Powerful Role
-
చివరి షెడ్యూల్ షురూ
‘బంగార్రాజు’ వంటి హిట్ చిత్రం తర్వాత అక్కినేని నాగచైతన్య, కృతీ శెట్టి జంటగా నటిస్తున్న ద్వితీయ చిత్రం ‘కస్టడీ’. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు–తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. కాగా ఈ చిత్రం చివరి షెడ్యూల్‌ని శుక్రవారం ప్రారంభించారు. ‘‘నాగచైతన్య కెరీర్లో భారీ బడ్జెట్ చిత్రాల్లో మా ‘కస్టడీ’ ఒకటి. కొత్త సంవత్సరం కానుకగా విడుదలైన గ్లింప్స్‌లో నాగచైతన్య ఫెరోషియస్ లుక్‌లో ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తుండగా, ప్రియమణి పవర్ఫుల్ రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న చివరి షెడ్యూల్లో ప్రధాన తారాగణంపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. ఈ సినిమాని ఈ ఏడాది మే 12న విడుదల చేయనున్నాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, యువన్ శంకర్ రాజా, కెమెరా: ఎస్ఆర్ కదిర్, సమర్పణ: పవన్ కుమార్. -
రాష్ట్రాభివృద్ధిలో మీడియా పాత్ర కీలకం
తిరుపతి కల్చరల్ : మీడియా చాలా శక్తివంతమైందని, రాష్ట్ర వికాసానికి తన శక్తిని వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ కోరారు. ఓ ప్రైవేటు హోటల్లో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్స్ ఫోరం చిత్తూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రాభివృద్దిలో మీడియా పాత్ర అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. ఏపీజేఎఫ్ జర్నలిస్టుల సంక్షేమం కోసమే కాకుండా రాష్ట్రాభివృద్ధికి ప్రజలను చైతన్యవంతులు చేస్తుందన్నారు. దేశంలో ఎక్కడా ఏ జర్నలిస్టు సంఘం పని చేయని విధంగా రాష్ట్రాభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేయాలన్నారు. ఇందులో భాగంగా ఏపీజేఎఫ్ ఏదో ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలన్నారు. రాష్ట్ర విభజన అన్యాయంగా, అసంబంద్ధంగా జరిగిందన్నారు. తెలంగాణకు ఆస్తులు, అంధ్రకు అప్పులు ఇచ్చారని, రాష్ట్ర విభజన నాటికి 16 వేల కోట్లు లోటు బడ్జెట్‌ను మిగిల్చారని తెలిపారు. 14వ ఆర్థిక సంఘం అంచనాల ప్రకారం 2020 నాటికి కూడా రూ. 2500 కోట్లు లోటు బడ్జెట్లోనే మన రాష్ట్రం ఉంటుందన్నారు. ఈ పరిస్థితుల్లో పాలనాదక్షుడైన చంద్రబాబు సీఎం కావడంతో విభజన జరిగిన ఆరు నెలల్లోనే విభజన సమస్యలను మరిచిపోగలిగామన్నారు. 2050 నాటికి భావితరాలు గర్వించేలా గొప్ప రాష్ట్రం రూపుదిద్దుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. మీడియా నిర్మాణాత్మకమైన విమర్శలు చేయాలని చెప్పారు. ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీడియా కీలపాత్ర పోషిస్తోందన్నారు. ఏపీజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.గిరిధర్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కృపవరం, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి మోహన్‌ప్రసాద్ పాల్గొన్నారు. –––––––––– -
విన్నారా!
రమ్యకృష్ణ కెరీర్లో ఎప్పటికీ చెప్పుకోదగ్గ విధంగా నిలిచిపోయిన పాత్రల్లో ‘నరసింహ’ చిత్రంలోని నీలాంబరి పాత్ర ఒకటి. ఈ పవర్ఫుల్ రోల్‌ను అద్భుతంగా చేశారామె. ఈ పాత్రను రమ్యకృష్ణ మినహా వేరే ఎవరూ ఇంత బాగా చేయలేరంటే అతిశయోక్తి కాదు. ఈ నీలాంబరి పాత్ర గురించి ఓ తమిళ పత్రిక రమ్యకృష్ణను ఓ ప్రశ్న అడిగింది. ఒకవేళ ‘నరసింహ’ చిత్రాన్ని రీమేక్ చేస్తే, అందులో నీలాంబరి పాత్రను ఎవరు చేస్తే బాగుంటుందనుకుంటున్నారు? అని ఆ పత్రికా విలేకరి అడిగితే - ‘‘ఆ పాత్రలో వేరే ఎవర్నీ ఊహించుకోలేకపోతున్నాను. రీమేక్‌లో కూడా నేనే ఉండాలని కోరుకుంటున్నాను. అవకాశం ఇస్తే నేనే నటిస్తా’’ అని చెప్పారు.