final stage
-
Lok Sabha Election 2024: చివరి పంచ్ ఎవరిదో!
దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించే మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. మొత్తం 48 స్థానాలకు గాను నాలుగు విడతల్లో 35 సీట్లకు ఎన్నిక ముగిసింది. మిగతా 13 నియోజకవర్గాలకు ఐదో విడతలో భాగంగా ఈ నెల 20న పోలింగ్ జరగనుంది. రెండుగా చీలిన శివసేన, ఎన్సీపీల్లో అసలు పారీ్టగా ప్రజలు దేన్ని గుర్తిస్తున్నదీ ఈ ఎన్నికలతో తేలనుంది. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ పాటిల్, సీఎం ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్, ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ తదితరులు బరిలో ఉన్నారు. రాష్ట్రంలో తుది దశలో పోలింగ్ జరగనున్న కీలక స్థానాలపై ఫోకస్... నాసిక్ ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం, ఎగుమతి సుంకాల పెంపు తదితరాలపై ఇక్కడి రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇది అభ్యర్థులందరికీ పరీక్షగా మారింది. అధికార మహాయుతి కూటమి నుంచి శివసేన (షిండే) అభ్యర్థి హేమంత్ గాడ్సే బరిలో ఉన్నారు. విపక్ష ఎంవీఏ కూటమి నుంచి శివసేన (ఉద్ధవ్) అభ్యర్థి రాజాభావు వాజే పోటీలో ఉన్నారు. దేశవ్యాప్తంగా 111 ఆశ్రమాలు, ఏడు గురుకులాలతో ప్రజల్లో బాగా పేరున్న శాంతిగిరి మహారాజ్ ఇండిపెండెంట్‌గా వీరిద్దరికీ పెను సవాలు విసురుతున్నారు. ఉల్లి రైతులను ప్రసన్నం చేసుకునేందుకు గాడ్సే, వాజే శ్రమిస్తున్నారు. సీఎం షిండే ముమ్మరంగా ప్రచారం చేశారు. వంచిత్ బహుజాన్ అగాడీ నుంచి కరణ్ గైకర్ కూడా బరిలో ఉండటంతో చతుర్ముఖ పోరు నెలకొంది.పాల్గఢ్ ఈ ఎస్టీ రిజర్వ్డ్ స్థానం నుంచి మహాయుతి కూటమి తరఫున బీజేపీ అభ్యర్థి హేమంత్ విష్ణు సవర బరిలో ఉన్నారు. శివసేన (ఉద్ధవ్) నుంచి భారతి భరత్ కామ్డి పోటీ చేస్తున్నారు. బీఎస్పీ, వంచిత్ బహుజన్ అగాడీ, స్థానికంగా బలమున్న బహుజన్ వికాస్ అగాడీ కూడా పోటీలో ఉన్నాయి. దాంతో బహుముఖ పోటీ నెలకొంది. నిరుద్యోగం, వైద్య సౌకర్యాల లేమి ఇక్కడి ప్రధాన సమస్యలు. ఈ ప్రాంతానికి చెందిన ఓ మత్స్యకారుడు ఇటీవలే పాక్ జైల్లో మరణించడం, ఇక్కడ ఇద్దరు సాధువులను కొట్టి చంపడం ఎన్నికల అంశాలుగా మారాయి. ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి, బీజేపీ అగ్ర నేతలు సాధువుల హత్యను పదేపదే ప్రస్తావించారు. రూ.76,000 కోట్లతో ప్రతిపాదించిన వాద్వాన్ పోర్టుపై స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. శివసేన (షిండే)కు చెందిన సిట్టింగ్ ఎంపీ రాజేంద్ర దేద్య గవిట్ బీజేపీలో చేరడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం. భివండి బీజేపీ సిట్టింగ్ ఎంపీ, కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ పాటిల్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 2014 ఎన్నికల్లోనూ ఇక్కడ ఆయనే గెలిచారు. ఈసారి హ్యాట్రిక్ కోసం ప్రయతి్నస్తున్నారు. ఎన్సీపీ (ఎస్పీ) నుంచి సురేశ్ మాత్రే (బాల్యా మామ), స్వతంత్ర అభ్యర్థి నీలేశ్ సంబారే పాటిల్‌కు గట్టి పోటీ ఇస్తున్నారు. నియోజకవర్గంలోని 21 లక్షల ఓటర్లలో 5 లక్షల మంది ముస్లింలే. 4.5 లక్షలు కుంబి, 3 లక్షలు అగ్ర వర్గీయులున్నారు. పాటిల్, మాత్రే ఇద్దరూ అగ్ర కులస్థులు. సంబారే కుంబి వర్గానికి చెందినవారు. మాత్రే గెలుపు కోసం శరద్ పవార్ తన పలుకుబడినంతా ఉపయోగిస్తున్నారు. తమకు బాగా పట్టున్న ఈ స్థానాన్ని ఎన్సీపీకి ఇవ్వడంపై కాంగ్రెస్ శ్రేణులు అసంతృప్తితో ఉన్నాయి. ఇది మాత్రే విజయావకాశాలపై ప్రభావం చూపేలా ఉంది.ముంబై నార్త్ ఇక్కడ కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్‌ను బీజేపీ బరిలోకి దింపింది. రాజ్యసభ ఎంపీగా ఉన్న ఆయన ఎంపికకు ముందు గట్టి కసరత్తే చేసింది. గోయల్ కోసం తొలుత దక్షిణ ముంబై స్థానాన్ని పరిశీలించినా చివరికి ముంబై నార్త్ వైపే మొగ్గుచూపించింది. ఇది ఒకప్పుడు కాంగ్రెస్‌కు గట్టి పట్టున్న స్థానం. 1989లో బీజేపీ నుంచి రాం నాయక్ విజయం సాధించాక పరిస్థితులు మారాయి. 2008లో లోక్‌సభ స్థానాల పునరి్వభజన తర్వాత ఇక్కడ మరాఠీయేతర మధ్య తరగతి ఓటర్లు పెరిగారు. దాంతో బీజేపీ మరింత బలపడింది. 2014లో కాంగ్రెస్ అభ్యర్థి సంజయ్ నిరుపమ్‌పై బీజేపీ నేత గోపాల్ చిన్నయ్య శెట్టి 4.47 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో నెగ్గారు. 2019 ఎన్నికల్లో ఆయన మెజారిటీని మరింతగా పెంచుకున్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి, నటి ఊర్మిళా మతోండ్కర్‌ను ఓడించారు. ఈసారి కాంగ్రెస్ నుంచి భూషణ్ పాటిల్ పోటీ చేస్తున్నారు.కల్యాణ్ అధికార మహాయుతి కూటమి నుంచి శివసేన (షిండే) అభ్యరి్థగా సీఎం కుమారుడు శ్రీకాంత్ షిండే బరిలో ఉండటంతో ఆసక్తి నెలకొంది. 2014, 2019 ఎన్నికల్లోనూ శివసేన టికెట్‌పై శ్రీకాంత్ ఎన్సీపీని ఓడించారు. విపక్ష అగాడీ కూటమి నుంచి శివసేన (ఉద్ధవ్) అభ్యరి్థగా వైశాలి దారేకర్ రాణే బరిలో నిలిచారు. దాంతో ఇంతకాలంగా శివసేనను ఆదరిస్తున్న ఓటర్లకు పరీక్ష ఎదురైంది. సంప్రదాయ ఓటర్లు ఈ రెండు పారీ్టల మధ్య చీలితే ఎవరు గెలుస్తారన్న ఆసక్తి నెలకొంది. గత రెండుసార్లూ రెండో స్థానంలో నిలిచిన ఎన్సీపీ (ఎస్పీ) మద్దతు ఉద్దవ్ వర్గం అభ్యరి్థకి కలిసొచ్చే అంశం. ఎంపీగా నియోజకవర్గ అభివృద్ధికి తన కుమారుడు ఎంతో చేశాడని, ఈసారీ గెలిపిస్తే మిగతా పనులన్నీ పూర్తి చేస్తాడని సీఎం షిండే భరోసా ఇస్తున్నారు. థానే ఇక్కడ రెండు శివసేనల మధ్య ముఖాముఖి పోరు నెలకొంది. ఇతరులు పోటీలో ఉన్నా నామమాత్రమే. 2019 ఎన్నికల్లో శివసేన అభ్యర్థి రాజన్ బాబూరావు విచారే 4.12 లక్షల ఓట్ల మెజారిటీతో ఎన్సీపీ నేత ఆనంద్ పరాంజపేపై ఘన విజయం సాధించారు. ఈ విడత విచారే శివసేన (ఉద్ధవ్) అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఇక మహాయుతి కూటమి నుంచి శివసేన (షిండే) అభ్యర్థిగా నరేశ్ గణపత్ మాస్కే బరిలో ఉన్నారు. విచారే ముందునుంచీ ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. మాస్కేకు మద్దతుగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సేన, బీజేపీ అగ్రనేతలు ప్రచారం నిర్వహించారు. కానీ ఆయన అభ్యరి్థత్వాన్ని బీజేపీ కార్యకర్తలు వ్యతిరేకిస్తుండడం ప్రతికూలంగా మారింది. విచారే, మాస్కే ఇద్దరూ థానే మేయర్లుగా పనిచేసిన వారే. కానీ నగర పరిసర ప్రాంతాలు సరైన అభివృద్ధికి నోచుకోలేదన్న అసంతృప్తి స్థానికుల్లో బాగా ఉంది.ఐదో విడత పోలింగ్ జరిగే స్థానాలుధూలే, దిండోరి, నాసిక్, పాల్ఘర్, భివండి, కల్యాణ్, థానే, ముంబై నార్త్, ముంబై నార్త్–వెస్ట్, ముంబై నార్త్–ఈస్ట్, ముంబై నార్త్–సెంట్రల్, ముంబై సౌత్–సెంట్రల్, ముంబై సౌత్ – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎల్1కు చేరువలో ఆదిత్య : ఇస్రో చైర్మన్
తిరువనంతపురం: సూర్యున్ని అధ్యయనం చేయడానికి నింగిలోకి వెళ్లిన వ్యోమనౌక ఆదిత్య ఎల్-1ప్రయాణం తుది దశకు చేరుకుందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 7కల్లా ఆదిత్య వ్యోమనౌక ఎల్ 1 పాయింట్ చేరుకునేందుకు కావల్సిన తుది ఏర్పాట్లు పూర్తవుతాయని చెప్పారు. తిరువనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సోమనాథ్ ఆదిత్య ఎల్1 అప్డేట్స్ను వెల్లడించారు. ‘ఆదిత్య మిషన్ గమ్యాన్ని చేరుకునేందుకు అతి దగ్గరలో ఉంది. ఎల్ 1 పాయింట్‌కు వెళ్లేందుకు తుది ఏర్పాట్లు చేస్తున్నాం’ అని సోమనాథ్ తెలిపారు.సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్1 ను శ్రీహరికోటలోని సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించారు. 125 రోజుల్లో 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ఆదిత్య స్పేస్ క్రాఫ్ట్ సూర్యునికి అతి సమీపంలో ఉన్న లాంగ్రేజియన్ పాయింట్(ఎల్-1)ను చేరుకునే లక్ష్యంతో పంపించారు. ఎల్-1పాయింట్ చేరకున్న తర్వాత అక్కడి నుంచి ఆదిత్య సూర్యుని చిత్రాలు తీసి భూమికి పంపనుంది. ఇవి సూర్యున్ని మరింత లోతుగా అధ్యయనం చేయడంలో ఇస్రోకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఇదీచదవండి..తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించిన మోదీ -
Rajasthan Election 2023: హామీలా, హిందుత్వా?
ఎడారి రాష్ట్రం రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల పోరు చివరి దశకు చేరుకుంది. ఇక్కడ పాలక కాంగ్రెస్, విపక్ష బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. నెల రోజులకు పైగా రాష్ట్రవ్యాప్తంగా పోటాపోటీ ప్రచారంతో ఇరు పార్టీలూ హోరెత్తించాయి. బీజేపీ ప్రచారానికి స్వయంగా ప్రధాని మోదీయే సారథ్యం వహించి కాలికి బలపం కట్టుకుని సుడిగాలి పర్యటనలు చేశారు. కాంగ్రెస్ తరఫున ప్రచార భారాన్ని ప్రధానంగా సీఎం అశోక్ గెహ్లోతే మోశారు. మోదీ మేనియాకు ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చే ఆనవాయితీ తోడై తాము అందలమెక్కుతామని బీజేపీ నమ్మకం పెట్టుకుంది. గెహ్లోత్ వరుసబెట్టి ప్రకటిస్తూ వచి్చన జనాకర్షక పథకాలు ఆ ఆనవాయితీకి ఈసారి అడ్డుకట్ట వేసి తమను మరోసారి గెలిపిస్తాయని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే పోలింగ్ తేదీ సమీపించినా ఓటరు నాడి మాత్రం ఎవరికీ అందడం లేదు. ఏ పార్టికీ అనుకూలంగా స్పష్టమైన ‘వేవ్’ కనిపించడం లేదు. దాంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇరు పార్టిలూ సర్వశక్తులూ ఒడ్డాయి. కాంగ్రెస్ ప్రధానంగా ఎన్నికల హామీలపై ఆధారపడగా బీజేపీ ఎప్పట్లాగే హిందుత్వ కార్డును వీలైనంతగా ప్రచారంలో పెట్టింది... పథకాలకు థమ్సప్... గెహ్లోత్ ప్రభుత్వ పనితీరుపై క్షేత్రస్థాయిలో పెద్దగా వ్యతిరేకత కన్పించకపోవడం విశేషం. సంక్షేమ పథకాలపై ప్రజల్లో బాగా సంతృప్తి ఉంది. సంక్షేమ పథకాలు పేదలను ఎంతగానో ఆదుకున్నాయని బీజేపీ మద్దతుదారులు కూడా అంగీకరిస్తుండటం విశేషం! చిరంజీవి బీమా యోజన లక్షల మంది పేద, మధ్య తరగతి కుటుంబీకులకు ఎంతో ఆదుకుందని సవాయ్ మధోపూర్‌లో పవన్ మీనా అనే పాన్ షాప్ యజమాని చెప్పుకొచ్చారు. ‘‘నేను బీజేపీ మద్దతుదారును. కానీ ఈసారి కాంగ్రెస్ పాలనలో ప్రజలకు జరిగిన మంచి కొట్టొచ్చినట్టు కని్పస్తూనే ఉంది’’ అన్నారాయన. కాకపోతే ఇదంతా ఓట్ల రూపంలో బదిలీ అవుతుందా అన్నది చూడాలంటూ ముక్తాయించారు. 10 లక్షల ఉద్యోగాలతో పాటు తక్షణం కులగణన చేపట్టి, మైనారిటీలకు జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కలి్పస్తామని కూడా కాంగ్రెస్ తాజా మేనిఫెస్టోలో చెప్పింది. ఇవన్నీ ఓటర్లను ఏ మేరకు ప్రభావితం చేస్తాయో చూడాల్సిందే. శాంతిభద్రతలపై పెదవి విరుపు... పథకాల సానుకూలతకు శాంతిభద్రతల విషయంలో జనంలో నెలకొన్న తీవ్ర అసంతృప్తి బాగా గండి కొట్టేలా కనిపిస్తోంది. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి మాత్రం దారుణంగా దిగజారిందని మెజారిటీ ప్రజలు వాపోతుండటం ప్రమాద ఘంటికేనంటున్నారు. ముఖ్యంగా ఇస్లాంను కించపరిచాడంటూ గతేడాది ఉదయ్‌పూర్‌లో ఓ టైలర్ షాప్ యజమానిని పట్టపగలే తల నరికి చంపిన తీరును ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. దానికి తోడు మహిళలపై అకృత్యాలు ఎన్నడూ లేనంతగా పెరిగిపోయిన తీరుపైనా జనం గగ్గోలు పెడుతున్నారు. పథకాల ఫలాలు అందరికీ అందుతున్నా ప్రాణాలకే భద్రత లేకపోతే ఏం లాభమని కోటాలో బట్టల షాపు నడుపుతున్న వినోద్ చేసిన వ్యాఖ్యలు జనాభిప్రాయానికి అద్దం పట్టేవే. ‘‘గెహ్లోత్ ప్రభుత్వం బాగానే పని చేసింది. కానీ మార్పు అవసరం. బీజేపీ వస్తే బాగుంటుంది’’ అన్నారాయన. బీజేపీకి ఓటేయడం చాలా అవసరమని కోటాకు చెందిన అమృత్ చౌహాన్ అనే ఆటోడ్రైవర్ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ ధోరణినే ప్రతిఫలించాయి. ‘‘శాంతిభద్రతలను చక్కదిద్దాలంటే యూపీ తరహా పాలన కావాల్సిందే. అప్పుడే ప్రధాని మోదీ చెబుతున్న హిందూ రాష్ట్ర స్థాపన సాధ్యం. కాంగ్రెస్ కేవలం ఒక్క సామాజిక వర్గానికే కొమ్ము కాస్తూ వస్తోంది’’ అని చౌహాన్ చెప్పుకొచ్చారు. ఈసారీ 199 సీట్లలోనే పోలింగ్! రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి గురువారం సాయంత్రంతో తెర పడనుంది. పోలింగ్ శనివారం జరుగుతుంది. ఎన్నికల ఫలితాలు మరో నాలుగు రాష్ట్రాలతో కలిపి డిసెంబర్ 3న వెల్లడవుతాయి. అయితే రాష్ట్రంలో 200 అసెంబ్లీస్థానాలకు గాను 199 స్థానాల్లో మాత్రమే పోలింగ్ జరగనుంది! కరణ్‌పూర్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్‌సింగ్ కున్నర్ మృతితో అక్కడ పోలింగ్ వాయిదా పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇలా 199 స్థానాల్లోనే పోలింగ్ జరుగుతుండటం రాష్ట్ర చరిత్రలో ఇది వరుసగా మూడోసారి కావడం విశేషం! బీఎస్పీ అభ్యర్థుల మృతి కారణంగా 2018లో, 2013 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇలాగే ఒక అసెంబ్లీ స్థానంలో పోలింగ్ నిలిచిపోయింది. -
Uttarakhand Tunnel Crash: తుది దశకు రెస్క్యూ ఆపరేషన్
ఉత్తరకాశీ/న్యూఢిల్లీ: పది రోజులకుపైగా సిల్క్యారా సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను సురక్షితంగా బయటకుతెచ్చే డ్రిల్లింగ్ పనులు తుది దశకు చేరుకున్నాయి. దేశ, విదేశీ నిపుణుల పర్యవేక్షణలో కొనసాగుతున్న సహాయక, డ్రిల్లింగ్ పనుల్లో భారీ పురోగతి కనిపిస్తోందని అక్కడి వర్గాలు వెల్లడించాయి. ఉత్తరాఖండ్‌లోని ఛార్‌ధామ్ ప్రాజెక్టులో భాగంగా సిల్క్యారా వద్ద కొండను తవ్వుతుండగా లోపల 57 మీటర్లమేర సొరంగం కూలిందని సహాయక బృందాలు అంచనావేస్తున్నాయి. ఇందులో ఇప్పటికే 39 మీటర్లమేర తవ్వగా బుధవారం సాయంత్రానికి మరో ఆరు మీటర్ల మేర డ్రిల్లింగ్ చేసి ‘సహాయక’పైపును విజయవంతంగా జొప్పించారు. వీరి అంచనా ప్రకారం మరో 12 మీటర్లు తవ్వితే కారి్మకులు చిక్కుకున్న చోటుకు పైపు చేరుకోవచ్చు. దాదాపు మీటరు వ్యాసమున్న ఈ స్టీల్ పైపులోంచి కారి్మకులను బయటకు తీసుకురావాలని ప్రణాళిక సిద్దంచేసిన సంగతి తెల్సిందే. కార్మికులను బయటకు రాగానే వారికి అత్యవసర ప్రథమ చికిత్స అందించేందుకు ఛాతి డాక్టర్లతో కూడిన 14 మంది వైద్య బృందాన్ని ఘటనాస్థలి వద్ద సిద్ధంగా ఉంచారు. 12 అంబులెన్సులను, 41 పడకల తాత్కాలిక ఆస్పత్రిని సిద్ధంచేశారు. మరీ అత్యవసరమనుకుంటే వారిని వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి ఆగమేఘాల మీద తరలించేందుకు హెలీకాప్టర్‌ను తెప్పించనున్నట్లు సమాచారం. బగ్వాల్ పండుగ వారితోనూ చేసుకుందాం ‘‘డ్రిల్లింగ్ విజయవంతంగా కొనసాగుతోంది. వారిని సురక్షితంగా బయటకు తీసుకొస్తాం. వారితో కలిసే స్థానిక బగ్లాల్ పండగ జరుపుకుందాం’’ అని ప్రధాని కార్యాలయం మాజీ సలహాదారు భాస్కర్ ఖుల్బే ఘటనాస్థలి వ్యాఖ్యానించారు. దీపావళి పండగ తర్వాత స్థానిక గర్వాల్ ప్రాంతంలో బగ్వాల్ పండగ జరుపుకోవడం ఆనవాయితీ. అక్కడి బగ్వాల్ను ఈ ఏడాది గురువారం జరుపుకుంటున్నారు. మరోవైపు, రెస్క్యూ ఆపరేషన్ పురోగతిపై రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీతో ప్రధాని మోదీ బుధవారం మాట్లాడారు. సొరంగంలో కూలింది ఎక్కడ ? సిల్క్యారా బెండ్ నుంచి మొదలుపెట్టి బార్కోట్ వరకు కొండ కింద 4.531 కి.మీ.ల మేర సొరంగం తవ్వుతున్నారు. సిల్క్యారా వైపు నుంచి 2.340 కి.మీ.ల మేర సొరంగం తవ్వకం, అంతర్గత నిర్మాణం పూర్తయింది. సొరంగం ముఖద్వారం నుంచి దాదాపు 205–260 మీటర్ల మార్క్ వద్ద దాదాపు 57 మీటర్ల పొడవునా సొరంగం కూలింది. అదే సమయంలో ఆ మార్క్ దాటి సొరంగం లోపలి వైపుగా కార్మికులు పనిలో ఉన్నారు. అంటే దాదాపు రెండు కిలోమీటర్ల మేర విశాలమైన ప్రాంతంలో కార్మికులు చిక్కుకుపోయారు. 57 మీటర్ల వెడలై్పన శిథిలాలున్నాయి. ఇంతే వెడల్పున శిథిలాల గుండా పైపును జొప్పించి వారిని బయటకు తెచ్చేందుకు యతి్నస్తున్నారు. -
చివరి షెడ్యూల్ షురూ
‘బంగార్రాజు’ వంటి హిట్ చిత్రం తర్వాత అక్కినేని నాగచైతన్య, కృతీ శెట్టి జంటగా నటిస్తున్న ద్వితీయ చిత్రం ‘కస్టడీ’. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు–తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. కాగా ఈ చిత్రం చివరి షెడ్యూల్‌ని శుక్రవారం ప్రారంభించారు. ‘‘నాగచైతన్య కెరీర్లో భారీ బడ్జెట్ చిత్రాల్లో మా ‘కస్టడీ’ ఒకటి. కొత్త సంవత్సరం కానుకగా విడుదలైన గ్లింప్స్‌లో నాగచైతన్య ఫెరోషియస్ లుక్‌లో ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తుండగా, ప్రియమణి పవర్ఫుల్ రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న చివరి షెడ్యూల్లో ప్రధాన తారాగణంపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. ఈ సినిమాని ఈ ఏడాది మే 12న విడుదల చేయనున్నాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, యువన్ శంకర్ రాజా, కెమెరా: ఎస్ఆర్ కదిర్, సమర్పణ: పవన్ కుమార్. -
మాట తప్పిన రష్యా: ‘ఆపరేషన్ గంగ’కు ఆఖరి దశలో అడ్డంకులు!
కీవ్: ఉక్రెయిన్ యుద్ధభూమి నుంచి భారత విద్యార్థుల్ని వెనక్కి తీసుకువచ్చే ‘ఆపరేషన్ గంగ’ ఆఖరి దశలో సంక్లిష్టంగా మారింది. రష్యా ఫిరంగులు నిప్పులు కక్కుతుండటంతో సుమీ నగరంలో చిక్కుకుపోయిన 700 మందిని తీసుకురావడం సమస్యగా మారింది. ఉక్రెయిన్‌లో మారియుపోల్, వోల్నోవాఖ నగరాల్లో పౌరులను సజావుగా ఖాళీ చేయించడానికి మానవతా దృక్పథంతో కాల్పులకు కాస్త విరామం ప్రకటిస్తున్నట్టు రష్యా శనివారం ప్రకటించింది. దాంతో సుమీలో చిక్కుకున్న మన విద్యార్థుల్ని వెనక్కి తీసుకురావచ్చని కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం భావించింది. కానీ, రష్యా మాట తప్పి ఎడతెరిపి లేకుండా క్షిపణి, బాంబు దాడులకు దిగడంతో పరిస్థితి మొదటికొచ్చింది. తూర్పు ఉక్రెయిన్‌లో చిక్కిన విద్యార్థుల్ని సరిహద్దులకు చేర్చాలంటే మారియుపోల్, వోల్నోవాఖ నుంచే తీసుకురావాలి. కానీ, అక్కడ రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. ఖర్కీవ్ సమీపంలోని పిసోచిన్, సుమీ నుంచి విద్యార్థుల్ని తీసుకురావడానికి సురక్షిత మార్గాలేవీ అందుబాటులో లేవు. రష్యాకు ఈశాన్యంగా ఉన్న సుమీ పరిసరాల్లో భీకరమైన దాడులు కొనసాగుతున్నాయి. పైగా రవాణా సాధనాలేవీ లేకపోవడం మరో సమస్యగా ఉంది. దాడులు ఆగిన తర్వాతే విద్యార్థుల తరలింపు సాధ్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. చిన్న హోటల్ గది నుంచి ఆపరేషన్ గంగ కోసం హంగరీ రాజధాని బుడాపెస్ట్‌లో ఒక హోటల్ గదిలో చిన్న కంట్రోల్ రూమ్ పెట్టి నడిపించారు. భారత రాయబార కార్యాలయంలోని మెరికల్లాంటి యువ ఐఎఫ్ఎస్ అధికారులు ఆపరేషన్ చేపట్టారు. 150 మందికి పైగా వలెంటీర్లను నియమించుకొని భారతీయ విద్యార్థులు ఎక్కడెక్కడున్నారో సమాచారం సేకరించారు. ఆపరేషన్ గంగ విజయవంతం: మోదీ ప్రపంచవ్యాప్తంగా భారత్ ప్రతిష్ట ఎంతో పెరిగిందని ప్రధాని మోదీ అన్నారు. కాబట్టే మన పౌరులను ఉక్రెయిన్ నుంచి వేగంగా తీసుకొచ్చి ‘ఆపరేషన్ గంగ’ను విజయవంతం చేశామన్నారు. ఈ విషయంలో చాలా పెద్ద దేశాలు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. ఆదివారం పుణెలోని సింబయాసిస్ వర్సిటీ గోల్డెన్ జూబ్లీ వేడుకలను ప్రారంభించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నేడు భారత్‌కు హరజోత్ సింగ్ ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో కొద్ది రోజుల క్రితం రష్యా దాడుల్లో గాయపడిన భారత విద్యార్థి హరజోత్ సింగ్ సోమవారం స్వదేశానికి రానున్నాడు. ఈ విషయాన్ని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వి.కె.సింగ్ చెప్పారు. 24 గంటల్లో 2,500 మంది రాక.. గత 24 గంటల్లో 13 విమానాలు 2,500 మంది విద్యార్థుల్ని ఉక్రెయిన్ నుంచి భారత్‌కు చేర్చాయి. ‘ఆపరేషన్ గంగ’లో భాగంగా ఇప్పటిదాకా 76 విమానాల్లో 15,920 మంది విద్యార్థులు క్షేమంగా తిరిగివచ్చారు. వచ్చే 24 గంటల్లో మరో 13 భారత వైమానిక దళ విమానాలు ఉక్రెయిన్ నుంచి విద్యార్థులతో బయల్దేరతాయి. ఉక్రెయిన్‌కు విమానాల రాకపోకలపై నిషేధం ఉండటంతో రుమేనియా, పోలండ్, హంగరి, స్లొవేకియా, మాల్డోవాల నుంచి విద్యార్థులను భారత్ వెనక్కు తీసుకొస్తోంది. హంగరీ నుంచి ఆఖరి విడతగా 13 విమానాలు రానున్నాయి. అందుకే హంగరీ సరిహద్దులకు చేరుకోవాలనుకునే విద్యార్థులంతా త్వరగా రావాలని భారత రాయబార కార్యాలయం సూచించింది. సోమవారం బుడాపెస్ట్ నుంచి ఐదు, సుకేవా నుంచి రెండు, బుఖారెస్ట్ నుంచి ఒక విమానంలో మరో 1,500 మందిని తీసుకు రానున్నారు. -
చివరి దశలో హెచ్-4 వీసా రద్దు
వాషింగ్టన్: భారతీయ ఐటి నిపుణుల గుండెల్లో గుబులు పుట్టించే వార్త. హెచ్-4 వీసాను రద్దు చేసే ప్రక్రియ చివరి దశల్లో ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సంకేతాలు అందించింది. అమెరికాలో హెచ్ -1బి వీసా మీద పనిచేస్తున్న వృత్తి నిపుణుల జీవిత భాగస్వాములకు ఇచ్చే స్పౌస్ వీసా హెచ్-4ను రద్దు చేయాలన్న నిర్ణయం తుది దశలో ఉందని ట్రంప్ పరిపాలన విభాగం అమెరికా కోర్టుకు తెలియజేసింది. ప్రతిపాదిత నియమం తుది దశంలో ఉందని డిపార్ట్మెంట్ అఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) ఫెడరల్ కోర్టుకు గురువారం నివేదించింది. ఈ నిర్ణయం తుదిరూపు దాల్చి అమలులోకి వస్తే అమెరికాలో నివసిస్తున్న వేలాది మంది భారతీయులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే అవకాశముంది. హెచ్1బి వీసా మీద అమెరికాలో పనిచేసే వృత్తినిపుణుల జీవిత భాగస్వాములు హెచ్-4 వీసా కింద అమెరికాలో నివసించడానికి అనుమతి లభిస్తుంది. అయితే.. అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా ఉన్న సమయంలో (2015)లో హెచ్1బి వీసాదారుల జీవిత భాగస్వాములు కూడా అమెరికాలో చట్టబద్ధంగా పనిచేయటానికి అనుమతించిన ఈఏడీ (ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్) కి చరమగీతం పాడాలని ట్రంప్ సర్కార్ ప్రణాళికలు రచిస్తున్న సంగతి తెలిసిందే. కాగా హెచ్-4 వీసాదారులకు ఈఏడీల జారీని రద్దు చేస్తామని యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) 2017 సెప్టెంబర్‌లో ప్రకటించింది. అయితే 2018 ఫిబ్రవరిలో దీనికి సంబంధించిన ప్రకటన జారీ చేస్తామని అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ పేర్కొంది. అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే అన్న నినాదంలో భాగంగా హెచ్-4 వీసాదారులు అమెరికాలో ఉద్యోగాలు చేయటానికి ఇచ్చే అనుమతులను రద్దు చేయాలనీ ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో హెచ్-1బీ, హెచ్-4 వీసాలను ఎక్కువగా పొందుతున్న భారతీయ ఐటీ నిపుణుల్లో ఇప్పటికే తీవ్ర ఆందోళన నెలకొన్న సంగతి విదితమే. దాదాపు 70వేల మంది హెచ్-4 వీసాదారుల ఆశలు ఆవిరయ్యే ప్రమాదం పొంచి ఉంది. -
మాటరాని మౌనం!
పశువైద్యం.. దైవాధీనం - పోస్టుల భర్తీలో నిర్లక్ష్యం - 20 కిలోమీటర్లు వెళ్లినా కనిపించని ఆసుపత్రులు - వైద్యం మండల, నియోజకవర్గ కేంద్రాలకే పరిమితం - అరకొర మందులు, శిథిల భవనాలు - ప్రబలుతున్న అంతుచిక్కని వ్యాధులు పశువులు, జీవాల వివరాలు ఆవులు, ఎద్దులు 06.61 లక్షలు గేదెలు 03.70 లక్షలు గొర్రెలు 38.79 లక్షలు మేకలు 07.85 లక్షలు కోళ్లు 18.26 లక్షలు పందులు 21,800 కుక్కలు 85,500 గాడిదలు 6,200 ఆస్పత్రులు వెటర్నరీ పాలీక్లినిక్ (వీపీసీ) : 01 పట్టణ పశువైద్యశాలలు (వీహెచ్‌లు) : 30 మండలస్థాయి వైద్యశాలలు (వీడీలు) : 121 గ్రామీణ పశుచికిత్సాకేంద్రాలు (ఆర్‌ఎల్‌యు) : 37 గోపాలమిత్ర కేంద్రాలు : 362 పోస్టులు, ఖాళీల వివరాలు హోదా పోస్టులు ఖాళీలు డిప్యూటీ డైరెక్టర్లు 07 06 అసిస్టెంట్ డైరెక్టర్లు 43 03 పశువైద్యాధికారులు 128 15 కాంపౌండర్లు 113 56 జేవీవోలు 22 05 ఆఫీస్ సబార్టినేటర్లు 140 57 + అనంతపురం రూరల్ మండలం చియ్యేడులో నాలుగు నెలలుగా పశువైద్యాధికారి లేరు. ఈ కారణంగా చియ్యేడుతో పాటు పూలకుంట, కృష్ణమరెడ్డిపల్లి, దుర్గం, మన్నీల, ఇటుకలపల్లి, యర్రాయపల్లి తదితర గ్రామాలకు వైద్య సేవలు నిలిచిపోయాయి. పశు సంపద ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇదొకటి. ఇలాంటి చోట వైద్యాధికారి లేకపోవడం చూస్తే ఈ శాఖ పనితీరు ఇట్టే అర్థమవుతుంది. జిల్లా కేంద్రానికి సమీపంలోనే పరిస్థితి ఇలావుంటే.. మారుమూల ప్రాంతాల పరిస్థితి చెప్పనక్కర్లేదు. అనంతపురం అగ్రికల్చర్: పశువైద్యం గాలిలో దీపంగా మారింది. వైద్యులు, కాంపౌండర్ల కొరతతో పాటు శిథిలమైన భవనాలు.. ఖరీదైన మందులు అందుబాటులో లేకపోవడంతో వైద్యం దైవాధీనం అవుతోంది. అంతుచిక్కని రోగాలు.. అంటువ్యాధులు ప్రబలుతుండటంతో సకాలంలో వైద్యం అందక విలువైన పశుసంపద మృత్యుబారిన పడుతోంది. వైశాల్యం.. పశు, జీవాల సంఖ్యలో అనంత అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే సరైన మౌలిక వసతులు, వైద్య సేవలు, ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో జిల్లాలో పాడి పరిశ్రమ, పాల ఉత్పత్తి తిరోగమనంలో పయనిస్తోంది. జిల్లాలో పశువులు, గేదెలు, గొర్రెలు, మేకలు, పందులు, కుక్కలు తదితరాలన్నీ కలిపి 60లక్షలకు పైబడి మూగ జీవాలు ఉన్నాయి. కోళ్ల సంఖ్య 18.50 లక్షలు. కానీ.. పశువైద్య శాలలు మాత్రం 189 మాత్రమే. పశువులు, జీవాలు ఎక్కువగా ఉన్న గ్రామాల్లోనే ఆసుపత్రులు లేకపోవడం సమస్యకు కారణమవుతోంది. జబ్బు చేస్తే 20 కిలోమీటర్ల దూరం వెళ్లినా ఆసుపత్రులు కనిపించని పరిస్థితి. కర్నూలు, వైఎస్ఆర్ కడప, చిత్తూరు జిల్లాల్లో 250 చొప్పున పశు చికిత్సా కేంద్రాలు ఉండగా.. ఇక్కడ 37 మాత్రమే ఉండటం గమనార్హం. అరకొర మందులే.. మందుల విషయానికొస్తే జబ్బు చేసిన వెంటనే ప్రాథమిక చికిత్స చేయడానికి కూడా కొన్ని ఆస్పత్రుల్లో అత్యవసర మందులు(లైఫ్ సేవింగ్ డ్రగ్స్) ఉండని పరిస్థితి నెలకొంది. ప్రతి మూడు నెలలకోసారి సుమారు 60 నుంచి 80 రకాల మందులు సరఫరా అవుతుంటాయి. పశుసంపద, జీవాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సరఫరా చేసినా.. త్వరగా అయిపోతుండటంతో ఆ తర్వాత ఇబ్బందులు తప్పట్లేదు. ప్రతి మూడు నెలలకోసారి జిల్లాలో ఉన్న ఆస్పత్రులకు రూ.45 లక్షల విలువ చేసే మందులు సరఫరా చేస్తున్నట్ల ఆ శాఖ వర్గాలు తెలిపాయి. మందుల జాబితాలో ఖరీదైన మందులు లేకపోవడంతో ప్రజలు, రైతులు బయట మందుల షాపుల్లో కొనుగోలు చేయాల్సి వస్తోంది. థైలేరియా(మలేరియా లాంటి వ్యాధి), గర్భకోశ వ్యాధులు, పొదుగువాపు వ్యాధి, కుక్కలకు సంబంధించి రేబిస్ టీకాలు, మరికొన్ని మందులతో పాటు ముఖ్యమైన యాంటీబయాటిక్స్, సెలైన్స్, నొప్పి నివారణ(పెయిన్‌కిల్లర్స్) మందుల కొరత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. నీలినాలుక, గిట్టపుండ్ల వ్యాధి, బొబ్బవ్యాధి, పీపీఆర్(పారుడురోగం), బ్రూసెల్లోసీన్, దొమ్మ(అంత్రాక్స్), గొంతువాపు, నట్టల నివారణ(డీవార్మింగ్) తదితర అంటువ్యాధులు, హానికరమైన జబ్బులకు సంబంధించి ఏటా సీజన్ల వారీగా ఉచితంగా టీకాలు వేస్తున్నా.. మధ్య మధ్యలో వ్యాధులు సోకితే ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటున్నాయి. జిల్లా కేంద్రంలో ఉన్న ఆస్పత్రికి ఎక్కువగా కుక్కలు, పిల్లులను చికిత్స కోసం తీసుకొస్తారు. అయితే వీటికి సంబంధించిన మందులు పరిమితంగా వస్తుండటంతో బయటకు రాసిచ్చే పరిస్థితి నెలకొంది. పశువులు, జీవాలు తక్కువగా ఉన్న కొన్ని ఆస్పత్రుల్లో సరఫరా అవుతున్న మందులు మిగిలిపోతుండంతో.. కాలం చెల్లిపోయినట్లు తెలిసినా వాడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. శిథిల భవనాల్లో వైద్య సేవలు ఆస్పత్రి భవనాలు కొన్ని ప్రాంతాల్లో శిథిలావస్థకు చేరుకున్నాయి. అత్యవసర మందులు, వీర్యం లాంటివి నిల్వ చేసుకునేందుకు, వైద్యం చేసేందుకు సరైన వసతులు కూడా కొన్ని చోట్ల అంతంత మాత్రమే. రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్(ఆర్ఐడీఎఫ్) కింద భవన నిర్మాణాలు, మరమ్మతులకు నిధులు మంజూరైనట్లు చెబుతున్నా పూర్తయినవి తక్కువగానూ, సంవత్సరాల తరబడి వివిధ దశల నిర్మాణాల్లో కొనసాగుతున్నట్లు సమాచారం. ఇబ్బందులు వాస్తవమే.. పక్క జిల్లాలతో పోలిస్తే ఆస్పత్రులు, డాక్టర్లు, కాంపౌండర్ల కొరత ఇక్కడ ఎక్కువే. ముఖ్యంగా గ్రామీణ చికిత్సా కేంద్రాలు మరీ తక్కువగా ఉండటంతో కొన్ని చోట్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే ఎక్కడా వైద్య సేవలకు ఇబ్బందులు తలెత్తకుండా ఇన్చార్జీలను నియమించి పర్యవేక్షణ సాగిస్తున్నాం. - డాక్టర్ బి.సన్యాసిరావు, పశు సంవర్ధక శాఖ జేడీ -
పతనావస్థలో ప్రభుత్వ డెయిరీ
• 35 వేల లీటర్లకు పడిపోయిన రోజువారీ పాలసేకరణ • వేతనాలు లేక మొక్కుబడిగా పనిచేస్తున్న అధికారులు • రూ.30 లక్షలకు పైగా నష్టాలు మూటగట్టుకున్న డెయిరీ అనంతపురం అగ్రికల్చర్ : పదేళ్ల కిందటే 60 నుంచి 70 వేల లీటర్ల పాలసేకరణతో ఓ వెలుగు వెలిగిన ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య (ఏపీ డెయిరీ) ఇపుడు పతనావస్థలో కొట్టుమిట్టాడుతోంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ డెయిరీని చంద్రబాబు సర్కారు పట్టించుకోకపోవడంతో సంక్షోభం దిశగా పయనిస్తోంది. దీంతో ప్రభుత్వ డెయిరీని నమ్ముకుని పాలు పోస్తున్న రైతులకు సకాలంలో చెల్లింపులు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని నమ్మలేని పాడి రైతులు ప్రైవేట్ డెయిరీల వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఇదే అదనుగా అటు ప్రభుత్వ డెయిరీ, ఇటు ప్రైవేట్ డెయిరీలు రైతులను ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. వ్యవసాయానికి ప్రధాన ప్రత్యామ్నాయంగా రైతుల జీవన ప్రమాణాలు పెంచాల్సిన పాడి పరిశ్రమ తిరోగమన దిశలో పయనిస్తోంది. 35 వేల లీటర్లకు పడిపోయిన పాల సేకరణ అనంతపురం, హిందూపురం డెయిరీల సామర్థ్యం 1.20 లక్షల లీటర్లు. గత ఫిబ్రవరి, మార్చిలో రెండింటి పరిధిలో రోజూ 65 వేల లీటర్ల పాలను సేకరిస్తుండేవారు. ప్రస్తుతం 35 వేల లీటర్లకు పడిపోయాయి. అంటే ఆరు నెలల్లోనే ఏకంగా 30 వేల లీటర్లు తగ్గిపోవడం విశేషం. వేసవిలోనే ఆ స్థాయిలో పాలు వస్తుండగా.. ఇపుడు వర్షాకాలంలో పెరగాల్సింది పోయి తగ్గిపోవడం చూస్తే డెయిరీ పయనం ఏ దిశగా ఉందో అర్థమవుతోంది. హిందూపురం పరిధిలో కొంత మెరుగ్గా ఉండగా.. అనంతపురం పరిధిలో పూర్తిగా ప్రైవేట్‌పరం అయిపోయినట్లు కనిపిస్తోంది. డీఆర్డీఏ–వెలుగు డెయిరీల్లో కూడా పాల సేకరణ భారీగా తగ్గిపోయింది. కొత్తచెరువు, తాడిపత్రి, బ్రహ్మసముద్రం, పామిడి, అమడగూరు తదితర బీఎంసీల్లో పాల సేకరణ పూర్తిగా తగ్గిపోయింది. నార్పల, శెట్టూరు, ఓడీ చెరువు, పెనుకొండ, నల్లచెరువు లాంటి బీఎంసీల్లో నామమాత్రంగా పాలు వస్తున్నాయి. గుడిబండ, రొళ్ల, ధర్మవరం, కళ్యాణదుర్గం, మడకశిర, అగళి లాంటి కొన్ని బీఎంసీల పరిస్థితి మాత్రమే మెరుగ్గా ఉంది. ఏప్రిల్, మే నెలల్లో రూ.11 కోట్ల పాల బకాయిలు ఉండటంతో రైతులు పెద్ద ఎత్తున చేసిన ఆందోళనకు దిగివచ్చిన సర్కారు ఎలాగోలా చెల్లింపులు చేసింది. లేదంటే ఈ పాటికి డెయిరీకి తాళం వేసే పరిస్థితి ఉండేదంటున్నారు. గతంలో డెయిరీకి 12 వేల మందికి పైగా రైతులు పాలు పోస్తుండగా.. ఇపుడు 7 వేల మందికి పడిపోవడం గమనార్హం. సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితి ఉందని తెలియడంతో చాలా మంది రైతులు ప్రైవేట్ డెయిరీల వైపు మొగ్గుచూపారు. పాలలో నీళ్లను వేరు చేసి సరఫరా చేయడానికి వీలుగా రూ.2 కోట్లు వెచ్చించి ఏర్పాటు చేసిన అత్యాధునిక ఆర్వో ప్లాంటు నిరవధికంగా మూతబడిపోయింది. వేతనాలు లేక అవస్థలు ఓ వైపు రైతుల పరిస్థితి దారుణంగా ఉండగా.. మరోవైపు డెయిరీ ఉద్యోగులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. గత నాలుగు నెలలుగా వారికి వేతనాలు లేవు. దీంతో అధికారులు, సిబ్బంది మొక్కుబడిగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో అనంతపురం డెయిరీ ప్రస్తుతం రూ.30 లక్షలకు పైగా నష్టాల్లో కూరుకుపోయినట్లు సమాచారం. ఈ విషయాన్ని అధికారులు పైకి చెప్పడానికి నిరాకరిస్తున్నారు. ఇక డెయిరీ డీడీ నాగేశ్వర్రావు స్వచ్ఛంద పదవీ విరమణకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నారు. డీడీ కూడా విరమణ చేస్తే కొత్తగా ఇక్కడకు రావడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదని సమాచారం. మొత్తమ్మీద డెయిరీ పరిస్థితి రోజురోజుకు క్షీణించిపోతోంది. -
తుది దశకు వర్గీకరణ ప్రక్రియ
ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు గాంధీనగర్ : ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఎమ్మార్పీఎస్ చేపట్టిన ఉద్యమం కీలక దశకు చేరుకుందని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు తెలిపారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 10 వరకు డిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగిన ఆందోళనకు అధికార, ప్రతిపక్షాలు మద్దతిచ్చాయన్నారు. ఈనెల 24 నుంచి హైదరాబాద్‌లో ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల మేథోమదన సదస్సు, 26న అన్ని కుల, ప్రజాసంఘాల మేథోమదన సదస్సు, 27న అన్ని రాజకీయ పార్టీలలోని సీనియర్ నాయకుల మేథోమదన, 28న ఉద్యోగులు, మేధావులు, 29న ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా అన్ని సామాజిక వర్గాలకు చెందిన బుద్దిజీవులతో, సెప్టెంబర్ 4న మాదిగ ప్రజల ప్రతినిధులతో సదస్సులు నిర్వహించనున్నామని వివరించారు. సమావేశంలో జాతీయ అధికార ప్రతినిధి దొండపాటి సుధాకర్, పరసా రామయ్య, కోట దానియేల్, మానికొండ శ్రీధర్, లింగాల నర్సింహులు, కాంపాటి వెంకటేశ్వరరావు మాదిగ, టోని మాదిగ, రోజ్‌కుమార్ పాల్గొన్నారు. -
తుదిదశలో పుష్కర ఏర్పాట్లు
తొక్కిసలాట జరగకుండా ప్రత్యేక క్యూలైన్లు సందర్శనార్థం ఎనిమిది నమూనా దేవాలయాలు పుష్కరనగర్లలో షెడ్ల ఏర్పాటు అమరావతి: ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన అమరావతిలో పుష్కరాల ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. శుక్రవారం పుష్కరాలు ప్రారంభం కానుండగా ధ్యానబుద్ధ ఘాట్‌లో కాంక్రీట్పనులతో పాటు టైల్స్ వేయటం కూడా పూర్తిచేశారు. ధ్యానబుద్ధునికి ప్రత్యేకంగా విద్యుత్ లైటింగ్‌తో అలంకరణ చేశారు. ఘాట్‌లో ఎటువంటి తొక్కిసలాట జరగకుండా ప్రత్యేకంగా కూలైన్లు ఏర్పాటు చేశారు. భక్తులు లోతుకు వెళ్లకుండా ప్రత్యేకంగా మెష్ ఏర్పాటు చేశారు. ఈఘాట్లోనే కొంత భాగాన్ని వీఐపీ ఘాట్‌గా చేశారు. భక్తులు పుష్కరస్నానం చేశాక వివిధ పుణ్యక్షేత్రాల దేవతామూర్తులను దర్శించుకునేందుకు ఎనిమిది నమూనా దేవాలయాలు దాదాపుగా పూర్తయ్యాయి. తిరుపతి, అయినవెల్లి, నెమలి, శ్రీకాళహస్తి, విజయవాడ కనకదుర్గదేవాలయం, కాణిపాకం, సింహాచలం, ఒంటిమిట్ట దేవాలయాల నమూనాలను నిర్మించారు. అమరేశ్వర దేవస్థానం వద్ద... అమరేశ్వర దేవస్థానం వద్ద ఘాట్ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈఘాట్‌లో తాత్కాలిక మరుగుదొడ్లు, పిండ ప్రధాన షెడ్లు వేశారు, అమరేశ్వరాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. దేవాలయంలో క్యూలైన్లు, సమాచార బోర్డులు, కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఇక విజయవాడ, సత్తెనపల్లి రోడ్లలో ఏర్పాటు చేసిన పుష్కరనగర్లలో 3000మందికి సరిపడా షెడ్లు, గుంటూరు రోడ్డులోని పుష్కరనగర్‌లో 10వేల మందికి సరిపడా షెడ్లు వేశారు. ఇక్కడ తాత్కాలిక మరుగుదొడ్లు, మూత్రవిసర్జన ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల తాగునీటి కోసం ప్రత్యేకంగా బోర్లు వేసి మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రసిద్ధమెన వంటకాలతో పర్యాటక శాఖ నిర్వహించే ఆహార ప్రదర్శనశాలకు, వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటుకు షెడ్లు సిద్ధం చేశారు. ఘాట్లలో, మెయిన్ రోడ్లలో విద్యుత్ లైట్లను, మెయిన్ రోడ్డులో డివైడర్‌పై రంగురంగు విద్యుత్ బల్పులను, ఘాట్లలో హైమాస్ట్ లైట్లు అమర్చారు. గురువారం పుష్కరఘాట్లను అగ్నిమాపకశాఖ వారిచే శుభ్రం చేయించటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. -
చివరకు మిగిలింది.. రూ.18 వేల కోట్లు
► అప్పుల పంపిణీకి ఆఖరి పీటముడి ► రెండు రాష్ట్రాల అభిప్రాయాలు కోరిన ఏజీ ► జనాభా ప్రకారం పంచాలన్న తెలంగాణ ► ఖర్చుల పద్దుల వారీగా పంచాలన్న ఏపీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య అప్పుల పంపిణీ ఆఖరి దశకు చేరింది. చివరకు మిగిలిన రూ.18 వేల కోట్ల అప్పు పంచుకోవాల్సి ఉంది. అకౌంటెంట్ జనరల్ (ఏజీ) సూచన ప్రకారం రెండు రాష్ట్రాల ఆర్థిక శాఖలు తమ ప్రతిపాదనలు, అభిప్రాయాలను వెల్లడించే గడువు మంగళవారంతో ముగి సింది. గడువుకు ముందుగానే తెలంగాణ ఆర్థిక శాఖ తమ ప్రతిపాదనలను ఏజీకి పంపింది. జనాభా ప్రాతిపదికన ఏపీకి 58 శాతం, తెలంగాణకు 42 శాతం అప్పును పంపిణీ చేయాలని పేర్కొంది. భౌగోళికంగా ఏ ప్రాంతంలో, ఏ అవసరానికి ఎంత ఖర్చు చేశారో లెక్కతీసి చట్ట ప్రకారం పంపిణీ చేయాలని ఏపీ ఆర్థిక శాఖ విజ్ఞప్తి చేసింది. రెండు రాష్ట్రాలు భిన్నాభిప్రాయాలు వెలిబుచ్చటంతో ఏజీ సైతం ఈ వివాదాన్ని పరిష్కరించలేని పరిస్థితి నెలకొంది. రాష్ట్ర విభజన ముందు వరకు సమైక్య రాష్ట్రానికి రూ. 1.78 లక్షల కోట్ల అప్పు ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ నాటికి కేంద్రం ప్రాథమికంగా రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల వాటాలను పంపిణీ చేసింది. ఆడిట్ లెక్కల ప్రకారం ఇప్పటివరకు రూ.1.60 లక్షల కోట్ల అప్పుల పంపిణీ పూర్తయింది. మిగతా అప్పును జనాభా నిష్పత్తి ప్రకారం పంపిణీ చేస్తే తెలంగాణకు రూ. 7,560 కోట్లు, ఏపీకి రూ.10,440 కోట్లు అప్పు మిగులుతుంది. ఏపీ ప్రతిపాదన ప్రకారం లెక్కగడితే.. తెలంగాణకు అన్యాయం జరుగుతుందని, భారీగా నష్టం వాటిల్లుతుందని ఆర్థిక శాఖ అప్రమత్తమైంది. రూ.1.60 లక్షల కోట్లు పంపిణీ చేసేటప్పుడు వాటిని ఎక్కడెక్కడ.. వేటికి ఖర్చు చేశారనేది ఏజీ ఆరా తీయలేదు. కేవలం ఆడిట్ లెక్కల ఆధారంగా అప్పుల పంపిణీ జరిగింది. అంత భారీ మొత్తానికి భౌగోళిక ప్రాంతాలతో సంబ ంధం లేనప్పుడు.. మిగిలిన రూ.18 వేల కోట్ల కు ఈ నిబంధన ఎలా చెల్లుబాటవుతుందని తెలంగాణ వాదిస్తోంది. అది తమకు సమ్మతం కాదని ఏపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని విభజన వివాదాల పరిష్కార కమిటీ జోక్యం చేసుకుంటే తప్ప ఇది కొలిక్కి వచ్చేలా లేదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
చివరి దశకు జల జగడం!
భామిని: అంతర్ రాష్ట్ర జల వివాదం త్వరలో పరిష్కారమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీర్ఘకాలంగా ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమైన వంశధార ప్రాజెక్టు పనుల అనుమతుల సాధనపై కదలిక వచ్చింది. ఒడిశా లేవనెత్తిన ఆభ్యంతరాల చిక్కుముడులు విప్పేందుకు చేపట్టిన చర్యలు ముగింపు దశకు వచ్చాయి. ఈ దశలో వంశధార ప్రాజెక్టుపై ఒడిశా ప్రభుత్వం లేవనెత్తుతున్న అభ్యంతరాలపై పూర్తిస్థాయిలో సిద్ధం చేసిన నివేదికను ఇంజి నీరింగ్ అధికారుల బృందం శుక్రవారం (ఈ నెల 8 తేదీ) సంబంధిత ట్రిబ్యునల్‌కు అందజేయనుంది. ఇందుకోసం అధికారుల బృందం ఢిల్లీలో మకాం వేసింది. సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) ద్వారా సంపాదించిన 18 రకాల అభ్యంతరాలకు కావాల్సిన వివరాలను ట్రిబ్యునల్‌కు సమర్పించనున్నా రు. ఇప్పటికే రాష్ట్ర సమన్వయాధికారి సతీష్‌చంద్ర ఆధ్వర్యంలో వంశధార ఈఈ బి.రాంబాబు ఢిల్లీలో మకాం వేసి సీడబ్ల్యూసీ అధికారుల ద్వారా ట్రిబ్యునల్‌కు సమర్పించడానికి కావాల్సిన చర్యలు పూర్తి చేశారు. ఇటీవల కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ భామిని మండలంలోని వంశధార ప్రా జెక్టు నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఒడిశా లేవనెత్తిన అభ్యంతరాలపై పూర్తిస్థాయిలో నివేదికలు సేకరించి ట్రిబ్యునల్‌కు సమర్పించాలని ఆదేశించారు. గతం ఇలా.. వంశధార ప్రాజెక్టు విషయంలో ఒడిశా ప్రభుత్వం అనేక అభ్యంతరాలను లేవనెత్తింది. దీం తో విషయం కోర్టుకు వెళ్లింది. ఈ పరిస్థితిలో గత ఏడాది ఏప్రిల్ 22 నుంచి 25వ తేదీ వరకు వంశధార ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ డాక్టర్ ముకుందకం శర్మ ఆధ్వర్యంలోని బృందం ఇరు రాష్ట్రాల్లోని వంశధార ప్రాంతాలను పరిశీలించింది. అనంతరం డిసెంబర్ 17న ట్రిబ్యునల్ తీర్పునిచ్చి వంశధార నదిపై సైడ్వియ్యర్ నిర్మించి ఓపెన్‌హెడ్ చానల్ ద్వారా సాగునీరు తరలించుకోవడానికి ఆంధ్ర ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. అనంతరం రెండు రాష్ట్రాల్లోను ప్రాజెక్టు నిర్మాణంపై పునరాలోచన చేశాయి. దీంతో ఈ ఏడాది మార్చి 22న మరోసారి ట్రిబ్యునల్ బృందం వంశధార ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని పునః పరిశీలించింది. ట్రిబ్యునల్ ముం దు లేవనెత్తిన అభ్యంతరాలపై పూర్తిస్థాయి నివేదికలను కూడా ఇప్పుడు వంశధార అధికారులు సిద్ధం చేసి ట్రిబ్యునల్‌కు అందజేయనున్నారు. అటవీశాఖ, పర్యావరణ అనుమతుల సాధనకు ప్రయత్నాలు చేస్తున్నారు. పూనే లో జరిపిన మోడల్ సర్వేలోనూ గుర్తించిన నివేదికలను సైతం అందించనున్నారు. దీంతో వంశధారకు ట్రిబ్యునల్ నుంచి పూర్తిస్థాయి అనుమతులు రావచ్చునని జిల్లా వాసులు భావిస్తున్నారు.