
పురియాద పుదిర్‌గా విజయ్‌సేతుపతి చిత్రం
పురియాద పుదిర్ ఈ పేరు ఇంతకు ముందు విన్నట్లుంది కదూ. ఎస్.1990లో దర్శకుడు కేఎస్.రవికుమార్ మెగాఫోన్ పట్టిన తొలి చిత్రం పేరు ఇది. ఈ పేరుతో తాజాగా మరో చిత్రం తెరపైకి రానుంది. విజయ్‌సేతుపతి హీరోగా నటించిన చిత్రం మెల్లిసై ఇప్పుడు పురియాద పుదీర్‌గా మారింది. గాయత్రి కథానాయకిగా నటించిన ఈ చిత్రాన్ని రెబల్ స్టూడియోస్ సంస్థ నిర్మించింది. రంజిత్ జయకొండి దర్శకత్వం వహించిన ఈ చిత్ర విడుదల హక్కుల్ని జేఎస్‌కే ఫిలిం కార్పొరేషన్ సంస్థ అధినేత జే.సతీష్‌కుమార్ పొందారు.
ఆయన చిత్ర టైటిల్ మార్చడం తదితర వివరాలను తెలుపుతూ ఒక మంచి బలమైన కథా చిత్రానికి మెల్లిసై అనే సాఫ్ట్ టైటిల్ నప్పదన్నారు. అంతే కాకుండా విజయ్‌సేతుపతి వంటి క్రేజ్ ఉన్న నటుడి చిత్రానికి ఆసక్తిని రేకెత్తించే టైటిల్ ఉంటే బాగుంటుందన్నారు. అందుకే సూపర్‌గుడ్ ఫిలింస్ అధినేత ఆర్‌బీ.చౌదరికి చెందిన పురియాద పుదీర్ టైటిల్‌ను ఆయన అనుమతి పొంది ఈ చిత్రానికి పెట్టినట్లు తెలిపారు.
వినూత్న కథ కథనాలతో కూడిన ఈ చిత్రం విజయ్‌సేతుపతి ఇమేజ్‌ను మరింత పెంచడంతో పాటు తమ సంస్థకు కచ్చితంగా మరో విజయవంతమైన చిత్రంగా నిలుస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. పురియాద పుదిర్ చిత్రాన్ని నవంబర్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు.