
బిగ్‌బాస్ షోలో ఆట ఎప్పుడు ఎటు మలుపు తిరుగుందో చెప్పలేం. అందుకు నైనిక పెద్ద ఉదాహరణ. షో ప్రారంభమైన కొత్తలో టాస్కుల్లో శివంగిలా ఆడి గెలిచింది. అబ్బాయిలకు గట్టి పోటీ ఇచ్చే ఏకైక కంటెస్టెంట్‌లా కనిపించింది. వయసులో చిన్నదైనా క్లాన్ (టీమ్) లీడర్‌గా ఎదిగింది. తన గ్రాఫ్ ఏ రేంజ్‌లో అయితే పైకి జుయ్‌మని ఎగబాకిందో అదే స్పీడులో కిందకు పడిపోయింది.

చిచ్చుబుడ్డిలా వెలిగి చివరకు..
క్లాన్ చీఫ్‌గా పెద్దగా పవర్ చూపించలేకపోయింది. ఆటలో డల్ అయిపోయింది. ఫ్రెండ్స్‌తో ముచ్చట్లు తప్పితే హౌస్‌లో పెద్దగా కనిపించకుండా పోయింది. నైనిక నీ గేమ్ ఎటు పోయింది? నీలో ఫైర్ ఏమైపోయింది? అని నాగార్జున సైతం ఆమె ముఖం పట్టుకుని అడిగాడు. అయినా లాభం లేకుండా పోయింది. జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

ఐదో వారం ఎలిమినేట్..
ప్రేక్షకులు ఈమెను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకునే స్థాయి నుంచి హౌస్‌లో ఉంచాల్సిన అవసరం లేదనుకునే స్థాయికి వచ్చేసింది. దీంతో ఐదో వారం ఎలిమినేట్ అయింది. ఆమె రెమ్యునరేషన్ విషయానికి వస్తే ప్రతి వారం రూ.2.20 లక్షలు అందుకుందట! ఈ లెక్కన ఐదు వారాలకుగానూ 11 లక్షల పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Comments
Please login to add a commentAdd a comment