ఎవరైతే పావుకిలోకు దగ్గర్లో పట్టుకొస్తారో వారికి పాయింట్ ఇస్తానంది యష్మి. మణికంఠ పావుకిలోకు దగ్గర్లో ప్యాక్ చేశాడు. కానీ, అతడిని గెలిపించడం ఇష్టం లేక ప్లేటు తిప్పేసింది. కరెక్ట్‌గా పావుకిలో ఉంటే మాత్రమే ఇస్తానంటూ ఎవరికీ పాయింట్ ఇవ్వలేదు. ఈ వీడియోను చూపిస్తూ యష్మి చీఫ్‌గా ఫెయిలైందంటూ తన ఫోటోను గన్‌తో కాల్చాడు.
అబ్బా.. ఏం కవరింగ్‌రా బాబూ..
దీంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ ఐదుగురు కంటెస్టెంట్లు ఉన్న టీమ్ ఆకలితో ఉండకూడదనే అలా చేశానని కవర్ చేసింది. అలాగే సంచాలకురాలిగా ప్రేరణ కన్‌ఫ్యూజ్ కావడానికి కారణం కూడా నువ్వేనని నాగ్ తనను నిందించాడు. ఇక పృథ్వీ కొన్ని అభ్యంతరకర పదాలు వాడుతున్నావని, నోరు అదుపులో పెట్టుకో అని హెచ్చరించాడు.
చదవండి: బిగ్‌బాస్ సైకాలజీ: అన్నింటినీ ప్రభావితం చేసేది గ్రూపులే!
Comments
Please login to add a commentAdd a comment