కోహ్లిని కలవడం చాలా సంతోషం- నటి | Ramya Krishnan says happy to meet virat kohli | Sakshi
Sakshi News home page

కోహ్లిని కలవడం చాలా సంతోషం- నటి

Published Sun, Dec 3 2017 11:13 AM | Last Updated on Sun, Dec 3 2017 2:18 PM

Ramya Krishnan says happy to meet virat kohli - Sakshi

‘బాహుబలి’ సినిమాలో శివగామి పాత్రను ప్రేక్షకులు అంత తేలిగ్గా మర్చిపోలేరు. శివగామి పాత్రలో అందరినీ మెప్పించారు నటి రమ్యకృష్ణ. ఇటీవల ఓ చానెల్‌ అవార్డుల కార్యక్రమం ఢిల్లీలో జరిగింది. ఈ కార్యక్రమంలో నటి రమ్యకష్ణ, టిమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిలు సందడి చేశారు. శివగామి పాత్రకు రమ్యకృష్ణ, ‘ ఇండియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ గా కోహ్లిలు అవార్డులు అందుకున్నారు. ఈ వేదికపై కోహ్లితో కలిసి దిగిన ఫోటోను రమ్యకృష్ణ తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

‘విరాట్‌ చాలా మంచి వ్యక్తి, ఆయన్ను కలుసుకోవడం చాలా సంతోషంగా’ ఉందని ఆమె ట్విట్‌ చేశారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ ఫొటో వైరల్‌ అయ్యింది. రమ్యకృష్ణ  ‘హలో’ చిత్రంలో అఖిల్‌కు తల్లిగా నటిస్తున్నారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement