జగన్మాత లీలలు
సీనియర్ నటి రమ్యకృష్ణ చాలా కాలం తర్వాత అమ్మోరు పాత్రలో నటి స్తున్న చిత్రం ‘జగన్మాత’. శ్రీ సాయి సీతారామ ప్రొడక్షన్స్ పతాకంపై జి.వెంకటేశ్వరరావు, ఎన్.ఎస్.రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వీరేశ్ దర్శకుడు. రాజ్‌కిరణ్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను త్వరలో విడుదల చేయనున్నారు. దర్శకుడు మాట్లాడుతూ -‘రమ్యకృష్ణ నటన ఈ చిత్రానికి హైలైట్. జగన్మాత లీలలు ఆసక్తి కరంగా ఉంటాయి. అన్ని వర్గాల వారికీ నచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: హరినాథ్‌రెడ్డి, నాగబాబు, సహనిర్మాత: చింతపల్లి నాగేశ్వరరావు.