తుది దశకు వర్గీకరణ ప్రక్రియ
Published Fri, Aug 19 2016 8:17 PM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM
ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు
గాంధీనగర్ :
ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఎమ్మార్పీఎస్ చేపట్టిన ఉద్యమం కీలక దశకు చేరుకుందని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు తెలిపారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 10 వరకు డిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగిన ఆందోళనకు అధికార, ప్రతిపక్షాలు మద్దతిచ్చాయన్నారు. ఈనెల 24 నుంచి హైదరాబాద్‌లో ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల మేథోమదన సదస్సు, 26న అన్ని కుల, ప్రజాసంఘాల మేథోమదన సదస్సు, 27న అన్ని రాజకీయ పార్టీలలోని సీనియర్ నాయకుల మేథోమదన, 28న ఉద్యోగులు, మేధావులు, 29న ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా అన్ని సామాజిక వర్గాలకు చెందిన బుద్దిజీవులతో, సెప్టెంబర్ 4న మాదిగ ప్రజల ప్రతినిధులతో సదస్సులు నిర్వహించనున్నామని వివరించారు. సమావేశంలో జాతీయ అధికార ప్రతినిధి దొండపాటి సుధాకర్, పరసా రామయ్య, కోట దానియేల్, మానికొండ శ్రీధర్, లింగాల నర్సింహులు, కాంపాటి వెంకటేశ్వరరావు మాదిగ, టోని మాదిగ, రోజ్‌కుమార్ పాల్గొన్నారు.
Advertisement