చివరి షెడ్యూల్‌ షురూ | Naga Chaitanya Custody Last Schedule Begins | Sakshi
Sakshi News home page

చివరి షెడ్యూల్‌ షురూ

Published Sat, Jan 7 2023 4:03 AM | Last Updated on Sat, Jan 7 2023 4:03 AM

Naga Chaitanya Custody Last Schedule Begins - Sakshi

‘బంగార్రాజు’ వంటి హిట్‌ చిత్రం తర్వాత అక్కినేని నాగచైతన్య, కృతీ శెట్టి జంటగా నటిస్తున్న ద్వితీయ చిత్రం ‘కస్టడీ’. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో తెలుగు–తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ చివరి దశలో ఉంది. కాగా ఈ చిత్రం చివరి షెడ్యూల్‌ని శుక్రవారం ప్రారంభించారు. ‘‘నాగచైతన్య కెరీర్‌లో భారీ బడ్జెట్‌ చిత్రాల్లో మా ‘కస్టడీ’ ఒకటి.

కొత్త సంవత్సరం కానుకగా విడుదలైన గ్లింప్స్‌లో నాగచైతన్య ఫెరోషియస్‌ లుక్‌లో ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో అరవింద్‌ స్వామి విలన్‌ పాత్రలో నటిస్తుండగా, ప్రియమణి పవర్‌ఫుల్‌ రోల్‌ చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న చివరి షెడ్యూల్‌లో ప్రధాన తారాగణంపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. ఈ సినిమాని ఈ ఏడాది మే 12న విడుదల చేయనున్నాం’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, యువన్‌ శంకర్‌ రాజా, కెమెరా: ఎస్‌ఆర్‌ కదిర్, సమర్పణ: పవన్‌ కుమార్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement