Rana Rajinikanth New Movie Shooting Will Start Soon | బ్లాక్‌బస్టర్‌ కాంబినేషన్‌: త్వరలో రజనీ ‘రాణా’! - Sakshi
Sakshi News home page

బ్లాక్‌బస్టర్‌ కాంబినేషన్‌: త్వరలో రజనీ ‘రాణా’!

Published Wed, Feb 3 2021 8:33 AM | Last Updated on Wed, Feb 3 2021 2:38 PM

Rajinikanth And Director KS Ravikumar New Movie Rana Will Come On Sets - Sakshi

రజనీకాంత్, దర్శకుడు కేఎస్‌ రవికుమార్‌ లది బ్లాక్‌బస్టర్‌ కాంబినేషన్‌. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాల్లో ‘నరసింహా, ముత్తు’ వంటి బ్లాక్‌బస్టర్లు ఉన్నాయి. మళ్లీ ఈ ఇద్దరూ ఓ సినిమా కోసం కలవబోతున్నారని కోలీవుడ్‌ టాక్‌. 2010లో ‘రాణా’ అనే భారీ ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టారు కేఎస్‌ రవికుమార్‌. రజనీకాంత్‌ లీడ్‌ రోల్‌లో అమితాబ్‌ బచ్చన్, దీపికా పదుకోన్‌ ముఖ్య పాత్రల్లో ఈ సినిమా ప్రారంభం అయింది. రజనీకాంత్‌ అనారోగ్యం వల్ల ఆ ప్రాజెక్ట్‌ ఆగిపోయింది. తాజాగా ఆ ప్రాజెక్ట్‌ను మళ్లీ సెట్స్‌ మీదకు తీసుకెళ్లాలనుకుంటున్నారు. ఇటీవలే ఈ ప్రాజెక్ట్‌ గురించి రజనీకాంత్‌తో చర్చలు జరిపినట్టు కేయస్‌ రవికుమార్‌ పేర్కొన్నారు. 2022లో ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లే అవకాశం ఉందని కోలీవుడ్‌ టాక్‌. ‘రాణా’ తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అని పలు సందర్భాల్లో కేయస్‌ రవికుమార్‌ పేర్కొన్నారు. మరి ఈ డ్రీమ్‌ నెరవేరుతుందా? చూడాలి. ప్రస్తుతం శివ దర్శకత్వంలో ‘అన్నాత్తే’ చిత్రం చేస్తున్నారు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement