ఫ్రెండ్‌ అంటే ఇలా ఉంటారా? విష్ణు ఫేక్‌.. ఇప్పటికీ అదే చెప్తా! | Bigg Boss Telugu 8: Nainika Anasuru Cryptic Post, Comments On Power Girls, Vishnu Priya And Nabeel | Sakshi
Sakshi News home page

Nainika Anasuru: తనలో సడన్‌ మార్పు, చాలా సెల్ఫిష్‌.. ఇప్పటికీ చెప్తున్నా విష్ణు ఫేక్‌ ఫ్రెండ్‌!

Published Fri, Oct 11 2024 5:59 PM | Last Updated on Fri, Oct 11 2024 6:44 PM

Bigg Boss Telugu 8: Nainika Anasuru Post Says End of Power Girls

బిగ్‌బాస్‌ తెలుగు ఎనిమిదో సీజన్‌లో విష్ణుప్రియ, సీత, నైనిక ముగ్గురూ మంచి ఫ్రెండ్స్‌గా ఉన్నారు. హౌస్‌లో చీమ చిటుక్కుమన్నా సరే దాని గురించి ఒకరి చెవి మరొకరు కొరుక్కునేవాళ్లు. మంచి దోస్తుల్లా కలిసిమెలిసి ఉండేవాళ్లు. తమ గ్యాంగ్‌కు పవర్‌పఫ్‌ గర్ల్స్‌ అని పేరు పెట్టుకున్నారు. కానీ పోయినవారం ముగ్గురూ ఒకరినొకరు నామినేట్‌ చేసుకున్నారు. విష్ణు.. నైనికను, సీత, నైనిక.. విష్ణును నామినేట్‌ చేసింది. అదే వారం నైనిక ఎలిమినేట్‌ కూడా అయింది.

ఫ్రెండ్‌ అంటే..
ఇంటర్వ్యూలతో వారంపాటు బిజీగా ఉన్న నైనిక ఇప్పుడిప్పుడే బిగ్‌బాస్‌ అన్ని ఎపిసోడ్లు చూస్తూ వస్తోంది. నిన్న లైవ్‌ కూడా చూసిందట! ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఆసక్తికర పోస్ట్‌ షేర్‌ చేసింది. ఫ్రెండ్‌ అంటే.. గేమ్‌లో అయినా టాస్క్‌లో అయినా తప్పు చేస్తే చెప్పాలి. అంతేకానీ అప్పుడు నీ గేమ్‌ నువ్వు ఆడేసి తర్వాత దాని గురించి గాసిప్‌ చేస్తారా? నీ స్నేహితురాలిని కిందకు లాగాలని ఎలా ప్రయత్నిస్తావ్‌?

చాలా సెల్ఫిష్‌
బిగ్‌బాస్‌ హౌస్‌లో కనెక్షన్స్‌ ఎలా మారిపోతున్నాయో చూస్తున్నా.. ముందు అదే ఫ్రెండ్‌కు వెళ్లి తప్పులు చెప్తుండే, ఇప్పుడు సడన్‌గా మారిపోయింది. జనాలు చాలా సెల్ఫిష్‌ అంటూ 'ఎండ్‌ ఆఫ్‌ పవర్‌ ఆఫ్‌ గర్ల్స్‌' అని రాసుకొచ్చింది. ఇది చూసిన జనాలు.. విష్ణుప్రియ గురించే ఇలా రాసిందని అభిప్రాయపడుతున్నారు. అది నిజమేనన్నట్లు మరో వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చింది.

ఫేక్‌ ఫ్రెండ్‌
విష్ణును ఫేక్‌ ఫ్రెండ్‌ అన్నందుకు నన్ను ప్రశ్నించారు.. కానీ ఇప్పటికీ తను ఫేక్‌ ఫ్రెండ్‌ అనే చెప్తాను అని నొక్కి మరీ చెప్పింది. అలాగే నబీల్‌.. సీత గురించి వెనకాల మాట్లాడటం కూడా నచ్చలేదని పేర్కొంది. డేంజర్‌ జోన్‌లో ఉన్న సీతకు ఓట్లేయమని కోరింది.

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement