లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు మధ్యంతర బెయిల్ విషయంలో ఎదురుదెబ్బ తగలనుంది. అక్టోబర్ 8న జాతీయ అవార్డు అందుకునేందుకు బెయిల్ కోసం జానీ మాస్టర్ పిటీషన్ వేశారు. దీంతో రంగారెడ్డి కోర్టు ఈనెల 6 నుంచి 10 వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఇప్పుడా బెయిల్ రద్దు అయ్యే ఛాన్స్ ఉంది.
2022లో తమిళ సినిమా 'తిరుచిత్రబలం' తెలుగులో 'తిరు' చిత్రానికిగాను జాని మాస్టర్‌కు ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డును కేంద్రప్రభుత్వం ప్రకటించింది. అయితే జానీ మీద పోక్సో చట్టం కింద వచ్చిన ఆరోపణలతో కేసు నమోదు అయింది. ఈ కారణంతో అవార్డును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు జాతీయ అవార్డుల కమిటీ ప్రకటించింది. దీంతో జానీమాస్టర్‌కు మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని రంగారెడ్డి కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. విచారణ అనంతరం ఆయన బెయిల్ రద్దు చేసే అవకాశమే ఎక్కువగా ఉంది. తన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న యువతిపై ఆయన లైంగిక దాడి చేశారని ఫిర్యాదుతో జానీ మాస్టర్ రిమాండ్‌లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment