రమ్యకృష్ణ (PC: Ramyakrishnan Instagram)
ఫలానా పాత్ర కోసం ఆమె’ అనే అవకాశాన్ని అందుకునే స్థాయి దాటిపోయి.. ‘ఆమె కోసం ఈ పాత్ర’ అని రచయితలు రాసే.. దర్శకులు ఆలోచించే హోదాకు చేరుకున్న నటి రమ్యకృష్ణ! ఆమెకు సంబంధించిన ఈ ప్రత్యేకత ష్యాషన్ రంగంలోనూ అమలవుతోంది. ఇక్కడ చెబుతున్నది చిన్న ఉదాహరణ మాత్రమే!
మనీష్ మల్హోత్రా
డిజైనర్ మనీష్ మల్హోత్రా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌తో పాటు పలువురు సెలబ్రిటీలకూ దుస్తులు డిజైన్ చేస్తుంటాడాయన. బాలీవుడ్‌లో ఏ ఈవెంట్ జరిగినా మనీష్ మల్హోత్రా కాస్ట్యూమ్స్ ఉండాల్సిందే.
ఫ్యాషన్ వరల్డ్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన ఈ డిజైనర్ బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ ప్రూవ్ చేసుకున్నాడు. ఫిల్మ్‌ఫేర్‌తో పాటు మరెన్నో అవార్డులనూ అందుకున్నాడు. అయితే అతని డిజైన్స్‌ను సామాన్యుడు అందుకోవాలంటే కాస్త కష్టమే. ఏది కొనాలన్నా ధర లక్షల్లోనే ఉంటుంది. ఆన్‌లైన్‌లో లభ్యం.
జైపూర్ జెమ్స్..
1974, ముంబైలో శ్రీపాదం సచేతి ప్రారంభించిన బంగారు ఆభరణాల వ్యాపారమే ఈ ‘జైపూర్ జెమ్స్’. అప్పట్లోనే కస్టమర్ కోరుకున్న డిజైన్స్‌లో ఆభరణాలను తయారుచేసి ఇచ్చేవారు. ఇలా వారికంటూ ఒక ప్రత్యేకత ఉండటంతో నలభై ఎనిమిదేళ్లుగా వారి వ్యాపారం జోరుగానే సాగుతోంది. ప్రస్తుతం చెన్నై, కోయంబత్తూర్‌లలోనూ జైపూర్ జెమ్స్‌కి స్టోర్స్ ఉన్నాయి. ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేసే వీలుంది.
బ్రాండ్ వాల్యూ
చీర బ్రాండ్: మనీష్ మల్హోత్రా
ధర: రూ. 2,75,000
జ్యూయెలరీ
బ్రాండ్: జైపూర్ జెమ్స్
ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.
నాకు డ్రీమ్‌రోల్స్ అంటూ ఏవీ లేవు. నాకొచ్చిన, వస్తున్నవన్నీ నేను కోరుకున్న పాత్రలే. కాబట్టి వాటినే నా డ్రీమ్‌రోల్స్ అనుకోవచ్చు! – రమ్యకృష్ణ
∙దీపిక కొండి
Comments
Please login to add a commentAdd a comment