Liger Trailer Hashtag Trending On Social Media - Sakshi
Sakshi News home page

Liger Trailer: దుమ్ము లేపుతున్న లైగర్‌, కటౌట్‌ చూసి కొన్ని నమ్మేయాలంతే

Published Thu, Jul 21 2022 2:46 PM | Last Updated on Thu, Jul 21 2022 5:24 PM

Liger Trailer Trending On Social Media - Sakshi

విజయ్‌ దేవరకొండ నటించిన లేటెస్ట్‌ మూవీ లైగర్‌. ఈ సినిమా ఎలా ఉండబోతుందో సాంపుల్‌గా ట్రైలర్‌ వదిలారు మేకర్స్‌. డైలాగ్స్‌, యాక్షన్‌ సన్నివేశాలతో ట్రైలర్‌ దద్దరిల్లిపోయింది. ఇంతటి పవర్‌ఫుల్‌ వీడియో చూశాక ఫ్యాన్స్‌ ఊరుకుంటారా? సంతోషంతో లైగర్‌ హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్‌ చేస్తున్నారు. 'విజయ్‌, రమ్యకృష్ణలతో పాటు మైక్‌ టైసన్‌లు అదరగొట్టేశారు', 'ఈ వీడియో మొత్తంలో విజయ్‌, రమ్యకృష్ణలు మిగతావారిని డామినేట్‌ చేశారు', 'థియేట్రికల్‌ రిలీజ్‌ కోసం అందరు హీరోలు కష్టపడుతున్నారు.. కానీ విజయ్‌ మాత్రం తన సినిమా రిలీజ్‌ అవడానికి నెల రోజులు ముందే 75 అడుగుల కటౌట్‌తో థియేటర్‌ ముందు ప్రత్యక్షమయ్యాడు' అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఈ ట్రైలర్‌లో బాక్సర్‌గా అదరగొట్టేసిన విజయ్‌కు నత్తి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రమ్యకృష్ణ ఊరమాస్‌ తల్లిగా నటించినట్లు కనిపిస్తోంది. బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే కథానాయిక. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ఈ పాన్‌ ఇండియా మూవీ ఆగస్టు 25న రిలీజ్‌ కాబోతోంది.

చదవండి:  క్రాస్‌ బ్రీడ్‌ సార్‌ వాడు... ‘లైగర్‌’ ట్రైలర్‌ అదిరింది!
 ‘మీ టూ’.. తప్పు లేకపోతే ఇప్పటికి నన్నెందుకు వేధిస్తున్నారు?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement