
లింగా క్లైమాక్స్ అది కాదు
లింగా చిత్ర క్లైమాక్స్ అదికాదు అని మనసు విప్పారు ఈ చిత్ర దర్శకుడు కేఎస్.రవికుమార్. ఈయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ముడింజా ఇవనై పిడి. నాన్‌ఈ చిత్రం ఫేమ్ కిచ్చా సుధీప్ కథానాయకుడిగా తమిళంలో పరిచయం అవుతున్న చిత్రం ఇది.ఆయనకు జంటగానిత్యామీనన్ నటించిన ఈ చిత్రం తమిళం,కన్నడం భాషల్లో తెరకెక్కనుంది. శుక్రవారం రెండు భాషల్లోనూ విడుదల కానుంది.దర్శకుడు కేఎస్.రవికుమార్ బుధవారం ఉదయం తను కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ తాను ఈ చిత్రం ద్వారా తొలిసారిగా కన్నడ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నానన్నారు.
తానీ చిత్రాన్ని అంగీకరించడానికి కారణం నటుడు కిచ్చా సుధీప్‌నే నన్నారు. ఇది కమర్శియల్ అంశాలతో కూడిన మాస్ ఎంటర్‌టెయినర్ అని తెలిపారు. తన చిత్రాల్లో కమర్శియల్ అంశాలతో పాటు క్లాసిక్ మిక్స్ అయినా తాను దర్శకుడినేన్నారు. తన తొలి చిత్రం పురియాద పుదిర్ చిత్రమని అది ఒక కన్నడ చిత్రానికి రీమేక్ అనీ, నిర్మాత ఆర్‌వీ.చౌదరి తనను ఒరిజినల్ చిత్రం చూసి తమిళంకు తగ్గట్టుగా స్క్రీన్‌ప్లే రాయమని చెప్పారన్నారు. ఇకపోతే చిత్ర జయాపజయాలు ఎవరి చేతులోనూ ఉండవన్నారు. అదే విధంగా వరుసగా విజయాలు సాధించిన వారు లేరని అన్నారు.
లింగా చిత్ర ప్రస్థావన తీసుకొస్తున్నారు కాబట్టి చెబుతున్నానని, ఆ చిత్రానికి తాము ముందుగా ప్లాన్ చేసింది వేరని అన్నారు. క్లైమాక్స్ ఫైట్‌లో గ్లైడర్‌ను ఉపయోగించి భారీగా చిత్రీకరించాలను కున్నామని, అయితే అందుకు సీజీ వర్క్ చాలా ఆలస్యం అవుతుందని చెప్పడంతో రజనీకాంత్ బైక్ నుంచి జంప్ చేసి గాలిలో తేలుతున్న బెలూన్ మీదకు దూకి అందులోని విలన్‌తో ఫైట్ చేయడంతో కామెడీ అనిపించిందని అన్నారు.
సినిమా గురించి ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని, విమర్శలు రాసే వారు కూడా ఇది తన అభిప్రాయం అని పేర్కొంటే బాగుంటుందని అన్నారు. కిచ్చా సుధీప్ మంచి నటుడే కాదని మంచి మానవతావాదిగా ఉన్నారని దర్శకుడు కేఎస్.రవికుమార్ పేర్కొన్నారు. తెలుగులో మళ్లీ దర్శకత్వం వహించే ఆలోచన ఉందా? అన్న ప్రశ్నకు మంచి కథ, టీమ్ కుదిరితే తప్పకుండా చేస్తానని తెలిపారు. చిరంజీవి హీరోగా స్నేహం కోసం చిత్రం చేసిన తరువాత ఆయన చాలా సార్లు మనం మళ్లీ కలిసి పని చేద్దాం అని అంటుంటారని అన్నారు.