
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారనే విషయం తెలిసిందే. ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న పోడ్ కాస్ట్ ఆడియోలతో ఈ డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ సంచలనం సృష్టిస్తున్నారు. సమాజంలోని ప్రతి అంశాన్ని టచ్ చేస్తూ తనదైన స్టైల్‌లో వివరణ ఇస్తున్నారు. అందుకే ఆయన మాట్లాడుతుంటే ఆవేశంతో కూడిన వేదాంతం వినిపిస్తూ ఉంటుంది. టాపిక్ ఏదైనా క్లియర్ కట్‌గా లాగ్ చేయకుండా మాట్లాడతాడు. పూరి జగన్నాథ్ చెప్పిన ప్రతి విషయాన్ని గమనిస్తే.. సమాజం, అందులోని వ్యక్తులు, వారి స్వభావాలను చదివేశాడన్న ఫీలింగ్ కలుగుతోంది. ఆయన ఏం మాట్లాడుతున్నా అదేదో మన జీవితానికి ఉపయోగపడే అంశంలా కూర్చోని ఆసక్తిగా వినాలనిపిస్తుంది. ఈ కారణాల వల్లే పూరి ఆడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. చదవండి: కళ్లు చెమ్మగిల్లాయి: పూరీ జగన్నాథ్
ఇప్పటి వరకు పోడ్ కాస్ట్ ఆడియోలతో చాలా విషయాలపై ప్రస్తావించిన పూరి తాజాగా టామ్‌బాయ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టామ్ బాయ్ అంటే.. అమ్మాయి అయినప్పటికీ అబ్బాయిలా బిహేవ్ చేయడం అని చెప్తూ ప్రారంభించాడు. అన్నింట్లో అబ్బాయిలతో పోటీపడుతూ, తనకు నచ్చినట్టుగా వ్యవహరించేవారని తెలిపారు. ‘ఎదీ ఉన్న మొహం మీద చెబుతూ, ప్రాక్టికల్‌గా ఉంటారు. ఐ లవ్ టామ్‌బాయ్స్. మగవాళ్లలాగా ఆలోచిస్తూ, వాళ్ల లాగే పనిచేస్తారు. ఎక్కడికైనా ధైర్యంగా వెళ్తారు. రెబల్స్‌లాగా ఆలోచిస్తారు. టామ్‌బాయ్స్ వల్లే ఈ ప్రపంచం మారుతుంది. హ్యట్సాఫ్ టు ద వుమెన్ ఇన్ మిలిటరీ. స్పోర్ట్స్, పోలీస్, డ్యాన్స్, వర్కింగ్ వుమెన్.. కూతురు మగ రాయుడిలా తిరుగుతుంటే మీకు భయం వేయొచ్చు. ఇది ఇలా ఉంటే దీన్ని ఎవరు చేసుకుంటారని కంగారు పడొచ్చు. అలాంటి కూతురు ఉన్నందుకు సంతోషించండి. కాలర్ పట్టుకొని మగాన్ని కొట్టే ఆడపిల్ల మనకు కావాలి. అమ్మోరు తల్లిలా తాటా తీయాలి. కాళికా దేవిలా కన్నెర్ర చేయాలి. నూర్ ఇనాయత్ ఖాన్, ఝాన్సీ లక్ష్మీ భాయ్, సరస్వతి రాజామణి, పులన్ దేవి, కిరణ్ బేడీ, కరణం మల్లేశ్వరి.. ఇలాంటి వాళ్లే మనకు కావాలి. కళ్లల్లో కసి, పట్టుదల ఉన్నవాళ్లే నిజమైన అందగత్తెలు. రియల్ వుమెన్ ఆల్వేస్ ఏ టామ్‌బాయ్’ అంటూ ముగించారు.
Thank you @purijagan and @Charmmeofficial for nominating me....I hereby nominate @realradikaa @DrManjula_A and soul mate @madhoo69 powerful #tomboy https://t.co/zQmzAaOCdD
— Ramya Krishnan (@meramyakrishnan) November 25, 2020
కాగా ఈ వీడియో అనేక మంది అమ్మాయిలు, మహిళలను హత్తుకుంటోంది. తమలో కూడా ఇలాంటి లక్షణాలు ఉన్నాయని, ఎంతో మందికి ఈ వీడియో ఆదర్శంగా ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అదే విధంగా ఈ టామ్‌బాయ్ వీడియో పవర్‌ఫుల్‌గా ఉందంటూ నటి ఛార్మి కౌర్ ప్రశంసలు కురిపించారు. అంతేగాక తను కూడా ఓ టామ్‌బాయ్‌నని చెబతూ తన జీవితంలో అలాంటి వ్యక్తులు మరో ముగ్గురు ఉన్నారని తెలిపారు. త్రిష, లక్ష్మీ మంచు, రమ్యకృష్ణలను ట్యాగ్ చేశారు. మరో ముగ్గురు స్వతంత్ర్య, ధైర్య మహిళలను నామినేట్ చేయాలని కోరారు. దీనిపై స్పందించిన రమ్యకృష్ణ.. ఛార్మి, పూరి జగన్నాథ్‌కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే నటి రాధికా, డాక్టర్ మంజులా, నటి మధును రమ్య కృష్ణ నామినేట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment