బిగ్‌బాస్ 8 నుంచి సోనియా ఎలిమినేట్ అయిపోయింది. ఈమె బయటకొచ్చేయడంపై సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు. మరోవైపు ఐదవ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని హోస్ట్ నాగార్జున ట్విస్ట్ ఇచ్చాడు. అంటే ఈసారి రెండు వికెట్లు పడతాయనమాట. వాళ్లు ఎవరు కావొచ్చు? ఎందుకు ఇదంతా?
బోరింగ్ బిగ్‌బాస్
ఈసారితో పోలిస్తే గత సీజనే కాస్తోకూస్తో బెటర్ అనిపిస్తోంది. ఎందుకంటే ఒక్కరు కూడా సరైన కంటెంట్ ఇవ్వట్లేదు. బిగ్‌బాస్ టీమ్ కూడా ఏదో ప్రయత్నిస్తున్నారు కానీ వర్కౌట్ కావట్లేదు. ఇప్పటికే నాలుగు వారాలు పూర్తయింది కానీ రెగ్యులర్‌గా షో చూస్తే కొందరికి తప్పితే మిగతా ప్రేక్షకులు దీనివైపే చూడట్లేదు. ఇది కాస్త బిగ్‌బాస్‌కి అర్థమైనట్లుంది. అందుకే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ప్లాన్ చేశారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. ఆ మూడు స్పెషల్)
ఎలిమినేట్ వేటు
ఈ వారం నామినేషన్స్ కూడా హోరాహోరీగానే జరిగినట్లు కనిపిస్తుంది. మంటల్లో ఫొటో వేయాలి అనే కాన్సెప్ట్‌తో ఎలిమినేషన్ ప్రక్రియ జరిగింది. ఈసారి విష్ణుప్రియ, నైనిక, ఆదిత్య ఓం, మణికంఠ, నబీల్, నిఖిల్ నామినేషన్స్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లలో ఆదిత్య, నైనికకి తప్పితే మిగిలిన వాళ్లకు కాస్తోకూస్తో ఫ్యాన్ బేస్ ఉంది. ఓట్లు కూడా బాగానే పడుతున్నాయి
ఆ ఇద్దరు వీళ్లేనా?
అలా ఆదిత్య, నైనికలో ఒకరిని వారం మధ్యలో పంపేస్తారు. మరొకరిని వీకెండ్‌లో పంపించేస్తారనిపిస్తోంది. వచ్చే వారం దసరా సందర్భంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉన్నాయి. అందుకే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ప్లాన్ చేశారు. ఇక వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చే వాళ్లలో ముక్కు అవినాష్, హరితేజ, రోహిణి, నయని పావని, గౌతమ్ కృష్ణ పేర్లు వినిపిస్తున్నాయి. యాంకర్ రవి కూడా ఈ లిస్టులో ఉండొచ్చని అంటున్నారు. వీటిపై క్లారిటీ రావాలంటే మరో వారం ఆగితే సరిపోద్ది.
(ఇదీ చదవండి: సోనియా ఎలిమినేట్, ఏడ్చిన నిఖిల్.. చివర్లో పెద్ద ట్విస్ట్ ఇచ్చిన నాగ్!)
TWIST - There is a Mid-Week Elimination this week!#BiggBossTelugu8 pic.twitter.com/yaSu22gXPx
— TeluguBigg (@TeluguBigg) September 29, 2024
Comments
Please login to add a commentAdd a comment