
సాక్షి, హైదరాబాద్: నీలాంబరి.. అలియాస్.. శివగామి.. అలియాస్ రమ్యకృష్ణ. సినీ అభిమానులకు పరిచయం అక్కరలేని అందాల నటి రమ్యకృష్ట. రమ్యకృష్ణ ఉంటే ఆ సినిమా ఫ్లాప్ ఖాయం అన్న స్థాయినుంచి ఆమె నటిస్తే చాలు విజయం అదే వస్తుందన్న భరోసా కల్పించిన లెవల్ ఆమెది.
నీలాంబరిగా సవాల్ విసిరినా, రాజమాత శివగామిగా రాజ్యాన్ని పాలించినా ఆమెకే చెల్లు. టాలీవుడ్ అగ్ర కథానాయకులు అందరితోనూ సూపర్ డూపర్ మూవీల్లో నటించిన ఘనత రమ్యకృష్ణ సొంతం. పాత్ర ఏదైనా దాంట్లో ఇమిడిపోవడం ఆమె ప్రత్యేకత. కన్నులలో సరసపు వెన్నెల కురిపించే రమ్యకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా హ్యాపీ బర్త్‌డే అంటోంది సాక్షి.కామ్
Comments
Please login to add a commentAdd a comment